By - Sathwik |14 May 2026 1:15 PM IST
మరో కొత్త పథకం అమలు దిశగా ఏపీ సర్కార్ అడుగులు
డ్వాక్రా మహిళల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఆడపిల్లల వివాహ సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా 'కల్యాణలక్ష్మి' పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మే 23న అధికారికంగా ప్రారంభించనున్నారు. గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తున్న సెర్ప్ మరియు స్త్రీనిధి సంస్థలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల కుమార్తెల వివాహాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. వివాహ ఖర్చుల కోసం రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం మంజూరు చేయబడుతుంది. ఈ రుణంపై కేవలం 4 శాతం వడ్డీ మాత్రమే ఉండగా, ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు విధించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. తీసుకున్న రుణ మొత్తాన్ని లబ్ధిదారులు సులభమైన ఈఎంఐల రూపంలో గరిష్టంగా 48 నెలల వరకు చెల్లించే అవకాశం కల్పించనున్నారు.
'అమ్మాయి పెళ్లి ఆర్థిక భారం కాదు.. ఆమె గౌరవం' అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలుకు రూ.250 కోట్ల వరకు నిధులు కేటాయించే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రతి ఏడాది కనీసం 25 వేల మంది డ్వాక్రా మహిళల కుమార్తెలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకానికి అర్హత పొందాలంటే మహిళ కనీసం ఆరు నెలలుగా డ్వాక్రా సంఘ సభ్యురాలిగా ఉండాలి. అదేవిధంగా బ్యాంకులు, స్త్రీనిధి లేదా ఇతర రుణాలను సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి. లబ్ధిదారులు స్థానిక వెలుగు కార్యాలయం లేదా గ్రామ స్థాయి సిబ్బంది ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివాహానికి సంబంధించిన లగ్నపత్రిక, పెళ్లి కార్డు, ఖర్చుల అంచనా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పత్రాల పరిశీలన అనంతరం 48 గంటల్లో రుణం మంజూరు చేసి, డబ్బును నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.
డ్వాక్రా మహిళల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆడపిల్లల వివాహ సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా 'కల్యాణలక్ష్మి' పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మే 23న అధికారికంగా ప్రారంభించనున్నారు. గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత కోసం పనిచేస్తున్న సెర్ప్ మరియు స్త్రీనిధి సంస్థలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల కుమార్తెల వివాహాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. వివాహ ఖర్చుల కోసం రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం మంజూరు చేయబడుతుంది. ఈ రుణంపై కేవలం 4 శాతం వడ్డీ మాత్రమే ఉండగా, ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు విధించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. తీసుకున్న రుణ మొత్తాన్ని లబ్ధిదారులు సులభమైన ఈఎంఐల రూపంలో గరిష్టంగా 48 నెలల వరకు చెల్లించే అవకాశం కల్పించనున్నారు.

