By - Sathwik |15 May 2026 3:45 PM IST
యుద్ధవిమానాల టెస్టింగ్ కేంద్రానికి శంకుస్థాపన
పుట్టపర్తి పేరు వినగానే ఇప్పటివరకు ఆధ్యాత్మికత, సత్యసాయిబాబా సేవా కార్యక్రమాలే గుర్తుకొచ్చేవి.
ఇకపై అదే పుట్టపర్తి దేశ రక్షణ రంగంలోనూ కీలక కేంద్రంగా మారబోతోంది. భారత వైమానిక శక్తికి కొత్త దిశ చూపించే అత్యాధునిక యుద్ధ విమానాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన జరగడంతో రాయలసీమలో కొత్త ఆశలు మొదలయ్యాయి. సీఎం చంద్రబాబు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రక్షణ రంగంలో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ స్థాయిలో ఏర్పాటు చేయబోతున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుతోంది. సుమారు రూ.15,800 కోట్ల వ్యయంతో 550 నుంచి 650 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎరో కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. భవిష్యత్ యుద్ధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కృత్రిమ మేధస్సు ఆధారిత అత్యాధునిక ఫైటర్ జెట్ల తయారీకి ఇక్కడ పునాది వేయనున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ప్రాధాన్యం పొందుతున్న అమెరికా ఎఫ్-35, రష్యా ఎస్‌యూ-57 తరహా యుద్ధ విమానాలకు పోటీగా నిలిచే సాంకేతికతను భారత్‌లోనే అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, రక్షణశాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తి దేశ రక్షణ పరిశ్రమకు కేంద్ర బిందువుగా మారనుంది. వందలాది మంది ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు ఇక్కడ సేవలందించనుండగా, ప్రత్యక్షంగా సుమారు 1,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. డ్రోన్స్, రక్షణ పరికరాల అభివృద్ధికి సంబంధించిన మరో 12 ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా శంకుస్థాపనలు చేశారు. దీంతో రాయలసీమలో పరిశ్రమల విస్తరణకు కొత్త ఊపు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న పుట్టపర్తి ఎయిర్‌స్ట్రిప్‌ను మరింత విస్తరించి, దాదాపు 10 వేల అడుగుల రన్‌వేగా అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. అధునాతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు, వాతావరణ సూచన కేంద్రాలు, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. రక్షణ రంగానికి అవసరమైన అన్ని సదుపాయాలతో పుట్టపర్తిని దేశంలోనే ప్రత్యేక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమ భవిష్యత్తుపై ఆశావహ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రతనాలసీమగా పేరొందిన ఈ ప్రాంతం తిరిగి అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. ఎన్‌టీఆర్ ప్రారంభించిన అభివృద్ధి సంకల్పాన్ని కొనసాగిస్తూ రాయసీమకు నీరు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకువస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని పేర్కొన్నారు.కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు ద్వారా దేశంలోనే ఆధునిక డ్రోన్ ఎకోసిస్టమ్‌కు శ్రీకారం చుట్టామని చంద్రబాబు వెల్లడించారు. రూ.686 కోట్లతో ఎనిమిది సంస్థలు అక్కడ ఏర్పాటవుతున్నాయని, వాటి ద్వారా సుమారు 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు జూన్‌లో ప్రారంభించి, 2028 నాటికి పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. అలాగే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టును ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను బంగారం ఉత్పత్తిలో దేశంలో ప్రత్యేక స్థానానికి తీసుకెళ్తామని సీఎం అన్నారు. ఈ ఏడాది 600 కిలోలు, వచ్చే ఏడాది 1,500 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. దేశ రక్షణకు ఏపీ కవచంలా నిలబడబోతుందని, రాయలసీమను మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.
పుట్టపర్తి పేరు వినగానే ఇప్పటివరకు ఆధ్యాత్మికత, సత్యసాయిబాబా సేవా కార్యక్రమాలే గుర్తుకొచ్చేవి. ఇకపై అదే పుట్టపర్తి దేశ రక్షణ రంగంలోనూ కీలక కేంద్రంగా మారబోతోంది. భారత వైమానిక శక్తికి కొత్త దిశ చూపించే అత్యాధునిక యుద్ధ విమానాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన జరగడంతో రాయలసీమలో కొత్త ఆశలు మొదలయ్యాయి. సీఎం చంద్రబాబు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రక్షణ రంగంలో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ స్థాయిలో ఏర్పాటు చేయబోతున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుతోంది. సుమారు రూ.15,800 కోట్ల వ్యయంతో 550 నుంచి 650 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎరో కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. భవిష్యత్ యుద్ధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కృత్రిమ మేధస్సు ఆధారిత అత్యాధునిక ఫైటర్ జెట్ల తయారీకి ఇక్కడ పునాది వేయనున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ప్రాధాన్యం పొందుతున్న అమెరికా ఎఫ్-35, రష్యా ఎస్‌యూ-57 తరహా యుద్ధ విమానాలకు పోటీగా నిలిచే సాంకేతికతను భారత్‌లోనే అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

