By - Sathwik |21 May 2026 1:00 PM IST
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు పచ్చజెండా
విశాఖపట్నం నగర అభివృద్ధికి మరింత వేగం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
నగర మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునికీకరణకు సంబంధించి ప్రతిపాదించిన మూడు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆమోదం లభించడంతో విశాఖ భవిష్యత్ పట్టణ ప్రణాళికలో కొత్త ముందడుగు పడినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల అమలుతో నగరంలో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా మారడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ ఎంపీ శ్రీభరత్ వెల్లడించిన వివరాల ప్రకారం, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) పథకం కింద గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ప్రతిపాదించిన మూడు అభివృద్ధి ప్రాజెక్టులకు నేషనల్ అపెక్స్ కమిటీ (NAC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.1,501.03 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులు అమలులోకి రానున్నాయి.
మధురవాడ జోన్ పరిధిలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను మరింత విస్తరించి ఆధునికీకరించేందుకు రూ.658.61 కోట్లు ఖర్చు చేయనున్నారు. నగర విస్తరణకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు అధికారులు భావిస్తున్నారు. అలాగే అదే ప్రాంతంలో స్మార్ట్ తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధికి రూ.725.18 కోట్లు కేటాయించారు. ఈ వ్యవస్థ ద్వారా నీటి సరఫరా నిర్వహణ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారనుంది. ఇక బల్క్ మరియు సెమీ బల్క్ నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ కోసం రూ.117.24 కోట్లతో ప్రత్యేక పనులు చేపట్టనున్నారు. ఈ మూడు ప్రాజెక్టుల అమలుతో విశాఖ నగర మౌలిక వసతులు మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.
విశాఖపట్నం నగర అభివృద్ధికి మరింత వేగం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగర మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునికీకరణకు సంబంధించి ప్రతిపాదించిన మూడు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఆమోదం లభించడంతో విశాఖ భవిష్యత్ పట్టణ ప్రణాళికలో కొత్త ముందడుగు పడినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల అమలుతో నగరంలో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా మారడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ ఎంపీ శ్రీభరత్ వెల్లడించిన వివరాల ప్రకారం, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) పథకం కింద గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ప్రతిపాదించిన మూడు అభివృద్ధి ప్రాజెక్టులకు నేషనల్ అపెక్స్ కమిటీ (NAC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.1,501.03 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులు అమలులోకి రానున్నాయి.

