By - Sathwik |17 May 2026 7:45 PM IST
ఏపీలో కళ్యాణలక్ష్మి పథకం
కుటుంబంలో పెళ్లి అంటే ఆనందం ఎంత ఉంటుందో, ఆర్థిక భారం కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు కుమార్తె వివాహం అనగానే ఖర్చుల ఆలోచన ముందుకు వస్తుంది.
పెళ్లి ఏర్పాట్లు, సంప్రదాయాలు, ఇతర అవసరాల కారణంగా చాలామంది అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కుటుంబాలకు కొంత ఊరట కలిగించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. కుమార్తెల వివాహాల కోసం ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో 'కళ్యాణలక్ష్మి' పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలు, అంటే డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ప్రత్యేకంగా రుణ సదుపాయం కల్పించనున్నారు. తమ కుమార్తెల వివాహాల కోసం అవసరమైన ఖర్చులను సమకూర్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ పథకం ఉపయోగపడేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు కనిష్టంగా రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.1 లక్ష వరకు రుణం అందించే ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుతో, పావలా వడ్డీ విధానంలో అందించనుండటం విశేషం.
ఈ సదుపాయం పొందేందుకు కొన్ని అర్హత నిబంధనలు కూడా నిర్ణయించినట్లు సమాచారం. దరఖాస్తు చేసుకునే మహిళ కనీసం ఆరు నెలలుగా ఏదైనా డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉండాలి. అలాగే ఆ సంఘానికి 'ఏ' లేదా 'బీ' గ్రేడ్ గుర్తింపు ఉండాల్సి ఉంటుంది. గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల విషయంలో చెల్లింపులు సక్రమంగా పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వివాహం చేసుకోబోయే కుమార్తె వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండటం కూడా తప్పనిసరి నిబంధనగా పేర్కొంటున్నారు. దరఖాస్తు ప్రక్రియను గ్రామ, వార్డు స్థాయిలో సులభతరం చేయాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు. అర్హులైన మహిళలు తమ ప్రాంతంలోని స్వర్ణ గ్రామ లేదా స్వర్ణ వార్డు కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో వివాహ శుభలేఖ లేదా వివాహ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు పరిశీలన పూర్తైన తర్వాత అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో రుణ మొత్తాన్ని నేరుగా జమ చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ పథకంపై మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అధిక వడ్డీలతో అప్పులు చేసి ఇబ్బందులు పడే పరిస్థితులు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ పథకాన్ని అధికారికంగా ఎప్పటి నుంచి అమలు చేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
కుటుంబంలో పెళ్లి అంటే ఆనందం ఎంత ఉంటుందో, ఆర్థిక భారం కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు కుమార్తె వివాహం అనగానే ఖర్చుల ఆలోచన ముందుకు వస్తుంది. పెళ్లి ఏర్పాట్లు, సంప్రదాయాలు, ఇతర అవసరాల కారణంగా చాలామంది అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కుటుంబాలకు కొంత ఊరట కలిగించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. కుమార్తెల వివాహాల కోసం ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో 'కళ్యాణలక్ష్మి' పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలు, అంటే డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ప్రత్యేకంగా రుణ సదుపాయం కల్పించనున్నారు. తమ కుమార్తెల వివాహాల కోసం అవసరమైన ఖర్చులను సమకూర్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ పథకం ఉపయోగపడేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు కనిష్టంగా రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.1 లక్ష వరకు రుణం అందించే ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుతో, పావలా వడ్డీ విధానంలో అందించనుండటం విశేషం.

