By - Sathwik |19 May 2026 12:00 PM IST
నేడే అకౌంట్లలోకి రూ.20 వేలు జమ
ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
వేట నిషేధ కాలంలో ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొనే మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. కుటుంబాల జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలన్న ఉద్దేశంతో ప్రత్యేక సహాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారుల జీవన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వేటకు విరామం ఉన్న సమయంలో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం భావిస్తోందని ఆయన తెలిపారు. ఈ మేరకు 'మత్స్యకారుల సేవలో' పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈసారి మొత్తం 1.30 లక్షల మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల మేర నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్యను పెంచినట్లు చెప్పారు. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ అర్హులైన వారందరికీ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత రెండేళ్లలోనే వేట నిషేధ భృతి రూపంలో రూ.505 కోట్ల సహాయాన్ని అందించినట్లు మంత్రి తెలిపారు. ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు కూడా సకాలంలో పరిహారం అందిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా మత్స్యకారుల ఆదాయ వనరులను పెంచే లక్ష్యంతో సీవీడ్ సాగును కూడా ప్రోత్సహిస్తూ, భవిష్యత్తులో వారికి మరింత స్థిరమైన ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేట నిషేధ కాలంలో ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొనే మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. కుటుంబాల జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలన్న ఉద్దేశంతో ప్రత్యేక సహాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారుల జీవన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వేటకు విరామం ఉన్న సమయంలో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం భావిస్తోందని ఆయన తెలిపారు. ఈ మేరకు 'మత్స్యకారుల సేవలో' పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు.

