Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP: గ్రామకంఠం సమస్యలకు ఏపీ సర్కార్ తెర

AP: గ్రామకంఠం సమస్యలకు ఏపీ సర్కార్ తెర

TV5 News 5 days ago

By - Sathwik |19 May 2026 5:15 PM IST

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ కు ఓకే.. స్థలాల యజమానులకు భారీ ఉపశమనం

దశాబ్దాలుగా గ్రామకంఠం భూముల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పరిష్కార మార్గం చూపింది.

ముఖ్యంగా వారసత్వంగా వస్తున్న ఇళ్లు, స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లలో నెలకొన్న అడ్డంకులను తొలగిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పాత నివాస ప్రాంతాల ఆస్తి యజమానులకు భారీ ఊరట లభించనుంది. భూముల కొనుగోలు, విక్రయాలతో పాటు రుణాల విషయంలో కూడా ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో నివాస అవసరాల కోసం వినియోగించే ప్రాంతాలను సాధారణంగా 'గ్రామకంఠం'గా పిలుస్తారు. ఇవి ప్రభుత్వ భూములుగా పరిగణించబడవు. అయితే వెబ్‌లాండ్ రికార్డుల్లో సరైన సబ్-డివిజన్లు లేకపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో ఈ భూములు 22A నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయి. ఈ కారణంగా తరతరాలుగా వస్తున్న ఇళ్లు, స్థలాలను విక్రయించాలన్నా, బదలాయించాలన్నా ఆస్తి యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాత ఇళ్లకు సంబంధించి సరైన లింకు పత్రాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది.

కొత్త మార్గదర్శకాలు జారీ

ఈ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. వీటి ప్రకారం వెబ్‌లాండ్ రికార్డుల్లో ఏదైనా సర్వే నంబరు గ్రామకంఠంగా నమోదై ఉంటే, అది 22A జాబితాలో ఉన్నా లేదా లేకపోయినా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వ మినహాయింపుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అదే విధంగా పాత ఇళ్ల విషయంలో లింకు డాక్యుమెంట్లు లేకపోయినా రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. స్థానిక సంస్థలు, పంచాయతీలు లేదా మున్సిపాలిటీలు జారీ చేసే ఇంటి పన్ను రశీదులను ప్రామాణిక ఆధారంగా స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారసత్వ ఖాళీ స్థలాలకు సంబంధించి ఖాళీ స్థల పన్ను (వీఎల్టీ) రశీదులను కూడా గుర్తింపు పత్రాలుగా పరిగణించాలని సూచించారు. పాత ఆస్తులకు లింకు పత్రాలు అందుబాటులో లేకపోవడం సాధారణ విషయమేనని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో లింకు డాక్యుమెంట్లు లేవనే కారణంతో దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేయకూడదని రిజిస్ట్రేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. కొన్ని చోట్ల ఖాళీ స్థలాలకు పన్ను రశీదులు కూడా లేకపోవడంతో అలాంటి వారికి స్వయం ధ్రువీకరణ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆస్తి తమకు వారసత్వంగా వచ్చిందని, ప్రస్తుతం తామే అనుభవిస్తున్నామని, అది 22A పరిధిలోకి రాదని యజమానులు రిజిస్ట్రేషన్ పత్రాల్లో స్వయంగా ప్రకటించే అవకాశాన్ని కల్పించారు. ఈ ప్రక్రియ కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి ధ్రువపత్రాలు తీసుకురావాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామాలు, పట్టణాల్లోని పాత నివాస ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ఆస్తి యజమానులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం కావడంతో పాటు భూముల క్రయవిక్రయాలు వేగవంతం కావచ్చు. అదే సమయంలో ఈ ఆస్తులను ఆధారంగా చేసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల అమలును వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే సూచనలు అందాయి.

దశాబ్దాలుగా గ్రామకంఠం భూముల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పరిష్కార మార్గం చూపింది. ముఖ్యంగా వారసత్వంగా వస్తున్న ఇళ్లు, స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లలో నెలకొన్న అడ్డంకులను తొలగిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పాత నివాస ప్రాంతాల ఆస్తి యజమానులకు భారీ ఊరట లభించనుంది. భూముల కొనుగోలు, విక్రయాలతో పాటు రుణాల విషయంలో కూడా ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో నివాస అవసరాల కోసం వినియోగించే ప్రాంతాలను సాధారణంగా 'గ్రామకంఠం'గా పిలుస్తారు. ఇవి ప్రభుత్వ భూములుగా పరిగణించబడవు. అయితే వెబ్‌లాండ్ రికార్డుల్లో సరైన సబ్-డివిజన్లు లేకపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో ఈ భూములు 22A నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయి. ఈ కారణంగా తరతరాలుగా వస్తున్న ఇళ్లు, స్థలాలను విక్రయించాలన్నా, బదలాయించాలన్నా ఆస్తి యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాత ఇళ్లకు సంబంధించి సరైన లింకు పత్రాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది.

కొత్త మార్గదర్శకాలు జారీ

కొత్త మార్గదర్శకాలు జారీ

కొత్త మార్గదర్శకాలు జారీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu