Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP: జోగి రమేశ్ అండతోనే నకిలీ మద్యం తయారీ

AP: జోగి రమేశ్ అండతోనే నకిలీ మద్యం తయారీ

TV5 News 5 days ago

By - Sathwik |19 May 2026 10:00 AM IST

1,300 పేజీలతో చివరి ఛార్జిషీట్‌ వేసిన సిట్.. మంత్రి అయ్యాకా పూర్తిగా సహకరించిన జోగి రమేశ్.. 2-3 నెలలకోసారి రూ.3-5లక్షల చొప్పున ముడుపులు

నకి­లీ మద్యం తయా­రీ కే­సు­లో దర్యా­ప్తు సం­స్థ­లు దా­ఖ­లు చే­సిన తుది అభి­యో­గ­ప­త్రం రా­జ­కీయ, ఆర్థిక, వ్యా­పార సం­బం­ధా­ల­పై కీలక అం­శా­ల­ను వె­లు­గు­లో­కి తె­చ్చి­న­ట్లు వె­ల్ల­డైం­ది. గత కొ­న్నే­ళ్లు­గా సా­గిన మద్యం వ్యా­పార అను­బం­ధా­లు, భా­గ­స్వా­మ్యా­లు, ఆర్థిక లా­వా­దే­వీ­లు, తరచూ జరి­గిన సమా­వే­శాల నే­ప­థ్యం­లో ఈ వ్య­వ­హా­రం కే­వ­లం అక్రమ మద్యం తయా­రీ వరకే పరి­మి­తం కా­లే­ద­ని, దీని వె­నుక వి­స్తృత స్థా­యి నె­ట్‌­వ­ర్క్ పని­చే­సి­న­ట్లు అధి­కా­రు­లు తమ ని­వే­ది­క­లో పే­ర్కొ­న్న­ట్లు సమా­చా­రం. నిం­ది­తుల మధ్య ఉన్న పరి­చ­యా­లు, డబ్బు బది­లీ­లు, కాల్ రి­కా­ర్డు­లు వంటి ఆధా­రా­ల­ను సమ­గ్రం­గా పరి­శీ­లిం­చిన తర్వాత ఈ కేసు ఛా­ర్జి­షీ­ట్‌­ను కో­ర్టు­లో సమ­ర్పిం­చా­రు.మ గతే­డా­ది రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా చర్చ­నీ­యాం­శ­మైన నకి­లీ మద్యం వ్య­వ­హా­రం­లో సి­ట్‌, ఎక్సై­జ్‌ అధి­కా­రు­లు సు­మా­రు 1,300 పే­జీ­ల­తో కూ­డిన తుది ఛా­ర్జి­షీ­ట్‌­ను దా­ఖ­లు చే­శా­రు. ఇం­దు­లో మొ­త్తం 25 మం­ది­ని నిం­ది­తు­లు­గా చే­ర్చ­గా, 89 మం­ది­ని సా­క్షు­లు­గా గు­ర్తిం­చి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు. ప్ర­ధాన నిం­ది­తు­డు అద్దే­ప­ల్లి జనా­ర్ద­న­రా­వు అక్రమ మద్యం తయా­రీ కా­ర్య­క­లా­పా­ల­ను వి­స్త­రిం­చేం­దు­కు రా­జ­కీయ, వ్యా­పార అను­బం­ధా­ల­ను వి­ని­యో­గిం­చు­కు­న్న­ట్లు దర్యా­ప్తు­లో తే­లిం­ద­ని అధి­కా­రు­లు వి­వ­రిం­చా­రు. మాజీ మం­త్రి జోగి రమే­ష్‌, ఆయన కు­టుంబ సభ్యు­ల­తో ఉన్న సన్ని­హిత సం­బం­ధా­లు కూడా ఇం­దు­లో కీ­ల­కం­గా ప్ర­స్తా­విం­చ­బ­డ్డా­యి. దర్యా­ప్తు ప్ర­కా­రం, ఇబ్ర­హీం­ప­ట్నం కేం­ద్రం­గా ప్రా­రం­భ­మైన మద్యం వ్యా­పార భా­గ­స్వా­మ్యా­లు కా­ల­క్ర­మం­లో వి­స్త­రిం­చా­యి. గతం­లో కలి­సి బా­ర్లు ని­ర్వ­హిం­చిన పరి­చ­యం ఆధా­రం­గా ఈ బంధం మరింత బల­ప­డి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు. వై­సీ­పీ ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత ఈ సం­బం­ధా­లు మరింత పె­రి­గా­య­ని, అనం­త­రం తె­లం­గాణ నుం­చి నా­న్‌ డ్యూ­టీ పె­యి­డ్‌ లి­క్క­ర్‌­ను తీ­సు­కు­వ­చ్చి ఏపీ­లో వి­క్ర­యిం­చే వ్య­వ­హా­రా­లు కూడా సా­గి­న­ట్లు వి­వ­రిం­చా­రు.

ఇబ్ర­హీం­ప­ట్నం­లో­ని పాత బా­ర్‌ ప్రాం­గ­ణం­లో నకి­లీ మద్యం తయా­రీ ప్రా­రం­భ­మైం­ద­ని, అక్కడ తయా­రైన మద్యం వి­విధ ప్ర­ముఖ బ్రాం­డ్ల పే­ర్ల­తో వి­క్ర­యిం­చ­బ­డిం­ద­ని దర్యా­ప్తు అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. సీ­సా­ల్లో నిం­పిన నకి­లీ మద్యం­పై నకి­లీ స్టి­క్క­ర్లు అతి­కిం­చి మా­ర్కె­ట్లో వి­క్ర­యిం­చ­డం ద్వా­రా గణ­నీ­య­మైన లా­భా­లు పొం­ది­న­ట్లు గు­ర్తిం­చి­న­ట్లు తె­లి­పా­రు. అనం­త­రం ము­ల­క­ల­చె­రు­వు­లో మరో కేం­ద్రా­న్ని ఏర్పా­టు చేసి కా­ర్య­క­లా­పా­ల­ను వి­స్త­రిం­చా­ర­ని వె­ల్ల­డిం­చా­రు. ఇక ఈ కే­సు­లో ఆర్థిక లా­వా­దే­వీ­లు కూడా కీలక ఆధా­రా­లు­గా మా­రా­యి. ప్ర­ధాన నిం­ది­తుల నుం­చి వి­విధ దశ­ల్లో పె­ద్ద మొ­త్తం­లో నగదు బది­లీ­లు జరి­గి­న­ట్లు దర్యా­ప్తు­లో గు­ర్తిం­చి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు. కొ­న్ని మొ­త్తా­లు నే­రు­గా నగదు రూ­పం­లో అం­దిం­చ­గా, వ్యా­పార సం­స్థల ఖా­తాల ద్వా­రా జమ అయి­న­ట్లు అధి­కా­రు­లు వి­వ­రిం­చా­రు. బ్యాం­క్‌ లా­వా­దే­వీ­ల­ను పరి­శీ­లిం­చ­గా కో­ట్ల అను­మా­నా­స్పద బది­లీ­లు జరి­గి­న­ట్లు తే­లిం­ద­ని పే­ర్కొ­న్నా­రు.

అలా­గే కా­ల్‌ డీ­టె­యి­ల్‌ రి­కా­ర్డు­లు కూడా ఈ కే­సు­లో కీలక పా­త్ర పో­షిం­చి­న­ట్లు దర్యా­ప్తు అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. నిం­ది­తుల మొ­బై­ల్‌ టవ­ర్‌ లొ­కే­ష­న్లు, పర­స్పర కా­ల్స్‌, సమా­వే­శాల సమ­యా­లు పరి­శీ­లిం­చ­గా అనేక సం­ద­ర్భా­ల్లో వారు ఒకే ప్రాం­తా­ల్లో ఉన్న­ట్లు గు­ర్తిం­చి­న­ట్లు తె­లి­పా­రు. ఈ ఆధా­రా­ల­న్నిం­టి­నీ కో­ర్టు ముం­దుం­చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu