Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP: రతనాల సీమ, ఉద్యాన సీమ ఇక " దేశ రక్షణ సీమ"

AP: రతనాల సీమ, ఉద్యాన సీమ ఇక " దేశ రక్షణ సీమ"

TV5 News 1 week ago

By - Sathwik |16 May 2026 12:00 PM IST

కొ­త్త గు­ర్తిం­పు­నకు సి­ద్ధ­మ­వు­తోన్న రాయలసీమ

ఒక­ప్పు­డు కరవు, వల­స­లు, వె­ను­క­బా­టు­త­నా­ని­కి ప్ర­తీ­క­గా చె­ప్పు­కు­నే రా­య­ల­సీమ ఇప్పు­డు కొ­త్త గు­ర్తిం­పు­కు సి­ద్ధ­మ­వు­తోం­ది.

వ్య­వ­సా­యం, ఉద్యా­న­వ­నా­లు, ఖనిజ సం­ప­ద­తో ముం­దు­కు సా­గు­తు­న్న ఈ ప్రాం­తం ఇకపై దేశ రక్షణ రం­గం­లో­నూ కీలక పా­త్ర పో­షిం­చ­బో­తోం­ది. భారత రక్షణ సా­మ­ర్థ్యా­న్ని మరింత బలో­పే­తం చేసే అత్యా­ధు­నిక యు­ద్ధ వి­మా­నాల తయా­రీ కేం­ద్రం­గా శ్రీ సత్య­సా­యి జి­ల్లా పు­ట్ట­ప­ర్తి రూ­పు­ది­ద్దు­కో­బో­తోం­ది. దేశ భద్ర­తా రం­గం­లో స్వ­దే­శీ సాం­కే­తి­క­త­కు నాం­ది పలి­కే అడ్వా­న్స్‌­డ్ మీ­డి­యం కాం­బా­ట్ ఎయి­ర్‌­క్రా­ఫ్ట్ (ఏఎం­సీఏ) ప్రా­జె­క్టు­కు శు­క్ర­వా­రం ఘనం­గా శం­కు­స్థా­పన జర­గ­డం­తో రా­య­ల­సీమ అభి­వృ­ద్ధి చరి­త్ర­లో మరో కీలక అధ్యా­యం ప్రా­రం­భ­మైం­ది. ఈ కా­ర్య­క్ర­మా­ని­కి కేం­ద్ర రక్షణ మం­త్రి రాజ్ నాథ్ సిం­గ్, ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు, మం­త్రి నారా లో­కే­శ్ హా­జ­రై భూ­మి­పూజ ని­ర్వ­హిం­చా­రు. కేం­ద్ర, రా­ష్ట్ర ప్ర­భు­త్వాల సమ­న్వ­యం­తో చే­ప­డు­తు­న్న ఈ ప్ర­తి­ష్టా­త్మక ప్రా­జె­క్టు­ను ఏరో­నా­టి­క­ల్ డె­వ­ల­ప్‌­మెం­ట్ ఏజె­న్సీ (ఏడీఏ), డీ­ఆ­ర్డీ­వో సం­యు­క్తం­గా అమలు చే­య­ను­న్నా­యి. దా­దా­పు రూ.15,803 కో­ట్ల భారీ వ్య­యం­తో 650 ఎక­రా­ల్లో ఈ ప్రా­జె­క్టు­ను అభి­వృ­ద్ధి చే­య­ను­న్నా­రు. భా­ర­త­దే­శం­లో తొలి 5వ తరం స్టె­ల్త్ మల్టీ రోల్ ఫై­ట­ర్ ఎయి­ర్‌­క్రా­ఫ్ట్ ప్రా­జె­క్ట్ కా­వ­డం దీ­ని­కి మరింత ప్రా­ధా­న్య­త­ను తీ­సు­కొ­చ్చిం­ది.

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా..

భవి­ష్య­త్ యు­ద్ధ అవ­స­రా­ల­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని రూ­పొం­ది­స్తు­న్న ఈ యు­ద్ధ వి­మా­నా­లు అత్యా­ధు­నిక సాం­కే­తి­క­త­తో తయా­రు­కా­ను­న్నా­యి. స్టె­ల్త్ టె­క్నా­ల­జీ, ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్ ఆధా­రిత వ్య­వ­స్థ­లు, మల్టీ రోల్ సా­మ­ర్థ్యా­ల­తో భారత వై­మా­నిక దళా­ని­కి కొ­త్త బలం చే­కూ­ర­నుం­ది. అం­త­ర్జా­తీ­యం­గా అమె­రి­కా ఎఫ్-35, రష్యా ఎస్‌­యూ-57 తరహా యు­ద్ధ వి­మా­నా­ల­కు పో­టీ­గా ని­లి­చే స్థా­యి­లో ఈ ప్రా­జె­క్టు­ను రూ­పు­ది­ద్దు­తు­న్న­ట్లు అధి­కా­రు­లు పే­ర్కొం­టు­న్నా­రు. ఏఎం­సీఏ ప్రా­జె­క్టు పూ­ర్త­యిన తర్వాత యు­ద్ధ వి­మా­నాల అభి­వృ­ద్ధి, టె­స్టిం­గ్, ని­ర్వ­హణ కా­ర్య­క­లా­పా­లు అన్నీ పు­ట్ట­ప­ర్తి కేం­ద్రం­గా­నే కొ­న­సా­గ­ను­న్నా­యి. దీ­ని­వ­ల్ల ప్ర­త్య­క్షం­గా దా­దా­పు 7,500 మం­ది­కి ఉద్యోగ అవ­కా­శా­లు లభిం­చ­ను­న్నా­య­ని అం­చ­నా వే­స్తు­న్నా­రు. అం­తే­కా­కుం­డా అను­బంధ పరి­శ్ర­మ­లు, సేవా రం­గా­లు, చి­న్న­త­ర­హా యూ­ని­ట్లు ఏర్ప­డ­టం ద్వా­రా భవి­ష్య­త్తు­లో లక్ష కో­ట్ల రూ­పా­యల వరకు పె­ట్టు­బ­డు­లు ఆక­ర్షి­త­మ­య్యే అవ­కా­శం ఉం­ద­ని ప్ర­భు­త్వం భా­వి­స్తోం­ది. దీం­తో రా­య­ల­సీమ పా­రి­శ్రా­మిక పటం­లో కీలక ప్రాం­తం­గా ఎద­గ­నుం­ది. ఈ సం­ద­ర్భం­గా ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు మా­ట్లా­డు­తూ రా­య­ల­సీ­మ­ను మళ్లీ రత­నాల సీ­మ­గా తీ­ర్చి­ది­ద్దే ది­శ­గా ప్ర­భు­త్వం కృషి చే­స్తోం­ద­న్నా­రు. ఒక­ప్పు­డు ఎడా­రి­లా కని­పిం­చిన ఈ ప్రాం­తం ఇప్పు­డు పరి­శ్ర­మ­లు, నీటి ప్రా­జె­క్టు­లు, సాం­కే­తిక రంగ అభి­వృ­ద్ధి­తో కొ­త్త ది­శ­గా ప్ర­యా­ణి­స్తోం­ద­ని పే­ర్కొ­న్నా­రు. దేశ రక్షణ రం­గా­ని­కి ఏపీ కీలక కేం­ద్రం­గా మా­ర­బో­తోం­ద­ని, ఈ ప్రా­జె­క్టు­లు రా­ష్ట్ర యు­వ­త­కు పె­ద్ద ఎత్తున ఉపా­ధి అవ­కా­శా­లు కల్పి­స్తా­య­ని చె­ప్పా­రు. పు­ట్ట­ప­ర్తి­లో జరి­గిన ఈ కా­ర్య­క్ర­మం­లో ఏఎం­సీఏ ప్రా­జె­క్టు­తో పాటు మరో 12 రక్షణ, డ్రో­న్ రం­గా­ల­కు సం­బం­ధిం­చిన ప్రా­జె­క్టు­ల­కు కూడా శం­కు­స్థా­ప­న­లు చే­శా­రు. ఈ ప్రా­జె­క్టుల ద్వా­రా మొ­త్తం రూ.4,145 కో­ట్ల పె­ట్టు­బ­డు­లు రా­ష్ట్రా­ని­కి రా­నుం­డ­గా, సు­మా­రు 6,071 మం­ది­కి ఉద్యోగ అవ­కా­శా­లు లభిం­చ­ను­న్నా­యి. రక్షణ, డ్రో­న్, ఏరో­స్పే­స్ రం­గా­ల్లో దే­శ­వ్యా­ప్తం­గా గు­ర్తిం­పు పొం­దిన పలు ప్ర­ముఖ సం­స్థ­లు ఈ పె­ట్టు­బ­డు­ల్లో భా­గ­స్వా­మ్యం అవు­తు­న్నా­యి.

కళ్యా­ణి స్ట్రా­ట­జి­క్ సం­స్థ రూ.1,430 కో­ట్ల పె­ట్టు­బ­డి­తో భారీ ప్రా­జె­క్టు­ను చే­ప­డు­తుం­డ­గా, HFCL రూ.1,040 కో­ట్ల­తో మరో కీలక యూ­ని­ట్‌­ను ఏర్పా­టు చే­య­నుం­ది. భా­ర­త్ డై­న­మి­క్ లి­మి­టె­డ్ సం­స్థ రూ.489 కో­ట్ల పె­ట్టు­బ­డి­తో రక్షణ రంగ తయా­రీ యూ­ని­ట్‌­ను అభి­వృ­ద్ధి చే­య­నుం­ది. అలా­గే ప్రీ­మి­య­ర్ ఎక్స్‌­ప్లో­జి­వ్స్, డ్రో­గో డ్రో­న్స్, హె­చ్‌­సీ రో­బో­టి­క్స్, ఎయి­ర్ పేస్ ఇం­డ­స్ట్రీ­స్, జే­డీ­కే ఫ్లై డ్రో­న్ వర­ల్డ్, సె­న్స్ ఇమే­జ్ టె­క్నా­ల­జీ­స్, అల్గో­బా­టి­క్స్, లా­ట్రి­క్ ఏరో స్పే­స్, డ్రో­న్ ల్యా­బ్ టె­క్నా­ల­జీ­స్ వంటి సం­స్థ­లు కూడా తమ ప్రా­జె­క్టు­ల­ను ప్రా­రం­భిం­చ­ను­న్నా­యి. ఈ పరి­శ్ర­మ­లు ప్ర­ధా­నం­గా మడ­క­శిర, దొ­న­కొండ, నె­ల్లూ­రు, కర్నూ­లు డ్రో­న్ సిటీ ప్రాం­తా­ల్లో ఏర్పా­టు కా­ను­న్నా­యి. ము­ఖ్యం­గా కర్నూ­లు­లో అభి­వృ­ద్ధి చే­స్తు­న్న డ్రో­న్ సిటీ ప్రా­జె­క్టు దే­శం­లో­నే అత్యా­ధు­నిక డ్రో­న్ ఎకో­సి­స్ట­మ్‌­గా రూ­పు­ది­ద్దు­కో­నుం­ద­ని ప్ర­భు­త్వం చె­బు­తోం­ది. డ్రో­న్ తయా­రీ, పరి­శో­ధన, టె­స్టిం­గ్, శి­క్షణ రం­గా­ల్లో ఈ కేం­ద్రం కీ­ల­కం­గా మా­ర­నుం­ది. వ్య­వ­సా­యం నుం­చి రక్షణ రంగం వరకు వి­స్త­రిం­చే డ్రో­న్ టె­క్నా­ల­జీ­కి ఏపీ ప్ర­ధాన హబ్‌­గా మారనుంది.

ఒక­ప్పు­డు కరవు, వల­స­లు, వె­ను­క­బా­టు­త­నా­ని­కి ప్ర­తీ­క­గా చె­ప్పు­కు­నే రా­య­ల­సీమ ఇప్పు­డు కొ­త్త గు­ర్తిం­పు­కు సి­ద్ధ­మ­వు­తోం­ది. వ్య­వ­సా­యం, ఉద్యా­న­వ­నా­లు, ఖనిజ సం­ప­ద­తో ముం­దు­కు సా­గు­తు­న్న ఈ ప్రాం­తం ఇకపై దేశ రక్షణ రం­గం­లో­నూ కీలక పా­త్ర పో­షిం­చ­బో­తోం­ది. భారత రక్షణ సా­మ­ర్థ్యా­న్ని మరింత బలో­పే­తం చేసే అత్యా­ధు­నిక యు­ద్ధ వి­మా­నాల తయా­రీ కేం­ద్రం­గా శ్రీ సత్య­సా­యి జి­ల్లా పు­ట్ట­ప­ర్తి రూ­పు­ది­ద్దు­కో­బో­తోం­ది. దేశ భద్ర­తా రం­గం­లో స్వ­దే­శీ సాం­కే­తి­క­త­కు నాం­ది పలి­కే అడ్వా­న్స్‌­డ్ మీ­డి­యం కాం­బా­ట్ ఎయి­ర్‌­క్రా­ఫ్ట్ (ఏఎం­సీఏ) ప్రా­జె­క్టు­కు శు­క్ర­వా­రం ఘనం­గా శం­కు­స్థా­పన జర­గ­డం­తో రా­య­ల­సీమ అభి­వృ­ద్ధి చరి­త్ర­లో మరో కీలక అధ్యా­యం ప్రా­రం­భ­మైం­ది. ఈ కా­ర్య­క్ర­మా­ని­కి కేం­ద్ర రక్షణ మం­త్రి రాజ్ నాథ్ సిం­గ్, ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు, మం­త్రి నారా లో­కే­శ్ హా­జ­రై భూ­మి­పూజ ని­ర్వ­హిం­చా­రు. కేం­ద్ర, రా­ష్ట్ర ప్ర­భు­త్వాల సమ­న్వ­యం­తో చే­ప­డు­తు­న్న ఈ ప్ర­తి­ష్టా­త్మక ప్రా­జె­క్టు­ను ఏరో­నా­టి­క­ల్ డె­వ­ల­ప్‌­మెం­ట్ ఏజె­న్సీ (ఏడీఏ), డీ­ఆ­ర్డీ­వో సం­యు­క్తం­గా అమలు చే­య­ను­న్నా­యి. దా­దా­పు రూ.15,803 కో­ట్ల భారీ వ్య­యం­తో 650 ఎక­రా­ల్లో ఈ ప్రా­జె­క్టు­ను అభి­వృ­ద్ధి చే­య­ను­న్నా­రు. భా­ర­త­దే­శం­లో తొలి 5వ తరం స్టె­ల్త్ మల్టీ రోల్ ఫై­ట­ర్ ఎయి­ర్‌­క్రా­ఫ్ట్ ప్రా­జె­క్ట్ కా­వ­డం దీ­ని­కి మరింత ప్రా­ధా­న్య­త­ను తీ­సు­కొ­చ్చిం­ది.

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా..

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా..

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu