Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP: ఉబర్ ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు

AP: ఉబర్ ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు

TV5 News 1 week ago

By - Sathwik |14 May 2026 3:15 PM IST

పట్టణ రవాణ వ్యవస్థపై విస్తృత చర్చ జరిగిందన్న నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్‌ రవాణా వ్యవస్థల అభివృద్ధిపై కీలక చర్చలు సాగుతున్న వేళ, ప్రముఖ రైడ్‌ షేరింగ్‌ సంస్థ ఉబెర్ టెక్నాలజీస్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్లను కలిసి పలు అంశాలపై చర్చించారు.

ఉబర్‌ సీఈవో దారా ఖొస్రోషాహీ నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో సాంకేతికత ఆధారిత రవాణా సేవలు, పట్టణ మొబిలిటీ, ఆవిష్కరణలు, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై తమ ఆలోచనలు పంచుకుంది. రాష్ట్రంలో వేగంగా మారుతున్న పట్టణ జీవనశైలికి అనుగుణంగా ఆధునిక రవాణా వ్యవస్థలను ఎలా అభివృద్ధి చేయాలన్నదానిపై చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి లోకేశ్‌ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' ద్వారా వెల్లడించారు. ప్రపంచ స్థాయి సంస్థల నాయకులతో ఆలోచనలు పంచుకోవడం కొత్త దృక్పథాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని సంకేతాలు ఇచ్చారు.

ఢిల్లీ మెట్రోలో పయనం

,ఉబర్‌ సీఈవో దారా ఖోస్రోషాహి ఇటీవల భారత్‌ పర్యటనలో భాగంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించిన ఆయన, దేశంలోని ప్రజా రవాణా వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. ఉబర్‌ యాప్‌ ద్వారా మెట్రో టికెట్‌ బుక్‌ చేసుకుని తన ప్రయాణాన్ని పూర్తి చేసిన ఆయన, ఇది వేగవంతమైనదే కాకుండా ప్రజలకు అందుబాటు ధరలో ఉన్న సమర్థవంతమైన సేవ అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఉబర్‌ సేవలు కేవలం కార్‌ రైడ్‌లకే పరిమితం కావని, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, మెట్రో వంటి అన్ని రవాణా మార్గాలను ఒకే డిజిటల్‌ వేదికపైకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. భారతదేశంలోని ప్రజా రవాణా వ్యవస్థలతో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు సంస్థ కృషి చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉబర్‌ యాప్‌ ద్వారా కోటికి పైగా మెట్రో ప్రయాణాలు బుక్‌ అయినట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్‌ రవాణా వ్యవస్థల అభివృద్ధిపై కీలక చర్చలు సాగుతున్న వేళ, ప్రముఖ రైడ్‌ షేరింగ్‌ సంస్థ ఉబెర్ టెక్నాలజీస్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్లను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఉబర్‌ సీఈవో దారా ఖొస్రోషాహీ నేతృత్వంలోని బృందం రాష్ట్రంలో సాంకేతికత ఆధారిత రవాణా సేవలు, పట్టణ మొబిలిటీ, ఆవిష్కరణలు, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై తమ ఆలోచనలు పంచుకుంది. రాష్ట్రంలో వేగంగా మారుతున్న పట్టణ జీవనశైలికి అనుగుణంగా ఆధునిక రవాణా వ్యవస్థలను ఎలా అభివృద్ధి చేయాలన్నదానిపై చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి లోకేశ్‌ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' ద్వారా వెల్లడించారు. ప్రపంచ స్థాయి సంస్థల నాయకులతో ఆలోచనలు పంచుకోవడం కొత్త దృక్పథాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని సంకేతాలు ఇచ్చారు.

ఢిల్లీ మెట్రోలో పయనం

ఢిల్లీ మెట్రోలో పయనం

ఢిల్లీ మెట్రోలో పయనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu