By - Sathwik |15 May 2026 7:30 PM IST
బంగారం ఉత్పత్తికి చిరుమామాగా ఏపీ... జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టు ప్రారంభం
కర్నూలు జిల్లా జొన్నగిరి ఇకపై దేశవ్యాప్తంగా బంగారం ఉత్పత్తికి కొత్త గుర్తింపుగా నిలవబోతోందనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు.
ఒకప్పుడు బంగారం అంటే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పేరు వినిపించేదని, ఇకపై ఆ స్థానంలో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు సహజ వనరుల వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఏడాది 600 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, వచ్చే ఏడాదికి ఆ ఉత్పత్తిని 1500 కిలోలకు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధిలో సుమారు 598 హెక్టార్లలో ఈ గోల్డ్ ఫీల్డ్ విస్తరించి ఉంది. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గనిగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఈ ప్రాంతంలో ప్రతి టన్ను మట్టిలో 1.5 నుంచి 2 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టుతోంది. కేవలం బంగారం తవ్వకాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో నగల వ్యాపారులకు నేరుగా బంగారం విక్రయించే ప్రణాళికలను కూడా సంస్థ రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.15,803 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాయలసీమను పరిశ్రమలు, ఖనిజ సంపదల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
కర్నూలును డ్రోన్ హబ్‌గా పిలుస్తారు: రాజ్‌నాథ్
రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ స్థాయిలో ఏర్పాటు చేయబోతున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టు శుంకుస్థాపనలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. పబ్లిక్, ప్రైవేటు రంగాలు చేయిచేయి కలిపి నడుస్తున్నాయని తెలిపారు. గత పదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య అంతరాన్ని తగ్గించామన్నారు. ''యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. 8 డ్రోన్ కంపెనీలు కలిసి కర్నూలులో డ్రోన్ సిటీ ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇక నుంచి కర్నూలును డ్రోన్ హబ్‌గా పిలుస్తారు. ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయరంగంలో కూడా డ్రోన్ పాత్ర కీలకంగా మారింది. హెచ్ఎఫ్సీఎల్ రూ.1294 కోట్ల పెట్టుబడితో రాబోతోంది. ఆయుధాల తయారీ రంగంలో స్వావలంబన దిశగా కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. యుద్ధసమయంలో సొంత భద్రత కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. కొన్నేళ్ల క్రితం రక్షణరంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉండేవాళ్లం. ఇప్పుడు పరిస్థితులు మారాయి.. గత పదేళ్లుగా చేసిన కఠోర శ్రమకు ఫలితాలు వస్తున్నాయి. 2004లో కేవలం భారత్ రూ.46వేల కోట్ల విలువైన ఆయుధ పరికరాల తయారీ ఉండేది. ప్రస్తుతం రికార్డు స్థాయిలో రూ.1.75లక్షల కోట్లకు చేరిందని గర్వంగా చెబుతున్నాం'' అని అన్నారు.
కర్నూలు జిల్లా జొన్నగిరి ఇకపై దేశవ్యాప్తంగా బంగారం ఉత్పత్తికి కొత్త గుర్తింపుగా నిలవబోతోందనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. ఒకప్పుడు బంగారం అంటే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పేరు వినిపించేదని, ఇకపై ఆ స్థానంలో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు సహజ వనరుల వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఏడాది 600 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, వచ్చే ఏడాదికి ఆ ఉత్పత్తిని 1500 కిలోలకు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధిలో సుమారు 598 హెక్టార్లలో ఈ గోల్డ్ ఫీల్డ్ విస్తరించి ఉంది. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గనిగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఈ ప్రాంతంలో ప్రతి టన్ను మట్టిలో 1.5 నుంచి 2 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టుతోంది. కేవలం బంగారం తవ్వకాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో నగల వ్యాపారులకు నేరుగా బంగారం విక్రయించే ప్రణాళికలను కూడా సంస్థ రూపొందిస్తున్నట్లు సమాచారం.
కర్నూలును డ్రోన్ హబ్‌గా పిలుస్తారు: రాజ్‌నాథ్
కర్నూలును డ్రోన్ హబ్‌గా పిలుస్తారు: రాజ్‌నాథ్
కర్నూలును డ్రోన్ హబ్‌గా పిలుస్తారు: రాజ్‌నాథ్

