By - TV5 Entertainment |23 May 2026 3:45 PM IST
నందమూరి బాలకృష్ణ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు.
ఇది చాలా వేగంగా చిత్రీకణ జరుగుతోంది. ఈ మూవీ స్టార్ట్ అయిన టైమ్ లోనే మనకు విజయ్ కనకమేడల డైరెక్షన్ లో మూవీ ఉండబోతోంది అని వినిపించింది. దీంతో పాటు వివేక్ ఆత్రేయతో కూడా ఓ ప్రాజెక్ట్ ఉండబోతోంది అనే టాక్ బలంగా వినిపించింది. ఈ రెండిటిలో విజయ్ మూవీలో బాలయ్య ఓ పవర్ ఫుల్ పోలీస్ గా నటించబోతున్నాడు అన్నారు. అలాగే వివేక్ మూవీ ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే గ్యాంగ్ స్టర్ కథ అన్నారు. దీంతో చాలామంది ఎగ్జైట్ అయ్యారు. ఈ రెండు మూవీస్ తో బాలయ్య అదరగొట్టడం ఖాయం అన్నారు. కట్ చేస్తే సడెన్ గా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు కొరటాల శివ. అతను చెప్పిన కథకు బాలయ్య ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయ్యాడు. వెంటనే డేట్స్ కూడా ఇచ్చాడు. గోపీచంద్ మూవీతో పాటు సైమల్టేనియస్ గా ఈ ప్రాజెక్ట్ కూ డేట్స్ ఇచ్చాడు. వచ్చే నెల నుంచి కొరటాల మూవీ స్టార్ట్ కాబోతోంది. మరి విజయ్, వివేక్ ల పరిస్థితి ఏంటీ అంటే..?
వివేక్ ఆత్రేయ చెప్పిన కథ బాలయ్యకు బాగా నచ్చలేదట. అందులో చాలా పాత సినిమాల వాసనలు ఉన్నాయి అని ఆయనకు అనిపించిందట. అందుకే వివేక్ మూవీ పక్కన పెట్టాడట. అలాగే వివేక్ మరో మంచి కథతో వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. దీంతో వివేక్ ఆత్రేయతో బాలయ్య మూవీ ఆగిపోయినట్టే అని అర్థమైపోతుంది. దీంతో వివేక్ మరో హీరోతో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ హీరో రవితేజ.
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ఇరుముడి అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇది. ఇది ఓ మళయాల మూవీకి రీమేక్ లా అనిపించినా అందులోనూ రవితేజ స్టైల్ కూడా ఉంటుందని టాక్. వివేక్ చెప్పిన కథ రవితేజకు నచ్చిందట. దీంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాడట వివేక్. సో.. అలా బాలయ్యతో మూవీ ఆగిపోయినా మాస్ రాజాతో మూవీకి సెట్ అయింది వివేక్ కి.
నందమూరి బాలకృష్ణ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఇది చాలా వేగంగా చిత్రీకణ జరుగుతోంది. ఈ మూవీ స్టార్ట్ అయిన టైమ్ లోనే మనకు విజయ్ కనకమేడల డైరెక్షన్ లో మూవీ ఉండబోతోంది అని వినిపించింది. దీంతో పాటు వివేక్ ఆత్రేయతో కూడా ఓ ప్రాజెక్ట్ ఉండబోతోంది అనే టాక్ బలంగా వినిపించింది. ఈ రెండిటిలో విజయ్ మూవీలో బాలయ్య ఓ పవర్ ఫుల్ పోలీస్ గా నటించబోతున్నాడు అన్నారు. అలాగే వివేక్ మూవీ ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే గ్యాంగ్ స్టర్ కథ అన్నారు. దీంతో చాలామంది ఎగ్జైట్ అయ్యారు. ఈ రెండు మూవీస్ తో బాలయ్య అదరగొట్టడం ఖాయం అన్నారు. కట్ చేస్తే సడెన్ గా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు కొరటాల శివ. అతను చెప్పిన కథకు బాలయ్య ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయ్యాడు. వెంటనే డేట్స్ కూడా ఇచ్చాడు. గోపీచంద్ మూవీతో పాటు సైమల్టేనియస్ గా ఈ ప్రాజెక్ట్ కూ డేట్స్ ఇచ్చాడు. వచ్చే నెల నుంచి కొరటాల మూవీ స్టార్ట్ కాబోతోంది. మరి విజయ్, వివేక్ ల పరిస్థితి ఏంటీ అంటే..?

