Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BALAYYA: సినిమాలపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

BALAYYA: సినిమాలపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

TV5 News 5 days ago

By - Sathwik |24 May 2026 7:45 PM IST

సినిమా కార్మికులు, యూనియన్లు ఉపాధి కోల్పోతున్నారని బాలయ్య్ ఆవేదన

సినీ పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల భవిష్యత్తు, షూటింగ్‌ల నిర్వహణలో మార్పులు వంటి అంశాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగానికి కొత్త దిశలో అడుగులు వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్న వేళ, సినీ పరిశ్రమ సమస్యలు, అవకాశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు కొత్త బాధ్యతలు చేపట్టిన ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సినీ, రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ వైస్ ఛైర్మన్‌గా దర్శకుడు మెహర్ రమేష్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మెహర్ రమేష్‌కు అభినందనలు తెలియజేసి బాధ్యతలను అప్పగించారు. కొత్త బాధ్యతలతో ఏపీలో సినీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతామని బోర్డు ప్రతినిధులు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ, ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. సాంకేతికంగా పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, చిత్రాలు సమయానికి పూర్తి కాకపోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. షూటింగ్‌లు ఆలస్యం కావడం వల్ల అనేక మంది కార్మికులు, యూనియన్లకు చెందిన సభ్యులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ వ్యవస్థలో మరింత వేగం తీసుకురావాలంటే, షూటింగ్‌లకు సంబంధించిన అన్ని అనుమతులను ఒకే వ్యవస్థ కింద అందించే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ నుంచే అధిక ఆదాయం వస్తోందని గుర్తుచేసిన బాలకృష్ణ, పరిశ్రమ విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పరిశ్రమ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించాలని ఆయన ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల సమన్వయంతో ముందుకు సాగితే సినీ రంగానికి మరింత బలమైన వాతావరణం ఏర్పడుతుందని, కొత్త యాజమాన్యంతో ఏపీలో సినిమా రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సినీ పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల భవిష్యత్తు, షూటింగ్‌ల నిర్వహణలో మార్పులు వంటి అంశాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగానికి కొత్త దిశలో అడుగులు వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్న వేళ, సినీ పరిశ్రమ సమస్యలు, అవకాశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు కొత్త బాధ్యతలు చేపట్టిన ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సినీ, రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ వైస్ ఛైర్మన్‌గా దర్శకుడు మెహర్ రమేష్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మెహర్ రమేష్‌కు అభినందనలు తెలియజేసి బాధ్యతలను అప్పగించారు. కొత్త బాధ్యతలతో ఏపీలో సినీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతామని బోర్డు ప్రతినిధులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu