AP Rains : తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ నెల 13 వరకూ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 24 గంటలల్లో శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 79.75 మి.మీ వర్షపాతం నమోదైంది. ఒడిశాతో పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని మత్స్యకారులు బుధవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

