Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BJP : ఢిల్లీ పెద్దల ఆదేశాలు.. తెలంగాణ బీజేపీలో సమాలోచనలు..!

BJP : ఢిల్లీ పెద్దల ఆదేశాలు.. తెలంగాణ బీజేపీలో సమాలోచనలు..!

TV5 News 2 days ago

By - Radhisha |22 May 2026 7:15 PM IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఢిల్లీ పెద్దలు ఇప్పటికే రాష్ట్ర నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్ర స్థాయి నేతలతో మాట్లాడినట్టు సమాచారం. గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడాలని సూచించారంట. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో నేడు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర ఇన్ ఛార్జ్ అభయ్ పాటిల్ తో పాటు అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో బీజేపీ ప్రజా ప్రతినిధుల పాత్ర గురించి కీలకంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారనే విషయంపై చర్చించినట్టు సమాచారం.

వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతోంది. దానికి హాజరు కావాలని ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను కోరారు రాంచందర్ రావు. చూస్తుంటే రాబోయే రోజుల్లో పార్టీ నేతలలతో మరిన్ని మీటింగులు అరేంజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర పెద్దలు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పోరాడేందుకు ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే రాంచందర్ రావు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాలకు ఇంకా చాలా మంది లీడర్లు హాజరు కావట్లేదని తెలుస్తోంది. కానీ రాబోయే రోజుల్లో వారిని కూడా ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మరి అవి ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఢిల్లీ పెద్దలు ఇప్పటికే రాష్ట్ర నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్ర స్థాయి నేతలతో మాట్లాడినట్టు సమాచారం. గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడాలని సూచించారంట. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో నేడు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర ఇన్ ఛార్జ్ అభయ్ పాటిల్ తో పాటు అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో బీజేపీ ప్రజా ప్రతినిధుల పాత్ర గురించి కీలకంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారనే విషయంపై చర్చించినట్టు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu