By - Sathwik |15 May 2026 10:00 AM IST
కీలక సూచనలు చేసిన చంద్రబాబు
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆదాయ వనరుల పెంపు అత్యంత కీలకమని భావిస్తున్న ప్రభుత్వం, వచ్చే ఆర్థిక సంవత్సరాల లక్ష్యాలపై దృష్టి సారించింది.
ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడేలా శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన శాఖల పనితీరు, ఆదాయ వృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర సొంత ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల దిశగా సాగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,04,345 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం, 2025-26 నాటికి రూ.1,10,643 కోట్లకు చేరినట్లు తెలిపారు. ముఖ్యంగా జీఎస్టీ, గనులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు వంటి ప్రధాన శాఖల నుంచి గణనీయమైన ఆదాయం లభించినట్లు వెల్లడించారు. జీఎస్టీ ద్వారా రూ.33,679 కోట్లు, గనుల శాఖ నుంచి రూ.10,300 కోట్లు, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.11,047 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు.
గత ఏడాదితో పోలిస్తే మొత్తం ఆదాయంలో ఆరు శాతం వృద్ధి నమోదైందని అధికారులు వివరించగా, దీనిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మరింత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రూ.1,27,506 కోట్ల ఆదాయం సాధించే దిశగా అన్ని శాఖలు కట్టుదిట్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు. గనులు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖలు లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూ ఆదాయ వృద్ధికి తోడ్పడాలని ఆయన ఆదేశించారు.
పొదుపుచర్యలు ప్రజల్ని భయపెట్టేలా ఉండొద్దు
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే పొదుపు చర్యలు ఒక్కసారిగా ప్రజలను భయపెట్టేలా ఉండకూడదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు నాయుడికి సూచించారు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ సూచన చేయగా.. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయానికి 48 గంటల ముందే ప్రజలను సన్నద్ధం చేసి.. సమయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ప్రకటిద్దామని తెలిపారు. ఇక మంత్రుల కార్యదర్శులు తమతమ శాఖల పరిధిలో పొదుపు చర్యలు, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలపై అధ్యయనం చేసి.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అలాగే.. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ కింద లక్ష కోట్ల రూపాయల ఖర్చు ప్రణాళికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పొదుపు చర్యల్లో భాగంగా.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు తమ కాన్వాయ్ లను తగ్గించుకున్నారు. సీఎం కాన్వాయ్ 4 వాహనాలకే పరిమితమైంది. పైలెట్, ఎస్కార్ట్ వాహనాలు లేకుండానే బుధవారం ఆయన సచివాలయానికి వెళ్లారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఆదాయ వనరుల పెంపు అత్యంత కీలకమని భావిస్తున్న ప్రభుత్వం, వచ్చే ఆర్థిక సంవత్సరాల లక్ష్యాలపై దృష్టి సారించింది. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడేలా శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన శాఖల పనితీరు, ఆదాయ వృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర సొంత ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల దిశగా సాగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,04,345 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం, 2025-26 నాటికి రూ.1,10,643 కోట్లకు చేరినట్లు తెలిపారు. ముఖ్యంగా జీఎస్టీ, గనులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు వంటి ప్రధాన శాఖల నుంచి గణనీయమైన ఆదాయం లభించినట్లు వెల్లడించారు. జీఎస్టీ ద్వారా రూ.33,679 కోట్లు, గనుల శాఖ నుంచి రూ.10,300 కోట్లు, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.11,047 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు.
పొదుపుచర్యలు ప్రజల్ని భయపెట్టేలా ఉండొద్దు
పొదుపుచర్యలు ప్రజల్ని భయపెట్టేలా ఉండొద్దు
పొదుపుచర్యలు ప్రజల్ని భయపెట్టేలా ఉండొద్దు

