By - Radhisha |15 May 2026 11:45 AM IST
సీఎం చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలను, చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే.
ఆయన హయాంలో గతంలో తీసుకున్న నిర్ణయాలే హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. ఇప్పుడు విశాఖపట్నం, అమరావతి రూపురేఖలు మార్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఆయన రాష్ట్రాన్ని తీర్చదిద్దుతుంటారు. ఇప్పుడు తాజాగా జరిగిన కేబినెట్ భేటీలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వారానికి ఒకరోజు నో వెహికల్ ఫ్రై డేను పాటించాలని , ఈవీ వాహనాలను వాడేవారిని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి పెట్రోల్, డీజిల్ వాహనాల వాడాకాన్ని తగ్గిచడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పశ్చిమాసియా యుద్ధం తర్వాత ఈవీ వాహనాల ప్రాధాన్యత ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంది. అందుకే ఇప్పుడు ఏపీలోనూ ఈవీ వెహికల్స్ వాడకాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పవర్ తో నడిచే ఈవీ వెహికల్స్ కు ఏ దేశం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ అదే పెట్రోల్, డీజిల్ వాహనాలను వాడితే పరిస్థితి ఏంటనేది కూడా అందరికీ తెలిసి వచ్చింది.
అందుకే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే ఈవీ వెహికల్స్ ను రాష్ట్రంలో అమలు చేయాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. అందులో భాగంగానే వారానికి ఒక రోజు వెహికల్ ఫ్రీ డే పాటించేందుకు నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కాబట్టి దాన్ని అందరూ గమనించి అందుకు తగ్గట్టు పాటించాలని కూటమి నేతలు సూచిస్తున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలను, చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన హయాంలో గతంలో తీసుకున్న నిర్ణయాలే హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. ఇప్పుడు విశాఖపట్నం, అమరావతి రూపురేఖలు మార్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఆయన రాష్ట్రాన్ని తీర్చదిద్దుతుంటారు. ఇప్పుడు తాజాగా జరిగిన కేబినెట్ భేటీలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వారానికి ఒకరోజు నో వెహికల్ ఫ్రై డేను పాటించాలని , ఈవీ వాహనాలను వాడేవారిని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి పెట్రోల్, డీజిల్ వాహనాల వాడాకాన్ని తగ్గిచడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

