Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chandrababu Naidu :ఉద్యోగ కల్పనే లక్ష్యం.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

Chandrababu Naidu :ఉద్యోగ కల్పనే లక్ష్యం.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

TV5 News 1 week ago

By - Radhisha |16 May 2026 11:45 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ కల్పననే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పటికే ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించడంలో సక్సెస్ అయింది.

తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మరిన్ని భారీ పెట్టుబడులకు ఆమోదం తెలపడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ, పారిశ్రామిక వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రానికి లక్షా 42 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా కొత్త పరిశ్రమలకు మార్గం సుగమమైంది. ఈ పెట్టుబడుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు, యువతకు భవిష్యత్తుపై కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగం, గ్రీన్ ఎనర్జీ వంటి విభాగాల్లో భారీ ప్రాజెక్టులు రానున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

గతంలో పెట్టుబడుల పేరుతో పెద్ద పెద్ద ప్రకటనలు చేసినా అవి ఎక్కువగా పేపర్లకే పరిమితమయ్యాయని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులపై చేసిన ప్రకటనలు గ్రౌండ్ లెవల్‌లో కనిపించలేదని, ఉద్యోగాల కల్పనలో కూడా ఆశించిన స్థాయిలో పురోగతి లేదని ఆరోపిస్తున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితి పూర్తిగా మారిందని ప్రభుత్వం చెబుతోంది.

ప్రస్తుతం ఏపీకి వస్తున్న కంపెనీలు కేవలం ఎంఓయూల వరకే కాకుండా, ప్రాజెక్టుల అమలు దశలోకి వెళ్లడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. పరిశ్రమలకు అవసరమైన భూములు, అనుమతులు, మౌలిక వసతులు వేగంగా కల్పించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడంతో రాష్ట్రంపై దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ పెట్టుబడుల ప్రభావం కేవలం నగరాలకే పరిమితం కాకుండా జిల్లాల వరకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త పరిశ్రమలు రావడం ద్వారా ప్రత్యక్షంగా ఉద్యోగాలు రావడమే కాకుండా, పరోక్షంగా చిన్న వ్యాపారాలు, సేవారంగం కూడా అభివృద్ధి చెందనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ కల్పననే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పటికే ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించడంలో సక్సెస్ అయింది. తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మరిన్ని భారీ పెట్టుబడులకు ఆమోదం తెలపడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ, పారిశ్రామిక వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రానికి లక్షా 42 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా కొత్త పరిశ్రమలకు మార్గం సుగమమైంది. ఈ పెట్టుబడుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు, యువతకు భవిష్యత్తుపై కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగం, గ్రీన్ ఎనర్జీ వంటి విభాగాల్లో భారీ ప్రాజెక్టులు రానున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu