By - jyotsna |22 May 2026 1:00 PM IST
పాకిస్థాన్‌కు చేరిన బొద్దింకల ట్రెండ్..
సోషల్ మీడియాలో మొదలైన ఒక వ్యంగ్య ఉద్యమం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
భారతదేశంలో వైరల్ అయిన 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (CJP) ఇప్పుడు పాకిస్థాన్ వరకు విస్తరించింది. అక్కడ 'కాక్‌రోచ్ అవామీ పార్టీ' (CAP), 'కాక్‌రోచ్ అవామీ లీగ్' (CAL) పేర్లతో కొత్త గ్రూపులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఎలా మొదలైంది?
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నిరుద్యోగ యువత చేపడుతున్న కొన్ని ఉద్యమాలపై వ్యాఖ్యానిస్తూ 'బొద్దింకలు', 'పరాన్నజీవులు' అన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తర్వాత దీనిపై వివరణ వచ్చినప్పటికీ, అప్పటికే యువత ఆ వ్యాఖ్యలను వ్యంగ్యంగా మలచి ఒక కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.
సోషల్ మీడియాలో పుట్టిన 'పార్టీ'
అమెరికాలో పబ్లిక్ రిలేషన్స్ చదివి, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పనిచేసిన అభిజీత్ దీప్కే.. మే 16న 'కాక్‌రోచ్ జనతా పార్టీ' పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించాడు. గూగుల్ ఫార్మ్స్ ద్వారా సభ్యత్వ నమోదు కూడా చేపట్టాడు.
'అవును.. నేనే ఆ బొద్దింకను' అంటూ అతడు ఇచ్చిన వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి. కొద్ది రోజుల్లోనే పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1.5 కోట్లకు పైగా ఫాలోవర్లు రావడం విశేషం. ఈ సంఖ్యతో బీజేపీ, కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా పేజీలను కూడా అధిగమించినట్లు ప్రచారం జరుగుతోంది.
కేవలం మీమ్స్ కాదు.. సమస్యలపై చర్చ
ఈ గ్రూప్ తమను 'నిరుద్యోగ యువత గొంతుక'గా పేర్కొంటోంది. వ్యంగ్య పోస్టులు, మీమ్స్‌తో పాటు విద్య, ఉద్యోగాలు, పరీక్షల వ్యవస్థ, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనం వంటి అంశాలపై కూడా పోస్టులు పెడుతోంది.
అకౌంట్ బ్లాక్.. మళ్లీ రీఎంట్రీ
ఈ పార్టీకి చెందిన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా భారత్‌లో నిలిపివేయబడినట్లు సమాచారం. అయితే కొద్దిసేపటికే కొత్త హ్యాండిల్‌తో తిరిగి వచ్చి 'మమ్మల్ని అంత ఈజీగా ఆపలేరు' అంటూ పోస్టు చేయడంతో మరింత చర్చ మొదలైంది.
పాకిస్థాన్‌లోనూ అదే ట్రెండ్
భారత్‌లో వైరల్ అయిన ఈ వ్యంగ్య రాజకీయ కాన్సెప్ట్ ఇప్పుడు పాకిస్థాన్ యువతలో కూడా ప్రాచుర్యం పొందుతోంది. అక్కడ 'కాక్‌రోచ్ అవామీ పార్టీ', 'కాక్‌రోచ్ అవామీ లీగ్' పేర్లతో సోషల్ మీడియాలో కొత్త పేజీలు, గ్రూపులు వెలుస్తున్నాయి. రాజకీయ వ్యవస్థపై యువత అసంతృప్తిని హాస్యరూపంలో వ్యక్తపరచడానికి ఈ ట్రెండ్ వేదికగా మారింది.
సోషల్ మీడియాలో మొదలైన ఒక వ్యంగ్య ఉద్యమం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో వైరల్ అయిన 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (CJP) ఇప్పుడు పాకిస్థాన్ వరకు విస్తరించింది. అక్కడ 'కాక్‌రోచ్ అవామీ పార్టీ' (CAP), 'కాక్‌రోచ్ అవామీ లీగ్' (CAL) పేర్లతో కొత్త గ్రూపులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఎలా మొదలైంది?
సోషల్ మీడియాలో పుట్టిన 'పార్టీ'
కేవలం మీమ్స్ కాదు.. సమస్యలపై చర్చ
అకౌంట్ బ్లాక్.. మళ్లీ రీఎంట్రీ
పాకిస్థాన్‌లోనూ అదే ట్రెండ్
ఎలా మొదలైంది?
సోషల్ మీడియాలో పుట్టిన 'పార్టీ'
కేవలం మీమ్స్ కాదు.. సమస్యలపై చర్చ
అకౌంట్ బ్లాక్.. మళ్లీ రీఎంట్రీ
పాకిస్థాన్‌లోనూ అదే ట్రెండ్
ఎలా మొదలైంది?
సోషల్ మీడియాలో పుట్టిన 'పార్టీ'
కేవలం మీమ్స్ కాదు.. సమస్యలపై చర్చ
అకౌంట్ బ్లాక్.. మళ్లీ రీఎంట్రీ
పాకిస్థాన్‌లోనూ అదే ట్రెండ్

