Dailyhunt
DHONI: ఐపీఎల్ 2026 నుంచి ధోని అవుట్..?

DHONI: ఐపీఎల్ 2026 నుంచి ధోని అవుట్..?

TV5 News 1 week ago

By - Sathwik |5 May 2026 11:15 AM IST

గాయం నుంచి కోలుకోని మహేంద్రుడు... ఇప్పటివరకూ మైదానంలోకి దిగని ధోని.. అభిమానులకు తప్పని ఎదురుచూపులు

భారత క్రి­కె­ట్ అభి­మా­నుల హృ­ద­యా­ల్లో ప్ర­త్యేక స్థా­నా­న్ని సం­పా­దిం­చిన మహేం­ద్ర సిం­గ్ ధోని పేరు వి­న­గా­నే మె­రు­పు­లాం­టి ఫి­ని­షిం­గ్ షా­ట్లు, ఒత్తి­డి­లో­నూ ప్ర­శాం­తం­గా మ్యా­చ్ ము­గిం­చే శైలి గు­ర్తు­కొ­స్తా­యి.

అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­కు వీ­డ్కో­లు పలి­కిన తర్వాత కూడా, ఆయన ఆటను మరో­సా­రి చూ­డా­ల­న్న ఆశ అభి­మా­ను­ల్లో అలా­గే ఉంది. ము­ఖ్యం­గా ఇం­డి­య­న్ ప్రీ­మి­య­ర్ లీ­గ్లో ఆయన ప్ర­ద­ర్శన కోసం ఎదు­రు­చూ­సే వారి సం­ఖ్య చాలా ఎక్కువ. అయి­తే 2026 సీ­జ­న్‌­లో ధోని మై­దా­నం­లో­కి ది­గ­క­పో­వ­డం అభి­మా­ను­ల­ను ఆం­దో­ళ­న­కు గు­రి­చే­స్తోం­ది. చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ అభి­మా­ను­లు ఈ సీ­జ­న్ ప్రా­రం­భం నుం­చే ధోని ఎప్పు­డు ఆడ­తా­డా అని ఎదు­రు­చూ­స్తు­న్నా­రు. గత సీ­జ­న్‌­ల­లో­లా­గే చి­వ­ర్లో వచ్చి­నా తన­దైన శై­లి­లో మ్యా­చ్‌­ను మలు­పు­తి­ప్పు­తా­డ­ని ఆశిం­చా­రు. కానీ ఈసా­రి పరి­స్థి­తి భి­న్నం­గా మా­రిం­ది. మా­ర్చి 28న గౌ­హ­తి­లో రా­జ­స్థా­న్ రా­య­ల్స్తో జర­గా­ల్సిన తొలి మ్యా­చ్‌­కు ముం­దే ధో­ని­కి పి­క్క కం­డ­రాల గాయం కా­వ­డం పె­ద్ద షా­క్‌­గా మా­రిం­ది. ఆ గాయం కా­ర­ణం­గా అప్ప­టి నుం­చి ఇప్ప­టి­వ­ర­కు ఒక్క మ్యా­చ్ కూడా ఆడ­లే­క­పో­యా­డు.

ఇంకా ఎదురుచూపులే

దా­దా­పు నె­ల­రో­జు­లు­గా ధోని జట్టు­తో ఉన్న­ప్ప­టి­కీ మై­దా­నం­లో­కి రా­క­పో­వ­డం అభి­మా­ను­ల్లో అను­మా­నా­లు రే­కె­త్తి­స్తోం­ది. ము­ఖ్యం­గా ది­ల్లీ క్యా­పి­ట­ల్స్తో మ్యా­చ్ కోసం జట్టు వె­ళ్లి­న­ప్పు­డు ధోని వా­రి­తో కలి­సి ప్ర­యా­ణిం­చ­క­పో­వ­డం, ఈ సీ­జ­న్ మొ­త్తా­ని­కే ఆయన దూ­ర­మ­య్యే అవ­కా­శం ఉం­ద­న్న చర్చ­ల­కు దా­రి­తీ­సిం­ది. జట్టు బౌ­లిం­గ్ సల­హా­దా­రు ఫిల్ సి­మ­న్స్ ఈ వి­ష­యం­పై స్పం­ది­స్తూ ధోని ప్ర­స్తు­తం గాయం నుం­చి కో­లు­కుం­టు­న్నా­డ­ని తె­లి­పా­రు. ఆయన ఎప్పు­డు ఆడా­ల­ను­కుం­టా­డో, ఎప్పు­డు పూ­ర్తి­గా సి­ద్ధం­గా ఉం­టా­డో తనకే బాగా తె­లు­స­ని, సి­ద్ధం­గా ఉన్న­ప్పు­డే మై­దా­నం­లో­కి వస్తా­డ­ని స్ప­ష్టం చే­శా­రు. ధోనీ గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జట్టు మేనేజ్‌మెంట్ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో, రిస్క్ తీసుకోకుండా ధోనికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సూచించారు. ఇదే కారణంగా ఇప్పటివరకు ఆయన ఎనిమిది మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇది జట్టుపై స్పష్టమైన ప్రభావం చూపింది. ఈ సీజన్‌లో చెన్నై జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు గెలిచి, ఐదు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.

ఇక జట్టు హెడ్ కోచ్ స్టీ­ఫె­న్ ఫ్లె­మిం­గ్ కూడా ధోని గా­యం­పై మా­ట్లా­డా­రు. గు­జ­రా­త్ టై­టా­న్స్‌­తో ఓటమి తర్వాత ఆయన మా­ట్లా­డు­తూ, వా­ర్మ­ప్ సమ­యం­లో ధో­ని­కి ఇప్ప­టి­కే ఉన్న గాయం మళ్లీ ము­ది­రిం­ద­ని తె­లి­పా­రు. దీం­తో కో­లు­కు­నే సమయం ముం­దు­గా అం­చ­నా వే­సిన దా­ని­కం­టే ఎక్కు­వ­గా పడు­తుం­ద­ని చె­ప్పా­రు. గాయం మరింత తీ­వ్ర­మ­వ­కుం­డా అత్యంత జా­గ్ర­త్త­గా వ్య­వ­హ­రి­స్తు­న్నా­మ­ని ఆయన పే­ర్కొ­న్నా­రు. ధోని జట్టు­లో లే­క­పో­వ­డం వల్ల సీ­ఎ­స్కే ప్ర­ద­ర్శ­న­పై ప్ర­భా­వం పడిం­ద­ని స్ప­ష్టం­గా కని­పి­స్తోం­ది. కీలక సమ­యా­ల్లో అను­భ­వం లో­పిం­చ­డం, మ్యా­చ్‌­ను ము­గిం­చే నై­పు­ణ్యం తగ్గ­డం జట్టు­కు నష్టం­గా మా­రిం­ది. ధోని ఉన్న­ప్పు­డు జట్టు­కు ఉండే నమ్మ­కం, ఒత్తి­డి­లో తీ­సు­కు­నే ని­ర్ణ­యా­లు ఈ సీ­జ­న్‌­లో కొ­ర­వ­డి­న­ట్లు కని­పి­స్తు­న్నా­యి. ఇదే సమ­యం­లో, ఇది ధో­ని­కి చి­వ­రి ఐపీ­ఎ­ల్ సీ­జ­న్ కా­వ­చ్చ­న్న ప్ర­చా­రం కూడా జో­రు­గా సా­గు­తోం­ది. ఇప్ప­టి­కే అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­కు గు­డ్‌­బై చె­ప్పిన ఆయన, ఐపీ­ఎ­ల్‌­కు కూడా త్వ­ర­లో వీ­డ్కో­లు పలి­కే అవ­కా­శం ఉం­ద­ని అభి­మా­ను­లు భా­వి­స్తు­న్నా­రు. ఈ నే­ప­థ్యం­లో ఆయన ఇంకా మై­దా­నం­లో­కి ది­గ­క­పో­వ­డం మరింత ఆం­దో­ళన కలి­గి­స్తోం­ది.

భారత క్రి­కె­ట్ అభి­మా­నుల హృ­ద­యా­ల్లో ప్ర­త్యేక స్థా­నా­న్ని సం­పా­దిం­చిన మహేం­ద్ర సిం­గ్ ధోని పేరు వి­న­గా­నే మె­రు­పు­లాం­టి ఫి­ని­షిం­గ్ షా­ట్లు, ఒత్తి­డి­లో­నూ ప్ర­శాం­తం­గా మ్యా­చ్ ము­గిం­చే శైలి గు­ర్తు­కొ­స్తా­యి. అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­కు వీ­డ్కో­లు పలి­కిన తర్వాత కూడా, ఆయన ఆటను మరో­సా­రి చూ­డా­ల­న్న ఆశ అభి­మా­ను­ల్లో అలా­గే ఉంది. ము­ఖ్యం­గా ఇం­డి­య­న్ ప్రీ­మి­య­ర్ లీ­గ్లో ఆయన ప్ర­ద­ర్శన కోసం ఎదు­రు­చూ­సే వారి సం­ఖ్య చాలా ఎక్కువ. అయి­తే 2026 సీ­జ­న్‌­లో ధోని మై­దా­నం­లో­కి ది­గ­క­పో­వ­డం అభి­మా­ను­ల­ను ఆం­దో­ళ­న­కు గు­రి­చే­స్తోం­ది. చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ అభి­మా­ను­లు ఈ సీ­జ­న్ ప్రా­రం­భం నుం­చే ధోని ఎప్పు­డు ఆడ­తా­డా అని ఎదు­రు­చూ­స్తు­న్నా­రు. గత సీ­జ­న్‌­ల­లో­లా­గే చి­వ­ర్లో వచ్చి­నా తన­దైన శై­లి­లో మ్యా­చ్‌­ను మలు­పు­తి­ప్పు­తా­డ­ని ఆశిం­చా­రు. కానీ ఈసా­రి పరి­స్థి­తి భి­న్నం­గా మా­రిం­ది. మా­ర్చి 28న గౌ­హ­తి­లో రా­జ­స్థా­న్ రా­య­ల్స్తో జర­గా­ల్సిన తొలి మ్యా­చ్‌­కు ముం­దే ధో­ని­కి పి­క్క కం­డ­రాల గాయం కా­వ­డం పె­ద్ద షా­క్‌­గా మా­రిం­ది. ఆ గాయం కా­ర­ణం­గా అప్ప­టి నుం­చి ఇప్ప­టి­వ­ర­కు ఒక్క మ్యా­చ్ కూడా ఆడ­లే­క­పో­యా­డు.

ఇంకా ఎదురుచూపులే

ఇంకా ఎదురుచూపులే

ఇంకా ఎదురుచూపులే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu