By - Sathwik |22 May 2026 9:00 AM IST
గాయం నుంచి కోలుకోని మహేంద్రుడు.. ఒక్క మ్యూచులోనూ మైదానంలోకి దిగని ధోని
చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎం.ఎస్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
అయితే ఆయన వచ్చే సీజన్లోనూ ఆడాలని సీఎస్కే మాజీ స్టార్ సురేష్ రైనా ఆకాంక్షించాడు. చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమి తర్వాత 'స్టార్ స్పోర్ట్స్'తో రైనా మాట్లాడాడు. ఈ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్పై వారిద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణను పంచుకున్నాడు. తాను ధోనీతో మాట్లాడానని, ఐపీఎల్ 2026 సీజన్‌కు ధోనీ కేవలం మిస్డ్‌కాల్ మాత్రమే ఇచ్చారని, ఇది లెక్కలోకి రాదని, వచ్చే ఏడాది కచ్చితంగా ఆడాల్సిందేనని తాను ధోనీతో అన్నానని రైనా వెల్లడించాడు. దానికి ధోనీ స్పందిస్తూ.. తన శరీరం కొంచెం బలహీనంగా అనిపిస్తోందని తెలిపినట్టు రైనా వివరించాడు. అయితే, తాము అవేమీ నమ్మబోమని, ధోనీ వచ్చే ఏడాది ఆడాల్సిందేనని తాను స్పష్టం చేశానని రైనా వెల్లడించాడు. ఇది ధోనీ వ్యక్తిగత నిర్ణయమైనప్పటికీ అతను మాత్రం పాజిటివ్‌గానే ఉన్నట్లు తనకు అనిపించిందని తెలిపాడు. ధోనీ ఈ సీజన్ మొత్తం తుది జట్టులో లేడు. కనీసం స్టేడియంలో కూడా కనిపించలేదు. చెపాక్‌లో చూసి ఫ్యాన్స్ భావోద్వేగానికి గురయ్యారు. టీమ్ ఫొటోగ్రాఫ్ కోసం మైదానంలోకి రాగానే స్టేడియం దద్దరిల్లింది.
జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ధోని గాయంపై మాట్లాడారు. గుజరాత్ టైటాన్స్‌తో ఓటమి తర్వాత ఆయన మాట్లాడుతూ, వార్మప్ సమయంలో ధోనికి ఇప్పటికే ఉన్న గాయం మళ్లీ ముదిరిందని తెలిపారు. దీంతో కోలుకునే సమయం ముందుగా అంచనా వేసిన దానికంటే ఎక్కువగా పడుతుందని చెప్పారు. గాయం మరింత తీవ్రమవకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ధోని జట్టులో లేకపోవడం వల్ల సీఎస్కే ప్రదర్శనపై ప్రభావం పడిందని స్పష్టంగా కనిపిస్తోంది. కీలక సమయాల్లో అనుభవం లోపించడం, మ్యాచ్‌ను ముగించే నైపుణ్యం తగ్గడం జట్టుకు నష్టంగా మారింది. ధోని ఉన్నప్పుడు జట్టుకు ఉండే నమ్మకం, ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాలు ఈ సీజన్లో కొరవడినట్లు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో, ఇది ధోనికి చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన, ఐపీఎల్‌కు కూడా త్వరలో వీడ్కోలు పలికే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎం.ఎస్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఆయన వచ్చే సీజన్లోనూ ఆడాలని సీఎస్కే మాజీ స్టార్ సురేష్ రైనా ఆకాంక్షించాడు. చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమి తర్వాత 'స్టార్ స్పోర్ట్స్'తో రైనా మాట్లాడాడు. ఈ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్పై వారిద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణను పంచుకున్నాడు. తాను ధోనీతో మాట్లాడానని, ఐపీఎల్ 2026 సీజన్‌కు ధోనీ కేవలం మిస్డ్‌కాల్ మాత్రమే ఇచ్చారని, ఇది లెక్కలోకి రాదని, వచ్చే ఏడాది కచ్చితంగా ఆడాల్సిందేనని తాను ధోనీతో అన్నానని రైనా వెల్లడించాడు. దానికి ధోనీ స్పందిస్తూ.. తన శరీరం కొంచెం బలహీనంగా అనిపిస్తోందని తెలిపినట్టు రైనా వివరించాడు. అయితే, తాము అవేమీ నమ్మబోమని, ధోనీ వచ్చే ఏడాది ఆడాల్సిందేనని తాను స్పష్టం చేశానని రైనా వెల్లడించాడు. ఇది ధోనీ వ్యక్తిగత నిర్ణయమైనప్పటికీ అతను మాత్రం పాజిటివ్‌గానే ఉన్నట్లు తనకు అనిపించిందని తెలిపాడు. ధోనీ ఈ సీజన్ మొత్తం తుది జట్టులో లేడు. కనీసం స్టేడియంలో కూడా కనిపించలేదు. చెపాక్‌లో చూసి ఫ్యాన్స్ భావోద్వేగానికి గురయ్యారు. టీమ్ ఫొటోగ్రాఫ్ కోసం మైదానంలోకి రాగానే స్టేడియం దద్దరిల్లింది.

