Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
DIGITAL INDIA: డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం

DIGITAL INDIA: డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం

TV5 News 1 week ago

By - Sathwik |17 May 2026 11:00 AM IST

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలో నంబర్-1: మోదీ.. నెలకు 20 బిలియన్ డాలర్ల డిజిటల్ లావాదేవీలు

సరికొత్త సంస్కరణలు, సాంకేతిక విప్లవంతో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆయన సగర్వంగా ప్రకటించారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా 'ది హేగ్' నగరంలో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) 'మాటామంతీ' సమ్మేళనంలో ప్రధాని ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రగతిని వివరిస్తూనే, విదేశాల్లో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేస్తున్న ప్రవాసులపై ప్రశంసల జల్లు కురిపించారు.

నెలకు 20 బిలియన్ డాలర్ల డిజిటల్ లావాదేవీలు

భా­ర­త­దే­శం సా­ధిం­చిన డి­జి­ట­ల్ పు­రో­గ­తి­ని ప్ర­ధా­ని ఈ సం­ద­ర్భం­గా ప్ర­త్యే­కం­గా ప్ర­స్తా­విం­చా­రు. ప్ర­స్తు­తం దే­శం­లో నె­ల­కు ఏకం­గా 20 బి­లి­య­న్ డా­ల­ర్ల మేర డి­జి­ట­ల్ ట్రా­న్సా­క్ష­న్లు జరు­గు­తు­న్నా­య­ని, ఇది దేశ బ్యాం­కిం­గ్, సాం­కే­తిక వ్య­వ­స్థల బలా­ని­కి ని­ద­ర్శ­న­మ­ని చె­ప్పా­రు. స్టా­ర్ట­ప్ రం­గం­లో­నూ భా­ర­త్ అద్భు­తా­లు సృ­ష్టి­స్తోం­ద­ని చె­బు­తూ.. ఒక­ప్పు­డు దే­శం­లో కే­వ­లం 4 యూ­ని­కా­ర్న్ సం­స్థ­లు (బి­లి­య­న్ డా­ల­ర్ల వి­లు­వైన స్టా­ర్ట­ప్‌­లు) మా­త్ర­మే ఉం­డే­వ­ని, కానీ నేడు ఆ సం­ఖ్య 100కు చే­రిం­ద­ని హర్షం వ్య­క్తం చే­శా­రు. భవి­ష్య­త్తు అవ­స­రా­లైన సె­మీ­కం­డ­క్ట­ర్ల తయా­రీ రం­గం­లో­నూ భా­ర­త్ ముం­ద­డు­గు వే­సిం­ద­ని, ఆ ది­శ­గా పను­లు శర­వే­గం­గా జరు­గు­తు­న్నా­య­ని స్ప­ష్టం చే­శా­రు.

మాతృభూమి విలువలను మరువని ప్రవాసులు

సభకు హాజన ప్రవాస భారతీయుల నుంచి వ్యక్తమైన అపారమైన ప్రేమ, ఉత్సాహాన్ని చూసి తాను నెదర్లాండ్స్‌లో ఉన్నాననే సంగతి మరిచిపోయానని, భారతదేశంలోనే ఏదో ఒక ఉత్సవానికి హాజరైనట్లు అనిపించిందని ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. "భారత స్నేహానికి 'ది హేగ్' నగరం ఒక సజీవ చిహ్నంగా మారింది. నెదర్లాండ్స్ నాయకత్వంతో నేను మాట్లాడిన ప్రతిసారీ వారు ఇక్కడి ప్రవాస భారతీయులను ప్రశంసిస్తూనే ఉంటారు. నెదర్లాండ్స్ సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు మీరు చేస్తున్న సేవలకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు" అని మోదీ కొనియాడారు. ప్ర­వా­సుల మూ­లా­ల­ను గు­ర్తు­చే­స్తూ.. "మీ పూ­ర్వీ­కు­లు ఇక్క­డి­కి వచ్చి­న­ప్పు­డు ఎన్నో వి­ష­యా­ల­ను వది­లే­సి ఉం­డ­వ­చ్చు. కానీ భా­ర­త­దేశ మట్టి పరి­మ­ళం, పం­డు­గల జ్ఞా­ప­కా­లు, భక్తి గీ­తాల రా­గా­లు, పూ­ర్వీ­కు­లు అం­దిం­చిన సం­స్కా­రా­లు, వి­లు­వ­లు ఎల్ల­ప్పు­డూ మీ­తో­నే ఉం­డి­పో­యా­యి. కా­ల­క్ర­మే­ణా ఎన్నో సం­స్కృ­తు­లు కను­మ­రు­గ­య్యా­య­నే వా­స్త­వా­ని­కి మానవ చరి­త్రే సా­క్ష్యం. కానీ భా­ర­త­దేశ వి­భి­న్న సం­స్కృ­తి ఇప్ప­టి­కీ మన ప్ర­జల హృ­ద­యా­ల్లో బలం­గా ఉంది. తరా­లు మా­రి­నా, దే­శా­లు మా­రి­నా కు­టుంబ వి­లు­వ­లు, మన­మం­తా ఒక్క­టే­న­నే భావన మా­ర­లే­దు" అని ప్ర­ధా­ని అన్నా­రు.

స్థిరమైన ప్రభుత్వమే దేశ ప్రగతికి మూలం

ప్ర­ధా­ని మోదీ తన ప్ర­సం­గం­లో 2014 మే 16 నాటి ఎన్ని­కల ఫలి­తాల చా­రి­త్రక సం­ద­ర్భా­న్ని గు­ర్తు­చే­సు­కు­న్నా­రు. "సరి­గ్గా 12 ఏళ్ల క్రి­తం ఇదే రో­జున లో­క్‌­సభ ఎన్ని­కల ఫలి­తా­లు వె­లు­వ­డ్డా­యి. దశా­బ్దాల తర్వాత భా­ర­త­దే­శం­లో సం­పూ­ర్ణ మె­జా­రి­టీ­తో ఒక స్థి­ర­మైన ప్ర­భు­త్వం ఏర్ప­డిం­ది. నాటి నుం­చి నేటి వరకు దే­శం­లో­ని కో­ట్లా­ది మంది భా­ర­తీ­యు­లు నాపై ఉం­చిన నమ్మ­క­మే నన్ను ని­రం­త­రం నడి­పి­స్తోం­ది. ఆ నమ్మ­కం నన్ను ఎక్క­డా ఆగ­ని­వ్వ­దు, అల­సి­పో­ని­వ్వ­దు" అని ప్ర­ధా­ని స్ప­ష్టం చే­శా­రు. లక్ష్యా­ల­ను అధి­గ­మిం­చి పని­చే­స్తు­న్న ప్ర­వాస భా­ర­తీ­యు­లు దేశ ప్ర­తి­ష్ఠ­ను మరింత పెం­చా­ల­ని ఆయన పి­లు­పు­ని­చ్చా­రు. గ్లో­బ­ల్ సప్లై చై­న్‌­లో భా­ర­త్‌­ను ఒక నమ్మ­క­మైన భా­గ­స్వా­మి­గా ని­ల­బె­ట్ట­డ­మే మా ప్ర­భు­త్వ ప్ర­ధాన లక్ష్యం. దే­శీ­యం­గా తయా­ర­వు­తు­న్న సాం­కే­తిక పరి­జ్ఞా­నం కే­వ­లం భా­ర­త­దేశ అవ­స­రా­ల­నే కా­కుం­డా, ప్ర­పంచ సమ­స్య­ల­కు సైతం పరి­ష్కా­రా­లు చూ­పు­తోం­ది. మన యు­వ­త­లో­ని సృ­జ­నా­త్మ­కత, వి­నూ­త్న ఆలో­చ­న­లే నేడు దే­శం­లో వం­ద­కు పైగా యూ­ని­కా­ర్న్ సం­స్థ­లు ఆవి­ర్భ­విం­చ­డా­ని­కి కా­ర­ణ­మ­య్యా­యి.

సరికొత్త సంస్కరణలు, సాంకేతిక విప్లవంతో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆయన సగర్వంగా ప్రకటించారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా 'ది హేగ్' నగరంలో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) 'మాటామంతీ' సమ్మేళనంలో ప్రధాని ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రగతిని వివరిస్తూనే, విదేశాల్లో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేస్తున్న ప్రవాసులపై ప్రశంసల జల్లు కురిపించారు.

నెలకు 20 బిలియన్ డాలర్ల డిజిటల్ లావాదేవీలు

మాతృభూమి విలువలను మరువని ప్రవాసులు

స్థిరమైన ప్రభుత్వమే దేశ ప్రగతికి మూలం

నెలకు 20 బిలియన్ డాలర్ల డిజిటల్ లావాదేవీలు

మాతృభూమి విలువలను మరువని ప్రవాసులు

స్థిరమైన ప్రభుత్వమే దేశ ప్రగతికి మూలం

నెలకు 20 బిలియన్ డాలర్ల డిజిటల్ లావాదేవీలు

మాతృభూమి విలువలను మరువని ప్రవాసులు

స్థిరమైన ప్రభుత్వమే దేశ ప్రగతికి మూలం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu