Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Drishyam 3 :  ఈ వారం విడుదలవుతోన్న తెలుగు మూవీస్ ఏంటీ..?

Drishyam 3 : ఈ వారం విడుదలవుతోన్న తెలుగు మూవీస్ ఏంటీ..?

TV5 News 6 days ago

By - TV5 Entertainment |18 May 2026 3:52 PM IST

ప్రతివారం కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. కాకపోతే ఏవీ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. వరుసగా వస్తున్న మూవీస్ అంతే ఫాస్ట్ గా పోతున్నాయి కూడా.

కథల పరంగా మరీ దారుణంగా ఉండటమే ఇందుకు కారణం. అయినా కొత్తగా వస్తోన్న మూవీస్ ఏదో విషయం ఉంది అని ఆశగా చూస్తుంటారు ఆడియన్స్. అలా ఈ వారం విడుదలవుతోన్న మూవీస్ ఏంటీ అనేది చూస్తే..

శ్రీ నందు, అవికా గోర్ జంగా నటించిన మూవీ అగ్లీ స్టోరీ. ప్రణవ స్వరూప్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ట్రైలర్ మాత్రం ఆసక్తిగా ఉంది. ఓ డిఫరెంట్ జానర్ లో వచ్చే మూవీలా ఉండబోతోంది. ఈ తరహా సినిమాల్లో బలమైన కథనం ఉంటేనే వర్కవుట్ అవుతుంది. ఈ ట్రైలర్ చూస్తే ఆ కథనం ఉండేలానే ఉంది. ఈ నెల 22న విడుదల కాబోతోన్న అగ్లీ స్టోరీతో నందు ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్టేజ్ లోనే ఉన్నాడు. మరి కొడతాడా లేదా అనేది చూద్దాం.

పురుషః అనే టైటిల్ తో రూపొందిన మూవీ అదే రోజు విడుదల కాబోతోంది. ఈ టైటిల్ ను బట్టే ఇది మగవాళ్లను ఇబ్బంది పెట్టే భార్యల కథ అని అర్థమౌతోంది. టీజర్ బానే ఉంది. పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు. వీరు ఉలవల దర్శకత్వం చేశాడు. మరి ఈ మూవీ ఆ జానర్ కు తగ్గట్టుగానే ఆకట్టుకుంటుందా లేదా అనేది 22నే చూడాల్సిందే.

టైటిల్ కు తగ్గట్టుగానే అందరినీ ఆకట్టుకునే ట్రైలర్ తో అదరగొడుతోంది 'ఫస్ట్ టైమ్'అనే మూవీ. నిజానికి తెలుగు భాషలో.. ఆ మాటకొస్తే ఇండియాలో ఇప్పటి వరకు ఈ తరహా ప్రయోగం ఎవరూ చేయలేదు అనిపించేలా ఉంది ట్రైలర్. అంతరిక్షంలో ఉండే కొందరు మనుషులు, ఇద్దరు ఏలియన్స్, వీరితో పాటు ఓ ఐదుగురు మానవుల మధ్య సాగే కథగా ఉంది. బట్ ఈ ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఓ ప్రయోగంలా ఉంది అనేది అర్థం అవుతోంది. ఈ తరహా ఎక్స్ పర్మెంట్ ఇప్పటి వరకు చూడలేదు మనవాళ్లు. ట్రైలర్ చాలా బావుంది. సౌరభ్ ధింగ్రా, అజయ్ రత్నం, అనికా విక్రమన్, మైమ్ గోపీ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హేమంత్ ఇప్పలపల్లి దర్శకుడు. మరి ఈ ప్రయోగం సక్సెస్ అయితే మూవీ హిట్ అయినట్టే అనుకోవచ్చు. ఈ చిత్రం కూడా ఈ నెల 22నే విడుదల కాబోతోంది.

దీప్సికా చంద్రన్, సూర్య వశిష్ట, శ్రీనివాస రెడ్డి, చైతూ జొన్నలగడ్డ కీలక పాత్రల్లో నటించిన మూవీ రమణి కళ్యాణం. ఇది కూడా ఓ ఎక్స్ పర్మెంటల్ మూవీ. చూపు లేని అమ్మాయి.. కాళ్లు లేని అబ్బాయి మధ్య సాగే కథ. మమూలుగా ఇలా డిజేబిలిటీ ఉన్న పాత్రలతో సినిమా తీయడమే కష్టం అనుకుంటే.. అసలా పాత్రలే మెయిన్ లీడ్ గా చేయడం అంటే ఖచ్చితంగా ఓ ప్రయోగమే. మరి ఈ ప్రయోగం ఏ మేరకు విజయం సాధిస్తుంది అనేది ఈ నెల 22న తేలిపోతుంది.

మామూలుగా ఇవన్నీ శుక్రవారం విడుదల కాబోతోన్న మూవీస్. అంతకు ముందు ఒకరోజే విడుదల కాబోతోన్న మూవీ దృశ్యం 3. మోహన్ లాల్, మీనా, ఎస్తేర్ అనిల్, వీణా నందకుమార్, సిద్ధిఖీ, ఆశా శరత్ కీలక పాత్రల్లో నటించిన ఈ సీక్వెల్ మూవీ ఈ నెల 21నే విడుదల కాబోతోంది. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. మామూలుగా అయితే దృశ్యం, దృశ్యం 2 చిత్రాల్లో వెంకటేష్ నటించాడు. ఈ థర్డ్ పార్ట్ లో అతను నటించలేదు. కథలో ఎలాంటి మార్పూ లేదు కాబట్టి ఈ థర్డ్ పార్ట్ లో మోహన్ లాల్ తెలుగులోనూ కనిపించబోతున్నాడు. మరి మొదటి రెండు భాగాలు పెద్ద విజయం సాధించాయి. మరి ఈ మూడో భాగం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

ప్రతివారం కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. కాకపోతే ఏవీ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. వరుసగా వస్తున్న మూవీస్ అంతే ఫాస్ట్ గా పోతున్నాయి కూడా. కథల పరంగా మరీ దారుణంగా ఉండటమే ఇందుకు కారణం. అయినా కొత్తగా వస్తోన్న మూవీస్ ఏదో విషయం ఉంది అని ఆశగా చూస్తుంటారు ఆడియన్స్. అలా ఈ వారం విడుదలవుతోన్న మూవీస్ ఏంటీ అనేది చూస్తే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu