Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
EAPSET: కాసేపట్లో ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల

EAPSET: కాసేపట్లో ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల

TV5 News 1 week ago

By - Sathwik |17 May 2026 10:30 AM IST

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే

తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ ఈఏపీసెట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది.

రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్ (JNTUH) లోని గోల్డెన్ జూబ్లీ హాల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు ఈఏపీ సెట్‌ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ విజయకుమార్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాల ప్రకటన పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి మార్కులు, ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలని కన్వీనర్ పేర్కొన్నారు.

ఇంజినీరింగ్ స్ట్రీమ్: మే 9, 10, 11 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 2,10,766 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 1,97,241 మంది (93.58%) పరీక్షకు హాజరయ్యారు.

అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్: మే 4, 5 తేదీల్లో జరిగిన ఈ పరీక్షల కోసం 90,977 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 84,954 మంది (93.38%) అభ్యర్థులు పరీక్ష రాశారు.

ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్https://eapcet.tgche.ac.in/](https://eapcet.tgche.ac.in/)

తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ ఈఏపీసెట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. జేఎన్‌టీయూ హైదరాబాద్ (JNTUH) లోని గోల్డెన్ జూబ్లీ హాల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు ఈఏపీ సెట్‌ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ విజయకుమార్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాల ప్రకటన పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి మార్కులు, ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలని కన్వీనర్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu