By - Sathwik |14 May 2026 4:15 PM IST
16 రాష్ట్రాల్లో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' మూడో దశను చేపట్టాలని ఆదేశాలు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను మరింత కచ్చితంగా, పారదర్శకంగా తీర్చిదిద్దే దిశగా ఎన్నికల సంఘం కీలక చర్యలు ప్రారంభించింది.
ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు అందేలా చూడాలన్న లక్ష్యంతో ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో దేశంలోని 16 రాష్ట్రాల్లో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) మూడో దశ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నిర్ణయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ విస్తృత ప్రక్రియ కొనసాగనుంది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించి జాబితాలను నవీకరించేందుకు ఎన్నికల సంఘం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.
ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను సవరించడం, ఒకే వ్యక్తి పేరుతో నమోదైన డూప్లికేట్ ఓట్లను తొలగించడం, మరణించిన లేదా చిరునామా మారిన వారి వివరాలను నవీకరించడం వంటి అంశాలకు ఈ ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే సమయంలో 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని తొలిసారి ఓటు హక్కు పొందనున్న యువత పేర్లు తప్పకుండా జాబితాలో చేరేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈసీ అధికారులను ఆదేశించింది.
క్షేత్రస్థాయిలో అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరించనున్నారు. ఎన్నికల జాబితాలో ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు దశల్లో చేపట్టిన ప్రత్యేక సవరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తికాగా, ఇప్పుడు మూడో దశను మరింత విస్తృత స్థాయిలో అమలు చేయనున్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా పూర్తి స్థాయిలో శుద్ధి చేయడం ద్వారా ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలన్నదే ఎన్నికల సంఘం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను మరింత కచ్చితంగా, పారదర్శకంగా తీర్చిదిద్దే దిశగా ఎన్నికల సంఘం కీలక చర్యలు ప్రారంభించింది. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు అందేలా చూడాలన్న లక్ష్యంతో ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో దేశంలోని 16 రాష్ట్రాల్లో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) మూడో దశ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నిర్ణయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ విస్తృత ప్రక్రియ కొనసాగనుంది. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించి జాబితాలను నవీకరించేందుకు ఎన్నికల సంఘం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

