By - Sathwik |25 May 2026 5:00 PM IST
భూదాన్ స్కామ్‌లో పొలిటికల్ లింకులు.. ధరణి రిజిస్ట్రేషన్ల అక్రమాలపై దర్యాప్తు
తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన భూదాన్ భూముల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది.
ఈ కేసులో అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి విచారణకు పిలిచారు. ఇప్పటికే పలు దశల్లో విచారణ చేపట్టిన ఈడీ, తాజా సమన్లతో కేసు దర్యాప్తును మరింత లోతుగా తీసుకెళ్తోంది. ఈ వ్యవహారంలో భూదాన్ భూముల బదిలీ, ఆర్థిక లావాదేవీలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలు ప్రధానంగా దృష్టి ఆకర్షిస్తున్నాయి. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ గతంలోనే మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు క్రమంలో ఇప్పటికే అమోయ్ కుమార్‌ను పలుమార్లు అధికారులు ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు సమాచారం. తాజాగా ఈ నెల 25న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయడంతో ఆయన హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విచారణలో పలు కీలక అంశాలపై అధికారులు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో మహేశ్వరం పరిధిలోని సుమారు 42 ఎకరాల విలువైన భూదాన్ భూముల బదిలీ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అసలు సామాజిక ప్రయోజనాల కోసం కేటాయించిన ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసే ప్రక్రియలో విధివిధానాలు పాటించలేదన్న ఆరోపణలు దర్యాప్తులో ప్రధాన అంశంగా మారాయి. ముఖ్యంగా ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మరో కీలక అంశం 22-ఏ జాబితాకు సంబంధించినది. సాధారణంగా నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల కొనుగోలు, అమ్మకాలపై పరిమితులు ఉంటాయి. అయితే ఈ భూములను ఆ జాబితా నుంచి తొలగించి, తర్వాత ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమంగా ఆర్థిక ప్రయోజనాలు పొందిన అవకాశాలపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది.
ధరణి పోర్టల్‌లో ఈ భూములకు సంబంధించిన రికార్డుల్లో జరిగిన మార్పులు దర్యాప్తులో ప్రధాన అంశాలుగా మారాయి. రాత్రికి రాత్రే భూముల వివరాల్లో మార్పులు చోటుచేసుకోవడం, నిషేధిత జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ పూర్తవడం, కొత్త పాస్‌బుక్స్ జారీ కావడం వంటి పరిణామాలు అనుమానాలకు తావిచ్చాయి. ఈ అంశాలపై రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, ఈడీ అధికారులు సమగ్రంగా దృష్టి సారించారు. ప్రాథమిక విచారణలో అమోయ్ కుమార్ హయాంలో జరిగిన కొన్ని సేల్ డీడ్లలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం.
తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన భూదాన్ భూముల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి విచారణకు పిలిచారు. ఇప్పటికే పలు దశల్లో విచారణ చేపట్టిన ఈడీ, తాజా సమన్లతో కేసు దర్యాప్తును మరింత లోతుగా తీసుకెళ్తోంది. ఈ వ్యవహారంలో భూదాన్ భూముల బదిలీ, ఆర్థిక లావాదేవీలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలు ప్రధానంగా దృష్టి ఆకర్షిస్తున్నాయి. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ గతంలోనే మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు క్రమంలో ఇప్పటికే అమోయ్ కుమార్‌ను పలుమార్లు అధికారులు ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు సమాచారం. తాజాగా ఈ నెల 25న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయడంతో ఆయన హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ విచారణలో పలు కీలక అంశాలపై అధికారులు సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

