Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో ఢీకొన్న  యుద్ధ విమానాలు

F-18 Collision: వైమానిక ప్రదర్శనలో ఢీకొన్న యుద్ధ విమానాలు

TV5 News 6 days ago

By - jyotsna |18 May 2026 7:45 AM IST

ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు

అమెరికాలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

రెండు అమెరికన్ EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కుప్పకూలిపోయాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) ప్రాంతంలో జరిగింది.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో యుద్ధ విమానాలు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన పైలట్స్ పారాచూట్స్ సాయంతో కిందకు దూకారు. ఇడాహో స్టేట్స్‌మ్యాన్ కథనం ప్రకారం, నలుగురు సిబ్బంది (పైలట్లు) సురక్షితంగా బయటకు దూకారని, వారు పూర్తిగా క్షేమంగా ఉన్నారని ఆ షో అనౌన్సర్ ప్రేక్షకులకు తెలియజేశారు. నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో చిక్కుకున్న విమానాలు యూఎస్ నేవీ/ఎయిర్ ఫోర్స్ ఉపయోగించే రెండు EA-18G గ్రోలర్ ఫైటర్ జెట్‌లు. ఇవి F-18 హార్నెట్‌కు చెందిన ఒక అధునాతన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వేరియంట్. ఎయిర్‌బేస్‌కు సుమారు రెండు మైళ్ల దూరంలో ఈ రెండు జెట్‌లు కూలిపోయాయని అధికారులు తెలిపారు. మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రతినిధి మాట్లాడుతూ, దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని తెలిపారు.

అమెరికాలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు అమెరికన్ EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కుప్పకూలిపోయాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) ప్రాంతంలో జరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu