By - TV5 Entertainment |18 May 2026 2:16 PM IST
మాస్ ఎంటర్టైనర్స్ అంటే మాగ్జిమం డైరెక్టర్స్ కు ఫేవరెట్ జానర్. ఇలాంటి మూవీస్ అయితే చాలా సేఫ్ గా ఉంటాం అని భావిస్తుంటారు.
అఫ్ కోర్స్ అలాంటి మూవీస్ విషయంలోనే చాలా తేడాలు కొడుతుంటాయి. అయితే రెండు క్లాస్ మూవీస్ తో బాగా ఆకట్టుకున్న దర్శకుడు సడెన్ గా యాక్షన్ థ్రిల్లర్ అంటేనే ఆడియన్స్ లో ఓ రకమైన క్రేజీ ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి మూవీతో వస్తున్నాడు దర్శకుడు సి ప్రేమ్ కుమార్. సడెన్ గా అతనెవరూ అనుకుంటారేమో.. రెండు సూపర్ క్లాస్ మూవీస్ తో మాస్ ఆడియన్స్ కు కూడా తిరుగులేని ఫీస్ట్ ఇచ్చిన దర్శకుడు అతను. విజయ్ సేతుపతి, త్రిష జంటగా అతను తీసిన మూవీ 96 మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. తెలుగులోనూ ఈ చిత్రం జానుగా రీమేక్ అయింది. బట్ తమిళ్ లాంటి మ్యాజిక్ రిపీట్ కాలేదు. తర్వాత మేయాళవన్ తో మరో క్లాసిక్ మూవీ అందించాడు. అదే చిత్రాన్ని తెలుగులో సత్యం సుందరం అనే పేరుతో విడుదల చేశాడు. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ తమిళ్ కంటే కూడా తెలుగులోనే పెద్ద విజయాన్ని అందుకుంది. అలాంటి దర్శకుడు ఈ సారి యాక్షన్ థ్రిల్లర్ వస్తున్నాడు.
ఫహాద్ ఫాజిల్ హీరోగా సి. ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొందుతోంది. మామూలుగా ఫహాద్ ఫాజిల్ అంటే అతను ఎంచుకునే కథల్లో ఖచ్చితంగా కొత్తదనం ఉంటుంది. ఆ పాయింట్ నచ్చితేనే అతను ఓకే చెబుతుంటాడు. సినిమాల్లో క్యారెక్టర్ నటుడుగా కనిపించినా అతను తనదైన ముద్ర వేస్తుంటాడు. అలాంటి హీరో.. యాక్షన్ థ్రిల్లర్ అంటే ఖచ్చితంగా ఏదో ఉండబోతోంది అనిపిస్తోంది. తాజాగా ఈ మూవీ అనౌన్స్ అయింది. త్వరలోనే మిగతా కాస్టింగ్ కూడా సెట్ చేయబోతున్నారు. విశేషం ఏంటంటే.. తన 96, సత్యం సుందరం చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన గోవింద్ వసంత్ నే ఈ యాక్షన్ థ్రిల్లర్ కు కూడా తీసుకున్నాడు ప్రేమ్ కుమార్.
మాస్ ఎంటర్టైనర్స్ అంటే మాగ్జిమం డైరెక్టర్స్ కు ఫేవరెట్ జానర్. ఇలాంటి మూవీస్ అయితే చాలా సేఫ్ గా ఉంటాం అని భావిస్తుంటారు. అఫ్ కోర్స్ అలాంటి మూవీస్ విషయంలోనే చాలా తేడాలు కొడుతుంటాయి. అయితే రెండు క్లాస్ మూవీస్ తో బాగా ఆకట్టుకున్న దర్శకుడు సడెన్ గా యాక్షన్ థ్రిల్లర్ అంటేనే ఆడియన్స్ లో ఓ రకమైన క్రేజీ ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి మూవీతో వస్తున్నాడు దర్శకుడు సి ప్రేమ్ కుమార్. సడెన్ గా అతనెవరూ అనుకుంటారేమో.. రెండు సూపర్ క్లాస్ మూవీస్ తో మాస్ ఆడియన్స్ కు కూడా తిరుగులేని ఫీస్ట్ ఇచ్చిన దర్శకుడు అతను. విజయ్ సేతుపతి, త్రిష జంటగా అతను తీసిన మూవీ 96 మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. తెలుగులోనూ ఈ చిత్రం జానుగా రీమేక్ అయింది. బట్ తమిళ్ లాంటి మ్యాజిక్ రిపీట్ కాలేదు. తర్వాత మేయాళవన్ తో మరో క్లాసిక్ మూవీ అందించాడు. అదే చిత్రాన్ని తెలుగులో సత్యం సుందరం అనే పేరుతో విడుదల చేశాడు. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ తమిళ్ కంటే కూడా తెలుగులోనే పెద్ద విజయాన్ని అందుకుంది. అలాంటి దర్శకుడు ఈ సారి యాక్షన్ థ్రిల్లర్ వస్తున్నాడు.

