By - Sathwik |16 May 2026 8:45 AM IST
స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు- రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సుదీర్ఘ విచారణ
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు హైకోర్టులో కీలక మలుపు తిరిగింది.
కేసు దర్యాప్తు ప్రారంభ దశలో ఉండటంతో ప్రస్తుతం ఎలాంటి ఉపశమనం కల్పించే పరిస్థితి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం, తక్షణ నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించింది. ఈ వ్యవహారంలో మధ్యంతర రక్షణ ఇవ్వాలన్న అభ్యర్థనపైనా వెంటనే నిర్ణయం తీసుకోకుండా, వచ్చే వారం పరిశీలిస్తామని తెలిపింది. దీంతో ఈ కేసు రాజకీయ, న్యాయపరంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి. మాధవీదేవి శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. రాత్రి 9 గంటల సమయంలో ప్రారంభమైన విచారణ దాదాపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు, ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదులు తమ వాదనలు కోర్టు ముందుంచారు. ఇరుపక్షాల వాదనలు, కేసుకు సంబంధించిన వివరాలు, బాలిక ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించిన అనంతరం ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
హోరహోరీ వాదనలు
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. కేసు నమోదు సమయంలో పేర్కొన్న సెక్షన్ల ప్రకారం వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేసులో పిటిషనర్‌ను ఉద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సంఘటన జరిగిన సమయం, ఫిర్యాదు నమోదు చేసిన సమయానికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని, డిసెంబర్‌లో జరిగిన ఘటనకు మే నెలలో ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అంతేకాకుండా బాధితురాలి జనన తేదీలకు సంబంధించిన పత్రాల్లో భిన్న వివరాలు ఉన్నాయని, వాటిని సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించామని తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న కొన్ని సంఘటనలు పరస్పర అంగీకారంతోనే జరిగాయని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరూ ఒక సంబంధంలో ఉన్నారని, ఆ సంబంధం ముగిసిన తర్వాతే ఈ కేసు వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఫిర్యాదులో బలవంతంగా మద్యం తాగించారన్న ఆరోపణలు చేసినప్పటికీ, వీడియో ఆధారాలు చూస్తే అవి స్వచ్ఛందంగానే జరిగినట్లు కనిపిస్తున్నాయని వాదించారు. ఈ నేపథ్యంలో కనీసం పిటిషనర్‌పై తాత్కాలిక చర్యలు తీసుకోకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టును అభ్యర్థించారు.
బాలిక మైనరే
అయితే ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు ఆ వాదనలను ఖండించారు. మొదటి ఫిర్యాదులోనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, వాటి ఆధారంగా పోక్సో చట్టంలోని కఠిన నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత అదనపు సెక్షన్లు చేర్చడం చట్టబద్ధమైన ప్రక్రియలో భాగమని వివరించారు. పోలీసుల దర్యాప్తులో వివిధ పాఠశాలల రికార్డులు, వైద్య పత్రాలు పరిశీలించిన తర్వాత బాధితురాలి జనన తేదీ 2008 ఆగస్టు 12గా నిర్ధారించబడిందని, అందువల్ల ఆమె మైనర్ పరిధిలోనే వస్తుందని తెలిపారు. ఇక ఫిర్యాదుదారు తరఫున సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు కూడా కీలక వాదనలు వినిపించారు. నిందితుడి కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రభావం కారణంగా బాధిత కుటుంబం ఒత్తిడికి గురవుతోందని ఆరోపించారు. బెదిరింపుల వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో బాధితురాలికి న్యాయం జరగాలంటే ఈ దశలో ఎలాంటి రక్షణ కల్పించకూడదని కోర్టును కోరారు. ఇంకా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొంత మంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. విచారణ సమయంలో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాల అంశం కూడా చర్చకు వచ్చింది. తనపై జరుగుతున్న కొన్ని వ్యక్తిగత ఆరోపణలు, దుష్ప్రచారాలు ఆందోళన కలిగిస్తున్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కొంతమంది తనను ప్రభావితం చేస్తున్నారని, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నగర పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పగా, ఇలాంటి వ్యవహారాలపై చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కేసు విచారణ ఇంకా ప్రారంభ దశలోనే ఉండటంతో తక్షణ నిర్ణయం ఇవ్వకుండా హైకోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో తదుపరి విచారణపై రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. కేసు దర్యాప్తు ప్రారంభ దశలో ఉండటంతో ప్రస్తుతం ఎలాంటి ఉపశమనం కల్పించే పరిస్థితి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం, తక్షణ నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించింది. ఈ వ్యవహారంలో మధ్యంతర రక్షణ ఇవ్వాలన్న అభ్యర్థనపైనా వెంటనే నిర్ణయం తీసుకోకుండా, వచ్చే వారం పరిశీలిస్తామని తెలిపింది. దీంతో ఈ కేసు రాజకీయ, న్యాయపరంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి. మాధవీదేవి శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. రాత్రి 9 గంటల సమయంలో ప్రారంభమైన విచారణ దాదాపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు, ఫిర్యాదుదారు తరఫు న్యాయవాదులు తమ వాదనలు కోర్టు ముందుంచారు. ఇరుపక్షాల వాదనలు, కేసుకు సంబంధించిన వివరాలు, బాలిక ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించిన అనంతరం ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
హోరహోరీ వాదనలు
బాలిక మైనరే
హోరహోరీ వాదనలు
బాలిక మైనరే
హోరహోరీ వాదనలు
బాలిక మైనరే

