By - Sathwik |23 May 2026 5:38 PM IST
హైదరాబాద్‌లో ఘోరం
హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. నగర నడిబొడ్డున జరిగిన ఈ సంఘటన సాధారణ ప్రమాదమా, లేక పక్కా ప్రణాళికతో చేసిన హత్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక సీనియర్ న్యాయవాది అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటన వెనుక పాత విభేదాలు, వ్యక్తిగత కక్షలు లేదా ఆయన నిర్వహిస్తున్న న్యాయపరమైన పోరాటాలే కారణమా అన్న దిశగా పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. నగరంలోని మాసబ్‌ట్యాంక్ పరిధిలో నివాసం ఉంటున్న సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ శనివారం ఉదయం తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. తన కారులో బయలుదేరేందుకు సిద్ధమవుతూ వాహనం డోర్ తెరిచే సమయంలో, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఆయనను బలంగా ఢీకొట్టింది. ఘటన జరిగిన వెంటనే ఆ వాహనం అక్కడి నుంచి ఆగకుండా వేగంగా వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మొయినుద్దీన్‌ను స్థానికులు వెంటనే గమనించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, న్యాయవాద వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా, ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో మొత్తం దృశ్యాలు రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఖాజా మొయినుద్దీన్ హైకోర్టు, సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణకు సంబంధించి పలు చట్టపరమైన పోరాటాలు చేస్తున్నట్లు తెలిసింది. కోట్ల రూపాయల విలువైన భూముల వ్యవహారాల్లో ఆయన చురుకుగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వ్యక్తిగత విభేదాలు కూడా కారణమై ఉండవచ్చనే కోణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఉపయోగించి ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టినట్లు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, దర్యాప్తు మరింత కీలకంగా మారింది.
హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. నగర నడిబొడ్డున జరిగిన ఈ సంఘటన సాధారణ ప్రమాదమా, లేక పక్కా ప్రణాళికతో చేసిన హత్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సీనియర్ న్యాయవాది అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటన వెనుక పాత విభేదాలు, వ్యక్తిగత కక్షలు లేదా ఆయన నిర్వహిస్తున్న న్యాయపరమైన పోరాటాలే కారణమా అన్న దిశగా పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. నగరంలోని మాసబ్‌ట్యాంక్ పరిధిలో నివాసం ఉంటున్న సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ శనివారం ఉదయం తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. తన కారులో బయలుదేరేందుకు సిద్ధమవుతూ వాహనం డోర్ తెరిచే సమయంలో, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఆయనను బలంగా ఢీకొట్టింది. ఘటన జరిగిన వెంటనే ఆ వాహనం అక్కడి నుంచి ఆగకుండా వేగంగా వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మొయినుద్దీన్‌ను స్థానికులు వెంటనే గమనించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

