Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Inder Kaur: కాలువలో శవమై తేలిన పంజాబీ గాయని

Inder Kaur: కాలువలో శవమై తేలిన పంజాబీ గాయని

TV5 News 4 days ago

By - jyotsna |20 May 2026 6:00 AM IST

యువ సింగర్ ఇందర్ కౌర్ అనుమానాస్పద మృతి..

పంజాబీ యువ గాయని, మేకప్ ఆర్టిస్ట్ ఇందర్ కౌర్ (29) దారుణ హత్యకు గురయ్యారు.

కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన ఆమె మృతదేహాన్ని లూధియానాలోని ఓ కాలువలో పోలీసులు గుర్తించారు. ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే, లూధియానాలోని జమాల్‌పూర్ నివాసి అయిన ఇందర్ కౌర్, మే 13న తన కారులో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, కెనడాలో నివసించే సుఖ్‌విందర్ సింగ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతనికి సహకరించారన్న ఆరోపణలపై సుఖ్‌విందర్ తండ్రి ప్రీతం సింగ్, స్నేహితుడు కరమ్‌జీత్ సింగ్‌లను అరెస్ట్ చేశారు.

సుమారు మూడేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో సుఖ్‌విందర్‌తో ఇందర్ కౌర్‌కు పరిచయం ఏర్పడింది. అయితే, అతనికి అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నారని తెలియడంతో ఆమె అతనితో సంబంధాన్ని తెంచుకుంది. దీన్ని జీర్ణించుకోలేని సుఖ్‌విందర్, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

హత్య చేసేందుకే సుఖ్‌విందర్ కెనడా నుంచి నేపాల్ మీదుగా పంజాబ్ వచ్చాడని, పథకం ప్రకారం ఆమెను హత్య చేయించి తిరిగి కెనడాకు పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఇందర్ కౌర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమ్రాలా సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఒకప్పుడు గాయనిగా రాణించిన ఆమె, గత ఐదేళ్లుగా బౌటిక్, మేకప్ స్టూడియో నడుపుతోంది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

పంజాబీ యువ గాయని, మేకప్ ఆర్టిస్ట్ ఇందర్ కౌర్ (29) దారుణ హత్యకు గురయ్యారు. కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన ఆమె మృతదేహాన్ని లూధియానాలోని ఓ కాలువలో పోలీసులు గుర్తించారు. ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu