Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
INDIRAMMA HOUSE: జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభం

INDIRAMMA HOUSE: జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభం

TV5 News 1 week ago

By - Sathwik |16 May 2026 7:00 PM IST

పేదలకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్

తెలంగాణలో సొంతింటి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటనతో ఆశలు నింపింది.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన రెండో విడత కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా వేదిక కానుండగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పేదలకు గృహ కల్పనతో పాటు పెండింగ్‌లో ఉన్న పలు రెవెన్యూ సమస్యల పరిష్కారంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం మీడియాతో జరిగిన సమావేశంలో మంత్రి పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలైన పాత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులుగా ఎంపికై, వివిధ కారణాల వల్ల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయలేకపోయిన వారికి ఈ విడతలో మరో అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

అంతేకాకుండా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి వివరించారు. ప్రజాప్రతినిధులు ప్రధానంగా మూడు రకాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారం కోసం వేగంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ముఖ్యంగా అటవీ మరియు రెవెన్యూ భూముల మధ్య సరిహద్దు వివాదం చాలా కాలంగా కొనసాగుతోందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు సంబంధిత అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అటవీ ప్రాంతాల పూర్తి స్థాయి సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. సర్వే నివేదికలను జిల్లా కలెక్టర్లకు అందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పట్టాలు ఉన్నప్పటికీ సాగు చేసుకునే భూమి లేని పేదలను గుర్తించి వారికి తగిన భూమి కేటాయించే దిశగా జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక చాలా కాలంగా ప్రజలకు ఇబ్బందిగా మారిన సాదాబైనామా వ్యవహారాలను కూడా ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుందని, వాటిని 'భూ భారతి' పోర్టల్‌లో చేర్చినట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత సమస్యలకు త్వరలోనే పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించి రైతులు, భూ యజమానులకు ఊరట కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణలో సొంతింటి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటనతో ఆశలు నింపింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన రెండో విడత కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా వేదిక కానుండగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పేదలకు గృహ కల్పనతో పాటు పెండింగ్‌లో ఉన్న పలు రెవెన్యూ సమస్యల పరిష్కారంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం మీడియాతో జరిగిన సమావేశంలో మంత్రి పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలైన పాత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులుగా ఎంపికై, వివిధ కారణాల వల్ల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయలేకపోయిన వారికి ఈ విడతలో మరో అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu