Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL: ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన సన్ రైజర్స్

IPL: ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన సన్ రైజర్స్

TV5 News 5 days ago

By - Sathwik |19 May 2026 8:00 AM IST

ఎనిమిదో విజయంతో ప్లే ఆఫ్ బెర్తు ఖాయం... వారి సొంత గడ్డపైనే చెన్నైపై గెలుపు... తొలుత 180 పరుగులు చేసిన చెన్నై

ఐపీ­ఎ­ల్‌ సీ­జ­న్‌ ము­గిం­పు దశకు చే­రు­కుం­టు­న్న వేళ సన్‌­రై­జ­ర్స్‌ హై­ద­రా­బా­ద్‌ తమ ప్ర­ద­ర్శ­న­తో మరో­సా­రి బల­మైన సం­దే­శం పం­పిం­ది. వరుస వి­జ­యా­ల­తో ఆత్మ­వి­శ్వా­సా­న్ని పెం­చు­కుం­టూ వస్తు­న్న హై­ద­రా­బా­ద్‌ జట్టు, కీలక సమ­యం­లో మరింత సమ­న్వ­యం­తో ఆడి ప్లే­ఆ­ఫ్స్‌ బె­ర్త్‌­ను ఖరా­రు చే­సు­కుం­ది. చె­న్నై వే­ది­క­గా జరి­గిన ఉత్కం­ఠ­భ­రిత పో­రు­లో అన్ని వి­భా­గా­ల్లో­నూ మె­రు­గైన ఆట­తీ­రు­ను కన­బ­రి­చిన సన్‌­రై­జ­ర్స్‌ ఐదు వి­కె­ట్ల తే­డా­తో చె­న్నై సూ­ప­ర్‌­కిం­గ్స్‌­పై వి­జ­యం సా­ధిం­చిం­ది. ఈ వి­జ­యం­తో హై­ద­రా­బా­ద్‌ ఖా­తా­లో ఎని­మి­దో గె­లు­పు చే­ర­గా, ప్లే­ఆ­ఫ్స్‌­కు అధి­కా­రి­కం­గా అర్హత సా­ధిం­చిం­ది. మరో­వై­పు చె­న్నై­కి ఇది ఏడో ఓటమి కా­వ­డం­తో ప్లే­ఆ­ఫ్స్‌ ఆశలు ఇంకా సజీ­వం­గా ఉన్న­ప్ప­టి­కీ పరి­స్థి­తి మా­త్రం క్లి­ష్టం­గా మా­రిం­ది. ముం­దు­గా టా­స్‌ గె­లి­చిన చె­న్నై బ్యా­టిం­గ్‌ ఎం­చు­కుం­ది. ఆ ని­ర్ణ­యా­ని­కి తగ్గ­ట్టు­గా­నే ఆ జట్టు బ్యా­ట­ర్లు ఆరం­భం­లో వే­గం­గా పరు­గు­లు సా­ధిం­చే ప్ర­య­త్నం చే­శా­రు. ము­ఖ్యం­గా సంజు శాం­స­న్‌ దూ­కు­డైన షా­ట్ల­తో ప్ర­త్య­ర్థి బౌ­ల­ర్ల­పై ఎదు­రు­దా­డి­కి ది­గా­డు. తొలి ఓవ­ర్లో­నే బౌం­డ­రీ­లు, భారీ షా­ట్‌­ల­తో పరు­గుల వర్షం కు­రి­పిం­చా­డు. మరో ఓవ­ర్లో వరు­స­గా బౌం­డ­రీ­లు సా­ధిం­చి చె­న్నై­కి చు­రు­కైన ఆరం­భా­న్ని అం­దిం­చా­డు. అయి­తే అతని దూ­కు­డు­కు సన్‌­రై­జ­ర్స్‌ కె­ప్టె­న్‌ పాట్ కమి­న్స్‌ బ్రే­క్‌ వే­శా­డు. కీలక సమ­యం­లో వి­కె­ట్‌ తీసి ప్ర­త్య­ర్థి జో­రు­ను తగ్గిం­చా­డు. కొ­ద్ది­సే­ప­టి­కే ఉర్వి­ల్‌ పటే­ల్‌ కూడా వె­ను­ది­ర­గ­డం­తో చె­న్నై రెం­డు కీలక వి­కె­ట్లు కో­ల్పో­యిం­ది. ఆ దశలో రు­తు­రా­జ్‌­తో కలి­సి కా­ర్తీ­క్‌ శర్మ ఇన్నిం­గ్స్‌­ను ని­ల­బె­ట్టే బా­ధ్యత తీ­సు­కు­న్నా­డు. మొ­ద­ట్లో కా­స్త నె­మ్మ­ది­గా కని­పిం­చి­నా తర్వాత వేగం పెం­చి అద్భు­త­మైన షా­ట్ల­తో ఆక­ట్టు­కు­న్నా­డు. మరో­వై­పు రు­తు­రా­జ్‌ మా­త్రం వే­గం­గా పరు­గు­లు చే­య­డం­లో ఇబ్బం­ది­ప­డ్డా­డు. అతడు క్రీ­జు­లో ఎక్కు­వ­సే­పు ని­లి­చి­నా బౌం­డ­రీ­లు సా­ధిం­చ­లే­క­పో­యా­డు.

బ్రెవిస్‌ ఇన్నింగ్స్‌కు కొత్త ఊపు తీసుకొచ్చాడు. చివరి నాలుగు ఓవర్లలో చెన్నై కేవలం 36 పరుగులు మాత్రమే సాధించగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులతో ఇన్నింగ్స్‌ను ముగించింది. బ్రెవిస్‌ 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, కార్తీక్‌ శర్మ 32, సంజు శాంసన్‌ 27 పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో కమిన్స్‌ మూడు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. సాకిబ్‌ రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాన్‌ మలింగ ఒక వికెట్‌ సాధించాడు.

181 పరు­గుల లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన సన్‌­రై­జ­ర్స్‌­కు ప్రా­రం­భం ఆశిం­చి­నం­త­గా లభిం­చ­లే­దు. వి­ధ్వం­సక ఓపె­న­ర్‌ ట్రా­వి­స్‌ హె­డ్‌ త్వ­ర­గా పె­వి­లి­య­న్‌ చే­ర­డం­తో ఒత్తి­డి పె­రి­గిం­ది. పవ­ర్‌­ప్లే ము­గి­సే సమ­యా­ని­కి స్కో­రు కూడా పె­ద్ద­గా వే­గం­గా సా­గ­లే­దు. అభి­షే­క్‌ శర్మ కొం­త­సే­పు వే­గం­గా ఆడే ప్ర­య­త్నం చే­సి­నా పె­ద్ద ఇన్నిం­గ్స్‌­గా మా­ర్చు­కో­లే­క­పో­యా­డు. అయి­తే మరో­వై­పు ఇషా­న్‌ కి­ష­న్‌ క్రీ­జు­లో ని­ల­దొ­క్కు­కు­ని బా­ధ్య­తా­యు­తం­గా ఆడా­డు తన­దైన శై­లి­లో దూ­కు­డు­గా ఆడు­తూ చె­న్నై బౌ­ల­ర్ల­పై ఒత్తి­డి పెం­చా­డు. క్లా­సె­న్‌ స్టం­పౌ­ట్‌ కా­వ­డం­తో మ్యా­చ్‌ మరో­సా­రి ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది. చి­వ­రి నా­లు­గు ఓవ­ర్ల­లో ఇంకా 38 పరు­గు­లు అవ­స­ర­మైన దశలో ఇషా­న్‌ కి­ష­న్‌ ఒత్తి­డి­ని సమ­ర్థం­గా ఎదు­ర్కొ­న్నా­డు. ని­తీ­శ్‌ కు­మా­ర్‌ రె­డ్డి ఔటై­నా అతడు తన బ్యా­టిం­గ్‌­లో ఏమా­త్రం తొం­ద­ర­ప­డ­లే­దు. కీలక సమ­యం­లో బౌం­డ­రీ, సి­క్స­ర్‌­తో సమీ­క­ర­ణా­న్ని సు­ల­భం చే­శా­డు. చి­వ­ర్లో ఇషా­న్‌ 70 పరు­గుల అద్భుత ఇన్నిం­గ్స్‌­తో జట్టు­ను వి­జ­యా­ని­కి చే­రువ చే­శా­డు. అతడు ఔటైన తర్వాత సలీ­ల్‌ ఆరో­రా, స్మ­ర­ణ్‌ మి­గి­లిన పని­ని పూ­ర్తి చేసి జట్టు­కు కీలక వి­జ­యా­న్ని అం­దిం­చా­రు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu