By - Sathwik |18 May 2026 9:00 AM IST
రూ. 80 వేలకు ఒక్కో టికెట్.
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన వేళ, టికెట్ల బ్లాక్ మార్కెట్ దందా కలకలం రేపుతోంది.
ముఖ్యంగా ఢిల్లీ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ టికెట్లకు డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, ఒక్కో కాంప్లిమెంటరీ పాస్‌ను ఏకంగా రూ. 80 వేల వరకూ విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధపడటాన్ని కేటుగాళ్లు సొమ్ము చేసుకున్నారు. ఈ భారీ స్కామ్‌లో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఉన్నత స్థాయి అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం స్థానిక అసోసియేషన్‌కు కేటాయించే 10-15 శాతం కాంప్లిమెంటరీ పాస్‌లలో.. దాదాపు 1000 టికెట్లను దొంగచాటుగా అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టేడియం పరిసరాల్లో టికెట్లు బ్లాక్‌లో అమ్ముతుండగా ముకీమ్, గుర్ఫాన్, ఫైసల్‌తో పాటు పెట్రోల్ పంప్ ఉద్యోగి పంకజ్ యాదవ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా అసలు తిమింగలాల గుట్టు రట్టయింది. ఈ దందా వెనుక బోర్డు కీలక అధికారి ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఇద్దరు సీనియర్ అధికారులతో సహా నలుగురు డీడీసీఏ సిబ్బందిని పోలీసులు గంటల తరబడి విచారించారు. ఫ్రాంచైజీల నియంత్రణలో ఉండాల్సిన టికెట్లు ఇలా బ్లాక్ మార్కెట్‌కు తరలడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని, మున్ముందు ఇలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ధోని సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్నాడా?
ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ రేసు అత్యంత ఆసక్తికరంగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఈ సీజన్‌లో ఇక కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అందులోనూ తమ అజేయ దుర్గమైన చెపాక్ మైదానంలో ఆడే చివరి హోమ్ మ్యాచ్ మే 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనుంది. ఇరు జట్లకు ప్లేఆఫ్స్ బెర్తు పరంగా ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారినప్పటికీ, అభిమానుల దృష్టి మాత్రం మరో అంశంపైనే నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ మైదానంలోకి అడుగుపెట్టని క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని, ఈ ఆఖరి హోమ్ మ్యాచ్‌లోనైనా తుది జట్టులో ఆడతాడా లేదా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త తీవ్రంగా హల్‌చల్ చేస్తోంది. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగి, అదే మ్యాచ్ ముగిసిన అనంతరం ఐపీఎల్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే కథనాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వైరల్ వార్తలపై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఆసక్తికరంగా స్పందించాడు. చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య జరగబోయే ఈ మ్యాచ్‌లో అభిమానులందరూ ఒక పెద్ద సర్‌ప్రైజ్‌ను చూసే అవకాశం ఉందని ఆయన విశ్లేషించాడు.
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన వేళ, టికెట్ల బ్లాక్ మార్కెట్ దందా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఢిల్లీ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ టికెట్లకు డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, ఒక్కో కాంప్లిమెంటరీ పాస్‌ను ఏకంగా రూ. 80 వేల వరకూ విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధపడటాన్ని కేటుగాళ్లు సొమ్ము చేసుకున్నారు. ఈ భారీ స్కామ్‌లో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఉన్నత స్థాయి అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం స్థానిక అసోసియేషన్‌కు కేటాయించే 10-15 శాతం కాంప్లిమెంటరీ పాస్‌లలో.. దాదాపు 1000 టికెట్లను దొంగచాటుగా అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టేడియం పరిసరాల్లో టికెట్లు బ్లాక్‌లో అమ్ముతుండగా ముకీమ్, గుర్ఫాన్, ఫైసల్‌తో పాటు పెట్రోల్ పంప్ ఉద్యోగి పంకజ్ యాదవ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా అసలు తిమింగలాల గుట్టు రట్టయింది. ఈ దందా వెనుక బోర్డు కీలక అధికారి ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఇద్దరు సీనియర్ అధికారులతో సహా నలుగురు డీడీసీఏ సిబ్బందిని పోలీసులు గంటల తరబడి విచారించారు. ఫ్రాంచైజీల నియంత్రణలో ఉండాల్సిన టికెట్లు ఇలా బ్లాక్ మార్కెట్‌కు తరలడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని, మున్ముందు ఇలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ధోని సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్నాడా?
ధోని సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్నాడా?
ధోని సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్నాడా?

