Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL: ఐపీఎల్‌లో మరో కొత్త జట్టు రాబోతుందా.?

IPL: ఐపీఎల్‌లో మరో కొత్త జట్టు రాబోతుందా.?

TV5 News 14 hrs ago

By - Sathwik |23 May 2026 11:00 AM IST

ఐపీ­ఎ­ల్‌­లో కొ­త్త జట్టు చే­రి­క­పై మరో­సా­రి ఆస­క్తి­క­ర­మైన చర్చ

ఐపీ­ఎ­ల్‌­లో కొ­త్త జట్టు చే­రి­క­పై మరో­సా­రి ఆస­క్తి­క­ర­మైన చర్చ మొ­ద­లైం­ది. ఇప్ప­టి­కే దే­శం­లో­ని పలు ప్రాం­తా­ల­కు ప్రా­తి­ని­ధ్యం వహి­స్తు­న్న జట్లు భారీ స్థా­యి­లో అభి­మా­ను­ల­ను సం­పా­దిం­చు­కు­న్నా­యి. చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్, ముం­బై ఇం­డి­య­న్స్, కో­ల్‌­క­తా నైట్ రై­డ­ర్స్ వంటి జట్లు కే­వ­లం క్రి­కె­ట్ జట్లు­గా­నే కా­కుం­డా భారీ బ్రాం­డ్‌­లు­గా ఎది­గా­యి. ఇప్పు­డు అదే తర­హా­లో బీ­హా­ర్‌­కు కూడా ప్ర­త్యేక ఐపీ­ఎ­ల్ జట్టు ఉం­డా­ల­న్న ప్ర­తి­పా­దన వె­లు­గు­లో­కి రా­వ­డం క్రి­కె­ట్ అభి­మా­ను­ల్లో ఆస­క్తి­ని పెం­చు­తోం­ది. ము­ఖ్యం­గా ఈ ఆలో­చ­న­కు ప్ర­ముఖ పా­రి­శ్రా­మి­క­వే­త్త అని­ల్ అగ­ర్వా­ల్ మద్ద­తు ప్ర­క­టిం­చ­డం చర్చ­కు మరింత ఊపు­ని­చ్చిం­ది. బీ­హా­ర్‌­కు కూడా ఐపీ­ఎ­ల్‌­లో ఒక బల­మైన జట్టు ఉం­డా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని అని­ల్ అగ­ర్వా­ల్ అభి­ప్రా­య­ప­డ్డా­రు. సరైన మౌ­లిక వస­తు­లు, ప్రో­త్సా­హం, ప్ర­పంచ స్థా­యి శి­క్ష­ణా సదు­పా­యా­లు కల్పి­స్తే బీ­హా­ర్ నుం­చి ప్ర­పంచ స్థా­యి క్రి­కె­ట­ర్లు తయా­ర­వు­తా­ర­ని ఆయన నమ్మ­కం వ్య­క్తం చే­శా­రు. బీ­హా­ర్ యు­వ­త­లో అపా­ర­మైన ప్ర­తిభ ఉం­ద­ని, వా­రి­కి సరైన వే­దిక దొ­రి­కి­తే అత్యు­త్తమ జట్టు­ను ని­ర్మిం­చ­డం సా­ధ్య­మ­వు­తుం­ద­ని పే­ర్కొ­న్నా­రు. ఈ ది­శ­గా తాను పూ­ర్తి­స్థా­యి­లో ఎలాం­టి షర­తు­లు లే­కుం­డా మద్ద­తు ఇవ్వ­డా­ని­కి సి­ద్ధం­గా ఉన్న­ట్లు ప్ర­క­టిం­చా­రు.

సో­ష­ల్ మీ­డి­యా­లో పె­ద్ద ఎత్తున చర్చ

అని­ల్ అగ­ర్వా­ల్ వ్యా­ఖ్య­ల­తో సో­ష­ల్ మీ­డి­యా­లో పె­ద్ద ఎత్తున చర్చ మొ­ద­లైం­ది. బీ­హా­ర్‌­కు ఒక కొ­త్త ఐపీ­ఎ­ల్ జట్టు వస్తే దాని బలం­పై ఇప్ప­టి­కే నె­టి­జ­న్లు ఊహా­గా­నా­లు మొ­ద­లు­పె­ట్టా­రు. ము­ఖ్యం­గా బీ­హా­ర్‌­కు చెం­దిన యువ ఆట­గా­ళ్లు జట్టు­లో చే­రి­తే ఆ ఫ్రాం­చై­జీ ఎంతో బలం­గా మా­రు­తుం­ద­ని అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. ప్ర­స్తు­తం భారత క్రి­కె­ట్‌­లో గు­ర్తిం­పు పొం­దు­తు­న్న ఆట­గా­ళ్ల­లో ఒక­రైన ఇషా­న్ కి­ష­న్ తో పాటు రి­కా­ర్డుల ద్వా­రా చర్చ­నీ­యాం­శం­గా మా­రిన వై­భ­వ్ సూ­ర్య­వం­సీ వంటి ఆట­గా­ళ్లు ఒకే జట్టు­లో ఉంటే అది ఐపీ­ఎ­ల్‌­లో అత్యంత ప్ర­మా­ద­కర జట్ల­లో ఒక­టి­గా మా­రు­తుం­ద­ని అభి­మా­ను­లు వి­శ్లే­షి­స్తు­న్నా­రు. ప్ర­త్యే­కం­గా ఈ ఇద్ద­రు ఎడ­మ­చే­తి బ్యా­ట­ర్లు ఓపె­నిం­గ్‌­లో బరి­లో­కి ది­గి­తే ప్ర­త్య­ర్థి జట్ల­కు పె­ద్ద సవా­ల్‌­గా మారే అవ­కా­శం ఉం­ద­ని సో­ష­ల్ మీ­డి­యా­లో అభి­ప్రా­యా­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి. ఇప్ప­టి­కే బల­మైన బౌ­లిం­గ్ వి­భా­గా­లు కలి­గిన ప్ర­ముఖ జట్ల­కు కూడా వారి దూ­కు­డు బ్యా­టిం­గ్ ఇబ్బం­ది­గా మా­ర­వ­చ్చ­ని కొం­ద­రు పే­ర్కొం­టు­న్నా­రు.

అయి­తే ఈ ప్ర­తి­పా­దన ఎంత ఆస­క్తి­క­రం­గా కని­పిం­చి­నా, ఆచ­ర­ణ­లో­కి తీ­సు­కు­రా­వ­డం అంత సు­ల­భం కా­ద­ని క్రీ­డా వి­శ్లే­ష­కు­లు చె­బు­తు­న్నా­రు. అని­ల్ అగ­ర్వా­ల్ వంటి బి­లి­య­నీ­ర్ ఆర్థిక మద్ద­తు ప్ర­క­టిం­చ­డం వల్ల పె­ట్టు­బ­డుల పరం­గా ఎలాం­టి ఇబ్బం­దు­లు ఉం­డ­క­పో­వ­చ్చు. బీ­హా­ర్‌­లో క్రి­కె­ట్‌­కు ఉన్న ఆదరణ కూడా ఈ ఆలో­చ­న­కు అను­కూ­లం­గా మా­ర­వ­చ్చు. కొ­త్త జట్టు ఏర్ప­డి­తే వ్యూ­య­ర్‌­షి­ప్, స్పా­న్స­ర్‌­షి­ప్, మా­ర్కె­ట్ పరం­గా కూడా భారీ అవ­కా­శా­లు లభిం­చే అవ­కా­శం ఉంది. స్థా­నిక ఆట­గా­ళ్లు జట్టు­లో ఉంటే అభి­మా­ను­ల్లో త్వ­ర­గా అను­బం­ధం ఏర్ప­డ­టం­తో పాటు జట్టు బ్రాం­డ్ వి­లువ కూడా వే­గం­గా పె­రి­గే అవ­కా­శం ఉం­టుం­ద­ని వి­శ్లే­ష­కు­లు భా­వి­స్తు­న్నా­రు. కానీ మరో­వై­పు కొ­న్ని కీలక పరి­మి­తు­లు కూడా ఉన్నా­యి. ఐపీ­ఎ­ల్ ని­బం­ధ­నల ప్ర­కా­రం ప్ర­స్తు­తం ఇతర ఫ్రాం­చై­జీ­ల­తో ఒప్పం­దా­లు ఉన్న ఆట­గా­ళ్ల­ను కొ­త్త జట్టు నే­రు­గా తీ­సు­కు­నే అవ­కా­శం ఉం­డ­దు. ఒక­వేళ ఆయా ఫ్రాం­చై­జీ­లు వా­రి­ని వి­డు­దల చే­స్తే మా­త్ర­మే వే­లం­లో పా­ల్గొ­ని భారీ మొ­త్తా­లు చె­ల్లిం­చి దక్కిం­చు­కో­వా­ల్సి ఉం­టుం­ది. మౌ­లిక వస­తు­లు. ఐపీ­ఎ­ల్ స్థా­యి మ్యా­చ్‌ల ని­ర్వ­హ­ణ­కు అం­త­ర్జా­తీయ ప్ర­మా­ణా­లు­న్న స్టే­డి­యా­లు, ఆధు­నిక శి­క్ష­ణా కేం­ద్రా­లు, ఆట­గా­ళ్ల­కు అవ­స­ర­మైన ప్ర­పంచ స్థా­యి సదు­పా­యా­లు తప్ప­ని­స­రి. బీ­హా­ర్‌­లో ఈ రం­గం­లో ఇంకా అభి­వృ­ద్ధి జర­గా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని అభి­ప్రా­యా­లు వి­ని­పి­స్తు­న్నా­యి. ప్ర­స్తు­తం ఐపీ­ఎ­ల్‌­లో మొ­త్తం 10 జట్లు ఉన్నా­యి. లీగ్ ని­ర్వ­హణ సమయం, మ్యా­చ్‌ల సం­ఖ్య వంటి అం­శా­ల­ను దృ­ష్టి­లో ఉం­చు­కు­ని త్వ­ర­లో­నే కొ­త్త జట్టు­ను చే­ర్చే ఆలో­చ­న­లు లే­వ­ని గతం­లో ఐపీ­ఎ­ల్ ఛై­ర్మ­న్ సూ­చ­న­ప్రా­యం­గా పే­ర్కొ­న్న­ట్లు సమా­చా­రం. 2028 నా­టి­కి మ్యా­చ్‌ల సం­ఖ్య­ను 74 నుం­చి 94కు పెం­చే అవ­కా­శం ఉన్న ప్ర­స్తు­తం ఉన్న జట్ల మధ్య హోమ్ అండ్ అవే ఫా­ర్మా­ట్‌­లో­నే జరి­గే అవ­కా­శం ఉంది.

సో­ష­ల్ మీ­డి­యా­లో పె­ద్ద ఎత్తున చర్చ

సో­ష­ల్ మీ­డి­యా­లో పె­ద్ద ఎత్తున చర్చ

సో­ష­ల్ మీ­డి­యా­లో పె­ద్ద ఎత్తున చర్చ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu