Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL: గుజరాత్ జైత్రయాత్రకు కోల్‌కతా బ్రేక్

IPL: గుజరాత్ జైత్రయాత్రకు కోల్‌కతా బ్రేక్

TV5 News 6 days ago

By - Sathwik |17 May 2026 8:15 AM IST

గుజరాత్‌ కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్రేకు.. ఈడెన్‌ గార్డెన్స్‌లో పరుగుల వరద.. 247 పరుగులు చేసిన కోల్‌కతా

ఈడె­న్ గా­ర్డె­న్స్ వే­ది­క­గా జరి­గిన హై­స్కో­రిం­గ్ పో­రు­లో మరో­సా­రి ఐపీ­ఎ­ల్ ఉత్కం­ఠ­భ­రిత మలు­పు తీ­సు­కుం­ది. ప్లే­ఆ­ఫ్స్ రే­సు­లో ని­ల­వా­లం­టే తప్ప­ని­స­రి­గా గె­ల­వా­ల్సిన పరి­స్థి­తి­లో బరి­లో­కి ది­గిన కో­ల్‌­క­తా నై­ట్‌­రై­డ­ర్స్ అసా­ధా­రణ బ్యా­టిం­గ్ ప్ర­ద­ర్శ­న­తో గు­జ­రా­త్ టై­టా­న్స్‌­కు గట్టి షాక్ ఇచ్చిం­ది. వరుస వి­జ­యా­ల­తో ఆత్మ­వి­శ్వా­సం­గా కని­పిం­చిన గు­జ­రా­త్‌­ను 29 పరు­గుల తే­డా­తో ఓడిం­చి కే­కే­ఆ­ర్ తన అవ­కా­శా­ల­ను ఇంకా సజీ­వం­గా ఉం­చు­కుం­ది. ఈ వి­జ­యం­తో కో­ల్‌­క­తా అభి­మా­ను­ల్లో కొ­త్త ఆశలు చి­గు­రిం­చ­గా, ప్లే­ఆ­ఫ్స్‌­కు తొలి జట్టు­గా అర్హత సా­ధిం­చా­ల­ని భా­విం­చిన గు­జ­రా­త్‌­కు మా­త్రం ఎదు­రు­దె­బ్బ తగి­లిం­ది. టాస్ కో­ల్పో­యి ముం­దు­గా బ్యా­టిం­గ్ చే­సిన కో­ల్‌­క­తా ఆరం­భం నుం­చే దూ­కు­డు­ను ప్ర­ద­ర్శిం­చిం­ది. ఫిన్ అలె­న్ మొ­ద­టి నుం­చే బౌ­ల­ర్ల­పై ఎదు­రు­దా­డి­కి ది­గా­డు. కె­ప్టె­న్ అజిం­క్య రహా­నే మరో­సా­రి ఆశిం­చిన స్థా­యి­లో ఆడ­లేక త్వ­ర­గా వె­ను­ది­రి­గి­నా, అది జట్టు­పై ఎలాం­టి ప్ర­భా­వం చూ­ప­లే­దు. మూడో స్థా­నం­లో వచ్చిన ఆం­గ్‌­క్రి­ష్ రఘు­వం­శీ అలె­న్‌­కు అద్భు­త­మైన సహ­కా­రం అం­దిం­చా­డు. సా­ధా­ర­ణం­గా కా­స్త నె­మ్మ­ది­గా ఆడే రఘు­వం­శీ ఈసా­రి పూ­ర్తి­గా దూ­కు­డు ప్ర­ద­ర్శిం­చి భారీ షా­ట్ల­తో అల­రిం­చా­డు.

గుజరాత్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా అలెన్‌ను నియంత్రించలేకపోయారు. ముఖ్యంగా అతనికి లభించిన ఒక కీలక జీవనదానం మ్యాచ్ దిశనే మార్చేసింది. అప్పటికే మంచి టచ్‌లో ఉన్న అలెన్ ఆ అవకాశం దక్కిన తర్వాత మరింత ప్రమాదకరంగా మారాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా భారీ షాట్లు బాదుతూ పరుగుల వర్షం కురిపించాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన అతను ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. అతని 93 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ జట్టుకు భారీ పునాది వేసింది.

అలె­న్ అవు­టైన తర్వాత కూడా కో­ల్‌­క­తా దూ­కు­డు ఏమా­త్రం తగ్గ­లే­దు. రఘు­వం­శీ మరింత దూ­కు­డు­గా మారి సి­క్స­ర్ల వర్షం కు­రి­పిం­చా­డు. మరో­వై­పు కా­మె­రూ­న్ గ్రీ­న్ కూడా మొ­ద­టి నుం­చే వే­గం­గా ఆడు­తూ గు­జ­రా­త్ బౌ­లిం­గ్‌­ను ఒత్తి­డి­లో­కి నె­ట్టా­డు. ఇద్ద­రూ కలి­సి మూడో వి­కె­ట్‌­కు భారీ భా­గ­స్వా­మ్యా­న్ని నె­ల­కొ­ల్పి స్కో­రు­ను మరింత ఎత్తు­కు తీ­సు­కె­ళ్లా­రు. చి­వ­రి ఓవ­ర్ల­లో ఇద్ద­రూ భారీ షా­ట్ల­తో వి­జృం­భిం­చ­డం­తో కో­ల్‌­క­తా ని­ర్ణీత 20 ఓవ­ర్ల­లో రెం­డు వి­కె­ట్ల నష్టా­ని­కి 247 పరు­గుల భారీ స్కో­రు నమో­దు చే­సిం­ది. భారీ లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన గు­జ­రా­త్ టై­టా­న్స్ ఆరం­భం­లో­నే ఒక చి­న్న ఇబ్బం­ది­ని ఎదు­ర్కొం­ది. సాయి సు­ద­ర్శ­న్ మంచి షా­ట్ల­తో జట్టు­కు ఊపు తీ­సు­కు­వ­స్తు­న్న సమ­యం­లో గా­యం­తో రి­టై­ర్డ్ హర్ట్‌­గా వె­ను­ది­ర­గా­ల్సి వచ్చిం­ది. ని­శాం­త్ సిం­ధు త్వ­ర­గా అవు­ట­వ­డం­తో గు­జ­రా­త్‌­పై ఒత్తి­డి పె­రి­గిం­ది. కె­ప్టె­న్గిల్ క్రీ­జు­లో ని­ల­బ­డి ఇన్నిం­గ్స్‌­ను చక్క­ది­ద్దే ప్ర­య­త్నం చే­శా­డు. మరో ఎం­డ్‌­లో జోస్ బట్ల­ర్ కూడా అత­ని­కి అం­డ­గా ని­లి­చా­డు. మొదట కా­స్త నె­మ్మ­ది­గా ఆడిన గిల్ ఆ తర్వాత వేగం పెం­చి భారీ షా­ట్లు బా­ద­డం ప్రా­రం­భిం­చా­డు. ము­ఖ్యం­గా నరై­న్, అను­కు­ల్ బౌ­లిం­గ్‌­ల­పై అతను సి­క్స­ర్ల­తో వి­రు­చు­కు­ప­డ్డా­డు. బట్ల­ర్ కూడా క్ర­మం­గా గేర్ మా­ర్చి పరు­గుల వే­గా­న్ని పెం­చా­డు. ఇద్ద­రూ కలి­సి గు­జ­రా­త్‌­ను మళ్లీ పో­టీ­లో­కి తీ­సు­కొ­చ్చా­రు. 16 ఓవ­ర్ల ము­గి­సే సమ­యా­ని­కి గు­జ­రా­త్ వి­జ­యం వైపు అడు­గు­లు వే­స్తు­న్న­ట్లు కని­పిం­చిం­ది. కానీ మ్యా­చ్ కీలక దశలో సు­నీ­ల్ నరై­న్ తన అను­భ­వా­న్ని చూ­పిం­చా­డు. ప్ర­మా­ద­క­రం­గా మా­రిన గి­ల్‌­ను అవు­ట్ చే­య­డం­తో పాటు అత్యంత కీలక ఓవ­ర్లో పరు­గు­ల­ను ని­యం­త్రిం­చా­డు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu