Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL:కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

IPL:కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

TV5 News 3 days ago

By - Sathwik |21 May 2026 8:00 AM IST

ముంబైపై కోల్‌కతా కీలక విజయం... 147 పరుగులే చేసిన ముంబై ఇండియన్స్... 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన కోల్‌కతా

కో­ల్‌­క­తా నై­ట్‌­రై­డ­ర్స్‌ మరో­సా­రి కీలక సమ­యం­లో తమ పో­రాట పటి­మ­ను చూ­పిం­చిం­ది. ప్లే­ఆ­ఫ్స్‌ అవ­కా­శా­లు ని­ల­బె­ట్టు­కో­వా­లం­టే తప్పక గె­ల­వా­ల్సిన మ్యా­చ్‌­లో జట్టు సమి­ష్టి­గా రా­ణిం­చి ముం­బ­యి ఇం­డి­య­న్స్‌­పై వి­లు­వైన వి­జ­యా­న్ని నమో­దు చే­సిం­ది. బౌ­ల­ర్లు మొదట ప్ర­త్య­ర్థి­ని కట్ట­డి చేసి పట్టు సా­ధిం­చ­గా, ఆ తర్వాత బ్యా­ట­ర్లు ఒత్తి­డి­ని అధి­గ­మి­స్తూ లక్ష్యా­న్ని చే­రు­కో­వ­డం­తో కో­ల్‌­క­తా శి­బి­రం­లో ఉత్సా­హం నె­ల­కొం­ది. చి­వ­రి వరకు ఆస­క్తి­క­రం­గా సా­గిన ఈ పో­రు­లో కే­కే­ఆ­ర్‌ నా­లు­గు వి­కె­ట్ల తే­డా­తో వి­జ­యం సా­ధిం­చి టో­ర్నీ­లో తన అవ­కా­శా­ల­ను కొ­న­సా­గిం­చు­కుం­ది. ముం­దు­గా బ్యా­టిం­గ్‌­కు ది­గిన ముం­బ­యి ఇం­డి­య­న్స్‌ ఆరం­భం నుం­చే ఇబ్బం­దు­ల్లో పడిం­ది. కో­ల్‌­క­తా బౌ­ల­ర్లు కచ్చి­త­మైన లై­న్‌, లెం­గ్త్‌­తో బం­తు­లు వే­య­డం­తో పరు­గు­లు సా­ధిం­చ­డం ముం­బ­యి బ్యా­ట­ర్ల­కు కష్టం­గా మా­రిం­ది. మూడో ఓవ­ర్లో­నే తొలి దె­బ్బ తగి­లిం­ది. రి­కె­ల్ట­న్‌­ను పె­వి­లి­య­న్‌­కు పం­పిన గ్రీ­న్‌ అదే ఓవ­ర్లో నమ­న్‌ ధీ­ర్‌­ను కూడా వె­న­క్కి పం­ప­డం­తో ముం­బ­యి ఒత్తి­డి­లో­కి వె­ళ్లిం­ది.

ఆ దశలో సౌ­ర­భ్‌ దూబె మరింత చె­ల­రే­గా­డు. రో­హి­త్‌ శర్మ­ను ఔట్‌ చే­సిన అతడు, కొ­ద్ది­సే­ప­టి­కే సూ­ర్య­కు­మా­ర్‌ యా­ద­వ్‌­ను కూడా బౌ­ల్డ్‌ చే­శా­డు. దీం­తో నా­లు­గు వి­కె­ట్లు త్వ­ర­గా కో­ల్పో­యిన ముం­బ­యి తీ­వ్ర సం­క్షో­భం­లో పడిం­ది. బ్యా­టిం­గ్‌ వి­భా­గం­లో పె­ద్ద­గా ని­ల­దొ­క్కు­కు­నే అవ­కా­శం లే­కుం­డా కో­ల్‌­క­తా బౌ­ల­ర్లు వరుస ఒత్తి­డి తీ­సు­కొ­చ్చా­రు. ప్ర­తి ఓవ­ర్‌­లో­నూ వి­కె­ట్ల ము­ప్పు కని­పిం­చ­డం­తో ముం­బ­యి పరు­గుల రేటు పూ­ర్తి­గా పడి­పో­యిం­ది. అలాం­టి పరి­స్థి­తు­ల్లో హా­ర్ది­క్‌ పాం­డ్యా, తి­ల­క్‌ వర్మ ఇన్నిం­గ్స్‌­ను చక్క­ది­ద్దే ప్ర­య­త్నం చే­శా­రు. ఇద్ద­రూ జా­గ్ర­త్త­గా ఆడు­తూ వి­కె­ట్లు కా­పా­డు­కు­నే ప్ర­య­త్నం చే­సి­న­ప్ప­టి­కీ వే­గం­గా పరు­గు­లు సా­ధిం­చ­డం­లో మా­త్రం వి­ఫ­ల­మ­య్యా­రు. మధ్య ఓవ­ర్ల­లో కో­ల్‌­క­తా బౌ­ల­ర్లు అద్భుత ని­యం­త్రణ ప్ర­ద­ర్శిం­చా­రు. ము­ఖ్యం­గా నరై­న్‌ తన స్పి­న్‌­తో ప్ర­త్య­ర్థి­ని తీ­వ్రం­గా ఇబ్బం­ది పె­ట్టా­డు. అతడు కే­వ­లం ఒక వి­కె­ట్‌ మా­త్ర­మే తీ­సు­కు­న్న­ప్ప­టి­కీ అతని బౌ­లిం­గ్‌ మ్యా­చ్‌­పై గట్టి ప్ర­భా­వం చూ­పిం­చిం­ది. వరుస డా­ట్‌­బా­ల్స్‌­తో ముం­బ­యి బ్యా­ట­ర్ల­ను కట్ట­డి చే­శా­డు. ఇన్నింగ్స్‌ చివర్లో మాత్రం ముంబయికి కొంత ఊరటనిచ్చే ప్రదర్శన కనిపించింది. కార్బిన్‌ బోష్‌ దూకుడుగా ఆడి స్కోరును గౌరవప్రద స్థాయికి తీసుకెళ్లాడు. చివరి ఓవర్లలో అతడు బౌండరీలు, భారీ సిక్సర్లతో చెలరేగడంతో ముంబయి స్కోరు ఒక్కసారిగా పెరిగింది. ఒక దశలో తక్కువ స్కోరు వద్దే ఆగిపోతుందని అనిపించినా, చివరి రెండు ఓవర్లలో వచ్చిన పరుగులతో జట్టు 147 పరుగుల వరకు చేరుకుంది.

148 పరు­గుల లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన కో­ల్‌­క­తా­కు కూడా ఆరం­భం­లో ఎదు­రు­దె­బ్బ తగి­లిం­ది. తొలి ఓవ­ర్లో­నే ఫి­న్‌ అలె­న్‌ వి­కె­ట్‌­ను కో­ల్పో­యిం­ది. అయి­న­ప్ప­టి­కీ రహా­నే, మనీ­ష్‌ పాం­డే జట్టు­ను ఆదు­కు­నే ప్ర­య­త్నం చే­శా­రు. మొ­ద­ట్లో కొంత నె­మ్మ­ది­గా సా­గిన ఇన్నిం­గ్స్‌­లో వీ­రి­ద్ద­రూ క్ర­మం­గా లయ అం­దు­కు­న్నా­రు. రహా­నే కొ­న్ని ఆక­ర్ష­ణీ­య­మైన షా­ట్లు ఆడు­తూ జట్టు­ను ముం­దు­కు నడి­పిం­చా­డు. అయి­తే వి­జ­యం ఖా­య­మైం­ద­ను­కు­నే సమ­యం­లో ఇద్ద­రూ తక్కువ వ్య­వ­ధి­లో ఔట్‌ కా­వ­డం­తో మ్యా­చ్‌­లో మళ్లీ ఉత్కంఠ నె­ల­కొం­ది. చి­వ­రి దశలో రిం­కూ సిం­గ్‌, తే­జ­స్వి దహి­యా పరు­గుల కోసం కష్ట­ప­డా­ల్సి వచ్చిం­ది. ఒత్తి­డి పె­రి­గి­నా రిం­కూ చి­వ­రి­వ­ర­కు ని­ల­బ­డి జట్టు­ను విజయ తీ­రా­ల­కు చే­ర్చా­డు. ఈ విజయంతో కోల్‌కతా తన ప్లేఆఫ్స్‌ ఆశలను కొనసాగించుకుంది. మంచి ప్రదర్శన చేస్తూ కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu