Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
JAGAN: తీరు మారని జగన్-మళ్లీ అదే నోటి దురుసు

JAGAN: తీరు మారని జగన్-మళ్లీ అదే నోటి దురుసు

TV5 News 3 days ago

By - Sathwik |22 May 2026 10:00 AM IST

మావిగన్ అంటే చంద్రబాబు గుండె ఆగిపోతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరు మారడం లేదు.

ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పినా జగన్ తీరు మాత్రం మారడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబే లక్ష్యంగా జగన్ మరోసారి విషం చిమ్మారు. తాను సుద్దపూసని అన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయని గుండెలు బాదుకున్నారు. తమిళనాడు సీఎం విజయ్ గెలుపులో అసలు తన ప్రమేయమే లేదని వైసీపీ శ్రేణులకు గట్టి షాకే ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ విజయంలో తన పాత్ర ఉందన్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. విజయ్ సాధించిన విజయానికి కారణం ఆయన వ్యక్తిగతంగా సంపాదించుకున్న ప్రజాదరణ, అక్కడి ప్రజల మద్దతు, అలాగే ఆయన చేసిన కృషేనని స్పష్టం చేశారు. తన ఫొటోతో ప్రచారం జరగడం వల్లే విజయ్ గెలిచారని వస్తున్న ప్రచారంపై నవ్వుతూ స్పందించిన జగన్, తమిళనాడులో విజయ్‌కే ఎక్కువ ప్రజాబలం ఉందని, అందులో తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. జగన్ వ్యాఖ్యలతో తమ వల్లే జగన్ గెలిచాడని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ నేతలకు దిమ్మతిరిగిపోయింది. మావిగన్ అంటే చంద్రబాబు గుండెఆగి చనిపోతారంటూ జగన్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

జగన్‌కు ఇంకా సిగ్గు రాలేదు: మంత్రి కొల్లు

వైసీపీకి 11 సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపినా ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు మాత్రం ఇంకా సిగ్గు రాలేదని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. 'కూటమి ప్రభుత్వం 24 నెలల్లో వంద శాతం అభివృద్ధి, సంక్షేమం అమలు చేసింది. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హమీలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందాం. ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి వైఎస్‌ జగన్‌ ఓర్చుకోలేకనే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. విశ్వనీయత గురించి జగన్‌ రెడ్డి మాట్లాడటం హస్యాస్పదంగా ఉంది. అమరావతిని నాశనం చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను ఐదేళ్ల కాలంలో వైఎస్‌ జగన్‌ నిర్వీర్యం చేశాడు. అభివృద్ధి గురించి ఆయన మాట్లాడటం సిగ్గుచేటు' అని మంత్రి కొల్లు మండిపడ్డారు.

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరు మారడం లేదు. ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పినా జగన్ తీరు మాత్రం మారడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబే లక్ష్యంగా జగన్ మరోసారి విషం చిమ్మారు. తాను సుద్దపూసని అన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయని గుండెలు బాదుకున్నారు. తమిళనాడు సీఎం విజయ్ గెలుపులో అసలు తన ప్రమేయమే లేదని వైసీపీ శ్రేణులకు గట్టి షాకే ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ విజయంలో తన పాత్ర ఉందన్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. విజయ్ సాధించిన విజయానికి కారణం ఆయన వ్యక్తిగతంగా సంపాదించుకున్న ప్రజాదరణ, అక్కడి ప్రజల మద్దతు, అలాగే ఆయన చేసిన కృషేనని స్పష్టం చేశారు. తన ఫొటోతో ప్రచారం జరగడం వల్లే విజయ్ గెలిచారని వస్తున్న ప్రచారంపై నవ్వుతూ స్పందించిన జగన్, తమిళనాడులో విజయ్‌కే ఎక్కువ ప్రజాబలం ఉందని, అందులో తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. జగన్ వ్యాఖ్యలతో తమ వల్లే జగన్ గెలిచాడని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ నేతలకు దిమ్మతిరిగిపోయింది. మావిగన్ అంటే చంద్రబాబు గుండెఆగి చనిపోతారంటూ జగన్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

జగన్‌కు ఇంకా సిగ్గు రాలేదు: మంత్రి కొల్లు

జగన్‌కు ఇంకా సిగ్గు రాలేదు: మంత్రి కొల్లు

జగన్‌కు ఇంకా సిగ్గు రాలేదు: మంత్రి కొల్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu