Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూటమి హయాంలో మారుతున్న రాయలసీమ ముఖచిత్రం..

కూటమి హయాంలో మారుతున్న రాయలసీమ ముఖచిత్రం..

TV5 News 3 days ago

By - Radhisha |21 May 2026 10:35 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల విస్తరణ, యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గతంలో కేవలం ప్రకటనలకే పరిమితమైన పెట్టుబడులు ఇప్పుడు భూమిపై కార్యరూపం దాలుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పరిశ్రమలను విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రాయలసీమ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రంగానికి కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా కడప జిల్లా పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో వేగంగా ఎదుగుతున్న ప్రముఖ సంస్థ ఎస్‌ఏఈఎల్ (SAEL) ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. కడప జిల్లాలో దాదాపు రూ.2,400 కోట్ల పెట్టుబడితో ఆధునిక సోలార్ ప్లాంట్లను నిర్మించింది. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మాత్రమే కాకుండా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలను కూడా తీసుకురానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనుండటం రాష్ట్రానికి మరో కీలక ఘట్టంగా భావిస్తున్నారు. టెక్నాలజీ, పరిశ్రమలు, భవిష్యత్ ఇంధన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇవి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

గతంలో రాయలసీమ అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఫ్యాక్షన్ రాజకీయాలు, వెనుకబడిన ప్రాంతం, వలసలు మాత్రమే. కానీ ఇప్పుడు అదే ప్రాంతం పెట్టుబడిదారులను ఆకర్షించే కేంద్రంగా మారుతోంది. మంచి రోడ్లు, పారిశ్రామిక మౌలిక వసతులు, విద్యుత్ సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కారణంగా పెద్ద పెద్ద కంపెనీలు రాయలసీమ వైపు చూస్తున్నాయి.ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సహజ వనరులు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. విస్తారమైన భూములు, ఎక్కువ సూర్యకాంతి లభ్యత కారణంగా సోలార్ ప్రాజెక్టులకు రాయలసీమ అత్యుత్తమ ప్రాంతంగా మారుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల విస్తరణ, యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గతంలో కేవలం ప్రకటనలకే పరిమితమైన పెట్టుబడులు ఇప్పుడు భూమిపై కార్యరూపం దాలుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పరిశ్రమలను విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రాయలసీమ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రంగానికి కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా కడప జిల్లా పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu