Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Lokesh Kanagaraj :  వామ్మో.. ఈ ఊరమాస్ ఏంటీ లోకేష్ కనకరాజ్

Lokesh Kanagaraj : వామ్మో.. ఈ ఊరమాస్ ఏంటీ లోకేష్ కనకరాజ్

TV5 News 1 week ago

By - TV5 Entertainment |16 May 2026 12:12 PM IST

ఇప్పటి వరకు మాస్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్ ఉన్నవాడు లోకేష్ కనకరాజ్. అతని కథల్లో మాగ్జిమం డ్రగ్స్ చుట్టూనే తిరుగుతాయి.

ఆ కథల్లో ఉన్న కొత్తదనం వల్ల బాగా విజయాలు కూడా సాధించాయి. అయితే లియోతో కాస్త ఇబ్బంది పడ్డాడు. కూలీతో బోల్తా పడ్డాడు. అయినా తగ్గేదే లే అంటూ తర్వాత అల్లు అర్జున్ తో మూవీకి సిద్ధం అవుతున్నాడు. దీనికంటే ముందు అతను హీరోగా మారాడు. కొన్నాళ్ల క్రితం శ్రుతి హాసన్ తో ఓ పాటలో కనిపించాడు. ఈ సారి ఏకంగా హీరో అయిపోయాడు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూడగానే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది అంటే అతిశయోక్తి కాదు. లోకేష్ హీరోగా అదరగొట్టాడు అనిపించాడు.

ఇందులో లోకేష్ దేవదాస్ పాత్రలో కనిపిస్తున్నాడు. హీరోయిన్ వామికా గబ్బి చంద్ర పాత్రలో కనిపిస్తోంది. అందుకే ఈ చిత్రానికి 'డి.సి'అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఉంది. ఆ గ్యాంగ్ స్టర్ కు తోడుగా ఓ ప్రాస్టిట్యూట్ కూడా ఉంది. ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా మొదలైంది.. ఆ రిలేషన్ ఎలా కంటిన్యూ అవుతుంది అనే పాయింట్ తో పాటుగా.. గ్యాంగ్ వార్ లో విపరీతమైన వయొలెన్స్ తో కూడిన డ్రామాగా కూడా ఉంది. సింపుల్ పాయింట్ లానే అనిపించినా కథనంగా మాత్రం మరో స్థాయిలో ఉండబోతోంది అనిపించేలా ఉంది. ఈ పాత్రలో లోకేష్ పెద్దగా కష్టపడ్డట్టుగా కూడా కనిపించలేదు. ట్రైలర్ ఆరంభంలోనే లాంగ్ వైడ్ షాట్ లో వచ్చిన సీన్ సూపర్బ్. ఈ మధ్య కాలంలో వయొలెన్స్ మరీ శృతిమించి కనిపించడం కామన్ అయింది. ఆ కామన్ పాయింట్ లోనే మరోసారి తనదైన శైలిలో చూపించబోతున్నాడు అరుణ్ మాతేశ్వరన్ అనిపించాడు.

ఇక ఈ మూవీకి మెయిన్ హైలెట్ గా అనిరుధ్ రవిచందర్ సంగీతం ఉండబోతోంది అని ట్రైలర్ తోనే తెలిసిపోతుంది. ఈ ట్రైలర్ కి అతనిచ్చిన స్కోర్ మాత్రం సింప్లీ సూపర్బ్ అనుకోవచ్చు. ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. మొత్తంగా సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోందీ మూవీని. లోకేష్ కనకరాజ్ కు జోడీగా వామికా గబ్బి నటించింది. తన పాత్ర కూడా అదిరిపోతుంది అనిపించింది. ట్రైలర్ లో తను కూడా ఓ రేంజ్ లో మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తోంది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఓ డైరెక్టర్ హీరోగా నటించిన మూవీలా లేదు ఇది. ఓ మాస్ హీరో నుంచి వస్తోన్న ఊరమాస్ మూవీలాగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఇప్పటి వరకు మాస్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్ ఉన్నవాడు లోకేష్ కనకరాజ్. అతని కథల్లో మాగ్జిమం డ్రగ్స్ చుట్టూనే తిరుగుతాయి. ఆ కథల్లో ఉన్న కొత్తదనం వల్ల బాగా విజయాలు కూడా సాధించాయి. అయితే లియోతో కాస్త ఇబ్బంది పడ్డాడు. కూలీతో బోల్తా పడ్డాడు. అయినా తగ్గేదే లే అంటూ తర్వాత అల్లు అర్జున్ తో మూవీకి సిద్ధం అవుతున్నాడు. దీనికంటే ముందు అతను హీరోగా మారాడు. కొన్నాళ్ల క్రితం శ్రుతి హాసన్ తో ఓ పాటలో కనిపించాడు. ఈ సారి ఏకంగా హీరో అయిపోయాడు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూడగానే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది అంటే అతిశయోక్తి కాదు. లోకేష్ హీరోగా అదరగొట్టాడు అనిపించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu