By - Sathwik |19 May 2026 3:00 PM IST
స్పష్టం చేసిన హీరో మంచు మనోజ్
ప్రజా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో కొత్త అడుగులు వేస్తున్న నటుడు మంచు మనోజ్ తాజాగా తన భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టత ఇచ్చారు.
తన సేవా కార్యక్రమాలను వ్యవస్థీకృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రారంభించిన 'ఐక్య' సంస్థపై వస్తున్న పలు సందేహాలకు ఆయన సమాధానం చెప్పారు. అదే సమయంలో తన కుటుంబ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఆసక్తికర అంశాలను కూడా వెల్లడించారు. మే 20న జరుపుకోనున్న తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్, 'ఐక్య' సంస్థను రాజకీయ వేదికగా భావించవద్దని స్పష్టం చేశారు. ఈ సంస్థ పూర్తిగా ప్రజలకు అండగా నిలవడం, వారి సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరించడానికేనని ఆయన వివరించారు. రాజకీయాలతో ఈ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, దీన్ని పూర్తిగా ప్రజల గొంతుకగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
అయితే వ్యక్తిగత రాజకీయ ప్రయాణంపై మాట్లాడుతూ, తన భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాము రాజకీయ వ్యవస్థలో భాగంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అయితే 'ఐక్య' కార్యకలాపాలకు రాజకీయ మద్దతు లేదా ఇతర వనరులు కాకుండా, పూర్తిగా తమ సొంత నిధులనే వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, తన తండ్రితో ఉన్న విభేదాలపై మీడియా ప్రశ్నించగా మనోజ్ సరదాగా స్పందించారు. 'ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీకు తెలుసు. అయితే మైక్ తీసుకుని వెళ్లేటప్పుడు హెల్మెట్ మాత్రం పెట్టుకోవడం మర్చిపోవద్దు' అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యతో అక్కడున్న వారిలో నవ్వులు పూశాయి. ఇటీవలి కాలంలో మనోజ్ చేపడుతున్న కార్యక్రమాలు, సామాజిక అంశాలపై చూపుతున్న చురుకుదనం, అలాగే కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రజా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలనే లక్ష్యంతో కొత్త అడుగులు వేస్తున్న నటుడు మంచు మనోజ్ తాజాగా తన భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టత ఇచ్చారు. తన సేవా కార్యక్రమాలను వ్యవస్థీకృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రారంభించిన 'ఐక్య' సంస్థపై వస్తున్న పలు సందేహాలకు ఆయన సమాధానం చెప్పారు. అదే సమయంలో తన కుటుంబ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఆసక్తికర అంశాలను కూడా వెల్లడించారు. మే 20న జరుపుకోనున్న తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్, 'ఐక్య' సంస్థను రాజకీయ వేదికగా భావించవద్దని స్పష్టం చేశారు. ఈ సంస్థ పూర్తిగా ప్రజలకు అండగా నిలవడం, వారి సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తరించడానికేనని ఆయన వివరించారు. రాజకీయాలతో ఈ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, దీన్ని పూర్తిగా ప్రజల గొంతుకగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

