Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mareechika Trailer :  ఇంతకీ ఈ మరీచిక ఎవరు..?

Mareechika Trailer : ఇంతకీ ఈ మరీచిక ఎవరు..?

TV5 News 1 week ago

By - TV5 Entertainment |16 May 2026 12:56 PM IST

మరీచిక.. ఈ టైటిల్ తో ఓ మూవీ రాబోతోంది. అదీ తెలుగులో. ఈ నెల 29న విడుదల కాబోతోంది. అందులో విశేషం ఏముందీ అనుకుంటున్నారా..?

ఉంది. అందులో విశేషం ఉంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ తో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా ఫీమేల్ లీడ్ లో నటించారు. విరాజ్ అశ్విన్ హీరోగా నటించాడు. ఈ ట్రైలర్ సాధారణంగా మొదలవుతుంది. ట్రైలర్ తోనే టెంపో పెరుగుతుందీ అనే సస్పెన్స్ లు క్రియేట్ చేసింది. ఈ తరహా కథలు తెలుగులో అత్యంత అరుదగా ఉంటాయి అనిపించేలా ఉంది.

చంపేసింది సార్.. మా సంజును చంపేసింది సార్ అనే డైలాగ్ అండ్ సీన్ తో స్టార్ట్ అవుతుంది ట్రైలర్. కట్ చేస్తే ఇందులో అనుపమ ఓ ముద్దపప్పు లాంటి అమ్మాయిలా ఉంది. ఆమెకు హీరో అంటే ప్రేమ. చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ లోగా ఆమె పోలీస్ లకు కంప్లైంట్ ఇస్తుంది. మా సంజును మరీచిక చంపేసింది సార్ అంటుంది. ఆ మరీచిక ఎవరు అని పోలీస్ అడుగుతాడు. కట్ చేస్తే ఆ మరీచిక యూఎస్ నుంచి వస్తుంది. ఆమెకు సంజు అంటే ఇష్టం. ఈ ఇద్దరి మధ్య ఓ రిలేషన్ సాగుతుంది. మళ్లీ ఆ రిలేషన్ ఆగిపోతుంది. ఇటు చూస్తే అనుపమ గెటప్ మారిపోతుంది. ఆమె కూడా సంజు కోసం తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అటు చూస్తే మరీచిక వైల్డ్ గా మారిపోతుంది. మరీచిక సంజును చంపేస్తుంది అనుకునే టైమ్ లో మరో ట్విస్ట్. మామూలుగా ఇన్ని ట్విస్ట్ లతో అంటే మామూలుగా ఉండదు మూవీ. కాకపోతే ఆ ట్విస్ట్ లన్నీ కరెక్ట్ గా సెట్ అవుతే సినిమా విజయం సాధిస్తుంది. బట్ ఈ ట్రైలర్ మాత్రం చాలా చాలా ప్రామిసింగ్ గా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

ఇక ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం మాత్రం చాలా పెద్ద విశేషం అనే చెప్పాలి. సతీష్ కాశెట్టి డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కథ, పాటలు, మాటలు లక్ష్మీ భూపాల అందించాడు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన మూవీ ఇది. మరి ఈ నెల 29న విడుదల కాబోతోన్న ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

మరీచిక.. ఈ టైటిల్ తో ఓ మూవీ రాబోతోంది. అదీ తెలుగులో. ఈ నెల 29న విడుదల కాబోతోంది. అందులో విశేషం ఏముందీ అనుకుంటున్నారా..? ఉంది. అందులో విశేషం ఉంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ తో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా ఫీమేల్ లీడ్ లో నటించారు. విరాజ్ అశ్విన్ హీరోగా నటించాడు. ఈ ట్రైలర్ సాధారణంగా మొదలవుతుంది. ట్రైలర్ తోనే టెంపో పెరుగుతుందీ అనే సస్పెన్స్ లు క్రియేట్ చేసింది. ఈ తరహా కథలు తెలుగులో అత్యంత అరుదగా ఉంటాయి అనిపించేలా ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu