By - Sathwik |19 May 2026 8:30 PM IST
మీర్జాపుర్ జిమ్‌లలో మత మార్పిడి నెట్‌వర్క్ బట్టబయలు
నాసిక్‌లోని ఓ బహుళజాతి కంపెనీలో చోటుచేసుకున్న బలవంతపు మత మార్పిళ్లు, లైంగిక వేధింపుల ఉదంతం మరువక ముందే..
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో భారీ మత మార్పిడి ముఠా గుట్టురట్టయింది. మీర్జాపుర్ కేంద్రంగా జిమ్‌లలో చేరే హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను పోలీసులు తాజాగా బట్టబయలు చేశారు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
వెలుగులోకి తెచ్చిన బాధితురాలి ఫిర్యాదు
మీర్జాపుర్‌లోని ఒక స్థానిక జిమ్‌కు వెళ్తున్న ఓ యువతిపై, ఆ జిమ్ యజమాని మతం మారాలంటూ గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాడు. మానసికంగా వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేకపోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టగా, ఇది కేవలం ఒక్క జిమ్‌కు లేదా ఒక వ్యక్తికి పరిమితమైన అంశం కాదని.. దీని వెనుక ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్ పనిచేస్తోందని తేలింది.
ముఠా ఆపరేషన్ సాగిందిలా.. 'సన్నో' ప్రధాన సూత్రధారి!
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ మత మార్పిడి ముఠా రాష్ట్రంలోని వివిధ జిమ్‌లు, సోషల్‌మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వేదికగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ కేసులో 'సన్నో' అనే మహిళ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈమె ముందుగా టార్గెట్ చేసిన జిమ్‌లలో సభ్యురాలిగా చేరుతుంది. అక్కడకు వచ్చే యువతులు, మహిళలతో అత్యంత ఆప్యాయంగా ఉంటూ నమ్మకం సంపాదిస్తుంది. ఆ తర్వాత తన స్నేహితులంటూ కొంతమంది ముస్లిం యువకులను వారికి పరిచయం చేస్తుంది. ఆపై సదరు యువకులు సదరు మహిళలను ప్రేమ, పెళ్లి పేరుతో బుట్టలో వేసుకుని మతం మారాలంటూ ఒత్తిడి తీసుకువస్తారు. సోషల్ మీడియా బ్రెయిన్ వాషింగ్: జిమ్‌లతో పాటు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ఈ ముఠా వల విసురుతోంది. మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి, వారితో నిరంతరం చాటింగ్ చేస్తూ, నెమ్మదిగా వారిలో మతమార్పిడి ఆలోచనలు కలిగేలా తీవ్రంగా 'బ్రెయిన్ వాష్' చేస్తున్నట్లు విచారణలో తేలింది. దాదాపు 50 మందికి పైగా హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు గట్టిగా అనుమానిస్తున్నారు.
ఫోన్లలో వందలాది చాట్లు, వీడియోలు లభ్యం
అరెస్టయిన నిందితుల నుంచి పోలీసులు పలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని విశ్లేషించగా పోలీసులు సైతం విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వందలాది మంది స్థానిక మహిళల ఫోటోలు, వారితో జరిపిన అభ్యంతరకర చాటింగ్‌లు, కొన్ని వీడియోలను పోలీసులు రికవరీ చేశారు. వీటి ద్వారా మహిళలను బ్లాక్‌మెయిల్ కూడా చేస్తున్నారా అనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేస్తోంది.
సీఎం యోగి సీరియస్.. గ్యాంగ్‌స్టర్ చట్టం ప్రయోగం!
ఈ వ్యవహారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా పరిగణించారు. రాష్ట్రంలో ఇలాంటి చట్టవ్యతిరేక, బలవంతపు మత మార్పిడి చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. నిందితులందరిపై కఠినమైన 'గ్యాంగ్‌స్టర్ చట్టం' కింద కేసులు నమోదు చేయాలని, వారి ఆస్తులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటివరకు 10 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నాసిక్‌లోని ఓ బహుళజాతి కంపెనీలో చోటుచేసుకున్న బలవంతపు మత మార్పిళ్లు, లైంగిక వేధింపుల ఉదంతం మరువక ముందే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో భారీ మత మార్పిడి ముఠా గుట్టురట్టయింది. మీర్జాపుర్ కేంద్రంగా జిమ్‌లలో చేరే హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను పోలీసులు తాజాగా బట్టబయలు చేశారు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
వెలుగులోకి తెచ్చిన బాధితురాలి ఫిర్యాదు
ముఠా ఆపరేషన్ సాగిందిలా.. 'సన్నో' ప్రధాన సూత్రధారి!
ఫోన్లలో వందలాది చాట్లు, వీడియోలు లభ్యం
సీఎం యోగి సీరియస్.. గ్యాంగ్‌స్టర్ చట్టం ప్రయోగం!
వెలుగులోకి తెచ్చిన బాధితురాలి ఫిర్యాదు
ముఠా ఆపరేషన్ సాగిందిలా.. 'సన్నో' ప్రధాన సూత్రధారి!
ఫోన్లలో వందలాది చాట్లు, వీడియోలు లభ్యం
సీఎం యోగి సీరియస్.. గ్యాంగ్‌స్టర్ చట్టం ప్రయోగం!
వెలుగులోకి తెచ్చిన బాధితురాలి ఫిర్యాదు
ముఠా ఆపరేషన్ సాగిందిలా.. 'సన్నో' ప్రధాన సూత్రధారి!
ఫోన్లలో వందలాది చాట్లు, వీడియోలు లభ్యం
సీఎం యోగి సీరియస్.. గ్యాంగ్‌స్టర్ చట్టం ప్రయోగం!

