By - TV5 Entertainment |19 May 2026 3:27 PM IST
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) గ్లింప్స్ కు అంతా సిద్ధం అయింది.
మామూలుగా అయితే గ్లింప్స్ అంటే కొన్ని సెకన్స్ లో ఉంటుంది. లేదంటే కనీసం ఒక నిమిషం వరకు ఉంటుంది. బట్ వీళ్లు అలాగ కాదు. ఏకంగా ఈ గ్లింప్స్ ను 4 నిమిషాలు కట్ చేశారు. 4నిమిషాల గ్లింప్స్ అంటే ఫ్యాన్స్ కి అంతులేని సంతోషాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. దీంతో పాటు మూవీ బాగా ఆలస్యం అయింది కాబట్టి.. ఆ ఆలస్యానికి కవర్ చేస్తూ కూడా ఈ నాలుగు నిమిషాల గ్లింప్స్ ఉంటుందనుకోవచ్చు. బట్ ఇవన్నీ కాకుండా కేవలం ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కాబట్టి అతని ప్రీవియస్ మూవీస్ అయిన కేజీఎఫ్ ను ఫాలో చేస్తూ ఇంత పెద్ద గ్లింప్స్ ను రెడీ చేసి ఉండొచ్చు.
ఇక ఈ గ్లింప్స్ ను ఇవాళ రాత్రి 11:52 గంటలకు విడుదల చేస్తాం అని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న మూవీ కాబట్టి ఆ మేరకు హడావిడీ కూడా ఉంటుంది. ఇక ఈ గ్లింప్స్ ను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేస్తున్నాం అని కూడా మైత్రీవాళ్లు ప్రకటించారు. మరి ఈ గ్లింప్స్ ఎలా ఉండబోతోంది అని అంచనాకు కూడా అందకుండా ఉండిపోయింది. నాలుగు నిమిషాల్లో ఎన్టీఆర్ ఎంత సేపు కనిపిస్తాడు..? డైలాగ్స్ ఉంటాయా..? కేవలం స్క్రీన్ ప్రజెన్స్ తో మాత్రమే మెస్మరైజ్ చేస్తాడా..? అంటూ రకరకాల ప్రశ్నలు మాత్రం ఉండిపోయాయి. మరి ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ అర్థరాత్రి వరకు తెలిసిపోతుంది.
డ్రాగన్ గ్లింప్స్ తో పాటు రేపు ఎన్టీఆర్ బర్త్ డే రోజున అయిన గాడ్ ఆఫ్ వార్ అనే త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ అప్డేట్ కూడా వస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు నిర్మాత నాగవంశీ ప్లాన్ కూడా చేశాడట. అలాగే దేవర 2 నుంచి ఓ పోస్టర్ కూడా వస్తుందని చెబుతున్నారు. ఏదేమైనా ముందు ఈ గ్లింప్స్ పై భారీ అంచనాలైతే ఉన్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) గ్లింప్స్ కు అంతా సిద్ధం అయింది. మామూలుగా అయితే గ్లింప్స్ అంటే కొన్ని సెకన్స్ లో ఉంటుంది. లేదంటే కనీసం ఒక నిమిషం వరకు ఉంటుంది. బట్ వీళ్లు అలాగ కాదు. ఏకంగా ఈ గ్లింప్స్ ను 4 నిమిషాలు కట్ చేశారు. 4నిమిషాల గ్లింప్స్ అంటే ఫ్యాన్స్ కి అంతులేని సంతోషాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. దీంతో పాటు మూవీ బాగా ఆలస్యం అయింది కాబట్టి.. ఆ ఆలస్యానికి కవర్ చేస్తూ కూడా ఈ నాలుగు నిమిషాల గ్లింప్స్ ఉంటుందనుకోవచ్చు. బట్ ఇవన్నీ కాకుండా కేవలం ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కాబట్టి అతని ప్రీవియస్ మూవీస్ అయిన కేజీఎఫ్ ను ఫాలో చేస్తూ ఇంత పెద్ద గ్లింప్స్ ను రెడీ చేసి ఉండొచ్చు.

