Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pakistan: పాకిస్థాన్  సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!

Pakistan: పాకిస్థాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!

TV5 News 1 week ago

By - jyotsna |15 May 2026 11:30 AM IST

ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంత్నంలో కేవలం వారం వ్యవధిలో ఇలాంటి ఆత్మాహుతి దాడి రెండోసారి.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు అదే తీవ్ర సమస్యగా మారుతోంది.

భారత్‌పై దాడుల కోసం ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం, ఆర్థిక సహాయం అందిస్తున్న పాక్‌కు ఇప్పుడు ఆ సంస్థల నుంచే ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా తహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) వరుస దాడులతో ఆ దేశ భద్రతా వ్యవస్థను సవాల్ చేస్తోంది.

తాజాగా ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బాజౌర్ ప్రాంతంలో ఉన్న ఓ మిలిటరీ క్యాంపుపై భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ముందుగా సైనిక స్థావరం వద్ద శక్తివంతమైన పేలుడు సంభవించగా, ఆ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని ఆయుధాలతో వచ్చిన ఉగ్రవాదులు క్యాంపులోకి చొరబడ్డారు. అనంతరం సైనికులు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో కనీసం 15 మంది సైనికులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.

ఈ దాడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ తహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ బాధ్యత వహించింది. తమ 'స్పెషల్ ఇస్తషాదీ ఫోర్సెస్' ద్వారా ఈ దాడి నిర్వహించినట్లు టీటీపీ ప్రకటించింది. 2025 అక్టోబర్‌లో క్వెట్టాలో జరిగిన దాడి తర్వాత టీటీపీ అధికారికంగా బాధ్యత స్వీకరించిన ప్రధాన ఆత్మాహుతి దాడి ఇదే కావడం గమనార్హం.

ఇదిలా ఉండగా, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండో ఆత్మాహుతి దాడి ఇది. మంగళవారం లక్కీ మర్వత్ జిల్లాలోని నౌరంగ్ బజార్‌లో పేలుడు పదార్థాలతో నిండిన ఆటో రిక్షాతో మరో దాడి జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఒక మహిళ సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ప్రభావంతో సమీపంలోని దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇదే ప్రాంతంలో జరిగిన మరో ఉగ్రదాడిలో ఐదుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు. వరుస దాడులతో బాజౌర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు అదే తీవ్ర సమస్యగా మారుతోంది. భారత్‌పై దాడుల కోసం ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం, ఆర్థిక సహాయం అందిస్తున్న పాక్‌కు ఇప్పుడు ఆ సంస్థల నుంచే ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా తహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) వరుస దాడులతో ఆ దేశ భద్రతా వ్యవస్థను సవాల్ చేస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu