Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PEDDI Trailer  :  ఆటే నా పొగరు.. పెద్ది ట్రైలర్ అదిరిపోయిందిగా..

PEDDI Trailer : ఆటే నా పొగరు.. పెద్ది ట్రైలర్ అదిరిపోయిందిగా..

TV5 News 6 days ago

By - TV5 Entertainment |18 May 2026 4:56 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ పెద్ది. పెద్ది ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూడగానే ఒక్కటే మాట..

మైండ్ బ్లోయింగ్. అంతే.. ఆ స్థాయిలో ఉంది ట్రైలర్. ముందు నుంచీ చాలామంది ఈ ట్రైలర్ పై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. బట్ అలా పెంచిన అంచనాలను కూడా దాటేస్తూ సాగింది ట్రైలర్. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ ట్రైలర్ ఇంకే సినిమాలోనూ లేదు అంటే అతిశయోక్తి కాదు. రామ్ చరణ్ అద్భుతమైన డెప్త్ ఉంది అనేది క్లియర్ గా తెలుస్తోంది.

'ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లే మారుతుంది కానీ ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు.. పెద్ది ఏరియాలో ఏమైనా దేవుడి పేరా..' అంటూ బొమన్ ఇరానీ డైలాగ్ తో స్టార్ట్ అయింది ట్రైలర్. తర్వాత చరణ్ కు సంబంధించిన షాట్స్ అదిరిపోయాయి. 'ఆటే నా పొగరు'అనే చరణ్ డైలాగ్ అదిరింది. తర్వాత జాన్వీ కపూర్ ఎంట్రీతో ట్రైలర్ స్లో అయినట్టుగా తెలుస్తోంది. 'నాకు ఆట గెలవడం కాదు.. బతకడం కాదు..'అంటూ శివరాజ్ కుమార్ డైలాగ్ తో అతని ఎంట్రీ అదిరిపోయింది. 'మనమందరమూ ఒకే భూమ్మీద పుట్నెప్పుడూ.. నువ్వున్న చోట మనిసికి ఇలువెక్కువా' అనే జగపతిబాబు డైలాగ్.. ఆ డైలాగ్ తో పాటు వచ్చిన విలన్ గ్యాంగ్ ఎంట్రీ.. వాళ్ల ఎలివేషన్స్. 'ఊరు పేరూ లేని నా కొడుకులకీ పిలిసి పని ఇయ్యడవే ఎక్కువ'అనే మరో డైలాగ్.. 'వాడికి ఆట ఆడ్డమే తెలుసు.. మనకు ఆట ఆడించడమూ తెలుసు.. ఎక్కడ్రా ఈ ఆటకూలి నాకొడుకు' అనే దివ్యేందు శర్మ డైలాగ్.. దాంతో పాటు వచ్చిన యాక్షన్ ఎపిసోడ్.. అద్దరిపోయింది అంతే. ముఖ్యంగా బుల్లెట్ ను తిప్పుతూ.. ఒకేసారి ఐదారుమందిని కొట్టిన షాట్ అద్భుతం. 'మాటల్తో కాదు.. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవడికి ఉందో రమ్మను'అనే చరణ్ డైలాగ్. రెండు ఆటలను ఆడే వాడిని పిలిచే పేరు అంటూ 'క్రాస్ ఓవర్ అథ్లెట్'అని బొమన్ ఇరానీ ఎలివేషన్. గెలుపైనా ఓటమి అయినా ఈ కిందకొండ ఊరోడిదో అవ్వాలి'అంటూ రామ్ చరణ్ హైలెట్ గా సాగించిన కుస్తీ పోటీ. మూడు నిమిషాలు పాటు ఉన్న ట్రైలర్ లో 2.28 నిమిషాల నుంచి ట్రైలర్ మరో స్థాయిలో ఉంది. ఈ ఆటల కోసం చరణ్ సాగించిన ప్రయాణం, పెయిన్ ఫుల్ జర్నీ, అవమానాలు, అన్నిటినీ దాటుకుని గెలిచిన తీరు మాత్రం ఎక్స్ ట్రార్డినరీగా ఉంది అంటే అది కూడా చిన్న మాటే అవుతుంది.

ఏదేమైనా పెద్ది ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పారు. అంటే ఇదో సవాల్ కూడా. మామూలుగా ఇలాంటి కథల్లో ట్రైలర్ మొత్తం చెబితే కిక్ పోతుంది. బట్ పెద్ది ట్రైలర్ లో ఆ కిక్ డబుల్ అయింది. అలాగే సినిమా మొత్తం తెలిసిన తర్వాత ఆడియన్స్ కు ఆ కిక్ ఉండాలి అంటే కథనంలో దమ్ముండాలి. కథనంలో బలం ఉండాలి. కథనంలో సంఘర్షణ ఉండాలి. అవన్నీ రైట్ ప్లేస్ లో పడితే అది మామూలుగా ఉండదు అనేది క్లియర్. ఏదేమైనా పెద్ది ట్రైలర్ తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెంచారు అనేది మాత్రం స్పష్టం. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా కూడా ఉంటుందా లేదా అనేది జూన్ 4న తేలిపోతుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ పెద్ది. పెద్ది ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూడగానే ఒక్కటే మాట.. మైండ్ బ్లోయింగ్. అంతే.. ఆ స్థాయిలో ఉంది ట్రైలర్. ముందు నుంచీ చాలామంది ఈ ట్రైలర్ పై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. బట్ అలా పెంచిన అంచనాలను కూడా దాటేస్తూ సాగింది ట్రైలర్. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ ట్రైలర్ ఇంకే సినిమాలోనూ లేదు అంటే అతిశయోక్తి కాదు. రామ్ చరణ్ అద్భుతమైన డెప్త్ ఉంది అనేది క్లియర్ గా తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu