By - TV5 Entertainment |18 May 2026 12:03 PM IST
ఇవాళ సాయంత్రం పెద్ది మూవీ ట్రైలర్ విడుదల కాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ ఇది.
బుచ్చిబాబు సానా డైరెక్టర్. ట్రైలర్ పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ ఓ రేంజ్ లో ఉండబోతోంది అనే టాక్ బలంగా ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని కూడా చాలామంది భావిస్తున్నారు. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ లో చరణ్ కనిపించబోతున్నాడు అని ఆల్రెడీ వచ్చిన రెండు గ్లింప్స్ చూస్తే అర్థం అయింది. ఇక ట్రైలర్ తర్వాత ఎక్స్ పెక్టేషన్స్ ఇంకెక్కడికో వెళ్లిపోతాయి అని అనుకుంటున్నారు.
ఇక ఇదే సందర్భంలో ఈ నెల 20న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న మూవీ డ్రాగన్ గ్లింప్స్ కూడా విడుదల కాబోతోంది. ఈ గ్లింప్స్ పై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ గ్లింప్స్ ను ఏకంగా 4 నిమిషాల పాటు ఉంటుందని చెప్పారు. అంటే ట్రైలర్ కంటే పెద్దగానే అని కదా. మరి ఈ గ్లింప్స్ ఎలా ఉంటుంది అనే అంచనా అప్పుడే కూడా వేయలేం. బట్ ఈ గ్లింప్స్ మూవీ బాగా ఆలస్యమైన దానికి సమాధానంగా ఉండబోతోంది అని చెబుతున్నారు. మూవీ మొదట అనుకున్న కథలో చాలా మార్పులు చేశారు. అందుకే ఈ మూవీ రిలీజ్ డేట్ ఏకంగా ఏడాదిపాటు ఆలస్యంగా ఉండబోతోంది. ఆ యేడాది పాటు లేట్ అయినా ఆడియన్స్ లో క్రేజ్ పెంచేందుకే ఈ గ్లింప్స్ ను డిజైన్ చేశారట.
మొత్తంగా పెద్ది ట్రైలర్ విడుదలైన రెండో రోజు నుంచే డ్రాగన్ గ్లింప్స్ వస్తోంది. అంటే ఈ రెండు సినిమాల ఏ వీడయోస్ కు ఎక్కువ మైలేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు ఆడియన్స్. ముఖ్యంగా ఇద్దరు హీరోల అభిమానులు రెండు సినిమాలపై భారీ ఎక్స్ పెక్టేషన్ పెట్టుకున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో దేనికి ఎక్కువ అప్లాజ్ వస్తుంది అనుకుంటున్నారో చూడాలి.
ఇవాళ సాయంత్రం పెద్ది మూవీ ట్రైలర్ విడుదల కాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ ఇది. బుచ్చిబాబు సానా డైరెక్టర్. ట్రైలర్ పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ ఓ రేంజ్ లో ఉండబోతోంది అనే టాక్ బలంగా ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని కూడా చాలామంది భావిస్తున్నారు. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ లో చరణ్ కనిపించబోతున్నాడు అని ఆల్రెడీ వచ్చిన రెండు గ్లింప్స్ చూస్తే అర్థం అయింది. ఇక ట్రైలర్ తర్వాత ఎక్స్ పెక్టేషన్స్ ఇంకెక్కడికో వెళ్లిపోతాయి అని అనుకుంటున్నారు.

