Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PM Modi:  మోదీకి నార్వే అత్యున్నత పౌర పురస్కారం

PM Modi: మోదీకి నార్వే అత్యున్నత పౌర పురస్కారం

TV5 News 6 days ago

By - jyotsna |19 May 2026 8:30 AM IST

140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని వ్యాఖ్య

ప్రధాని మోడీకి అరుదైన గౌరవం దక్కింది. నార్వేకు చెందిన అత్యున్నత పురస్కారం లభించింది.

గ్రాండ్ క్రాస్ ఆఫ్ రాయల్ నార్వేజియన్ ఆర్డర్ పురస్కారం అందుకున్నారు. ఓస్లోలో నార్వే రాజు నుంచి ప్రధాని మోడీ పురస్కారం అందుకున్నారు. ప్రపంచం నుంచి మోడీ 32వ ప్రధాన పురస్కారాన్ని అందుకున్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని మోడీ పేర్కొన్నారు.

ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనల భాగంగా సోమవారం మోడీ నార్వేకు చేరుకున్నారు. ఓస్లోలో ఘనస్వాగతం లభించింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది. అనంతరం నార్వేకు చెందిన అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్''ను మోడీకి ప్రదానం చేశారు. విదేశాల నుంచి ప్రధాని మోడీ అందుకున్న 32వ ప్రధాన అంతర్జాతీయ పురస్కారం ఇది.

''గ్రాండ్ క్రాస్'' అనేది రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో అత్యున్నత శ్రేణి పురస్కారమని, అసాధారణమైన సేవలు అందించిన వ్యక్తులకు మాత్రమే దీనిని ప్రదానం చేస్తారని నార్వే ప్రభుత్వం పేర్కొంది. గౌరవాన్ని అందుకున్న అనంతరం మోడీ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ''రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గ్రాండ్ క్రాస్‌ను అందుకోవడం నాకు గౌరవంగా ఉంది. ఈ గౌరవాన్ని భారతదేశ ప్రజలకు, బలమైన భారత్-నార్వే స్నేహానికి అంకితం చేస్తున్నాను. ఇది ప్రపంచ పురోగతికి మన ఉమ్మడి నిబద్ధతను ప్రదర్శిస్తుంది.'' అని పేర్కొన్నారు.

ప్రధాని మోడీకి అరుదైన గౌరవం దక్కింది. నార్వేకు చెందిన అత్యున్నత పురస్కారం లభించింది. గ్రాండ్ క్రాస్ ఆఫ్ రాయల్ నార్వేజియన్ ఆర్డర్ పురస్కారం అందుకున్నారు. ఓస్లోలో నార్వే రాజు నుంచి ప్రధాని మోడీ పురస్కారం అందుకున్నారు. ప్రపంచం నుంచి మోడీ 32వ ప్రధాన పురస్కారాన్ని అందుకున్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని మోడీ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu