By - Radhisha |16 May 2026 11:25 AM IST
ప్రధాని నరేంద్ర మోడీ మొన్న హైదరాబాద్ కు వచ్చినప్పుడు కొన్ని రకాల సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు.
అలాగే సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కాన్వాయ్ లు తగ్గించుకోవాలని, ప్రజలు, అధికారులు కూడా వీలైనంత వరకు ప్రజా రవాణాను వాడాలన్నారు. అనవసరపు విదేశీ ప్రయాణాలు చేయొద్దని కోరారు. ఇలా అనేక విషయాల్లో ఖర్చులు తగ్గించుకుని ప్రభుత్వాలు భారాలను తగ్గించుకోవాలని సూచించారు. అయితే ప్రధాని ఇలా పిలుపునివ్వడం వెనక కూడా ఒక కారణం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ కు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దాని ఎఫెక్ట్ ఈ రోజు నుంచి క్లియర్ గా కనిపిస్తోంది.
అంటే మోడీ అలా సూచనలు చేయడం వెనక అసలు కారణం ఇదేనా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. వాస్తవానికి యుద్ధం మొదలైనప్పటి నుంచే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. మన దేశంలో ఆయిల్ కంపెనీలు ఎప్పటి నుంచో వేలకోట్లు నష్టపోతున్నాయి. కానీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ధరలు పెంచాలని ఇన్ని రోజులు ఆగినట్టు క్లియర్ గా అర్థం అవుతోంది.
అంటే మోడీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయని ముందే తెలిసి ఇలా చేశారా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కావాలనే మోడీ ఇలా చేశారని కొందరు అంటుంటే.. పెట్రోల్, డీజిల్ వీలైనంత అందుబాటులో ఉంచాల్సింది పోయి ఇలా ఖర్చులు తగ్గించుకోమంటారా అని ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. ఇలా రకరకాలుగా పోస్టులు పెడుతూ మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ మొన్న హైదరాబాద్ కు వచ్చినప్పుడు కొన్ని రకాల సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. అలాగే సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కాన్వాయ్ లు తగ్గించుకోవాలని, ప్రజలు, అధికారులు కూడా వీలైనంత వరకు ప్రజా రవాణాను వాడాలన్నారు. అనవసరపు విదేశీ ప్రయాణాలు చేయొద్దని కోరారు. ఇలా అనేక విషయాల్లో ఖర్చులు తగ్గించుకుని ప్రభుత్వాలు భారాలను తగ్గించుకోవాలని సూచించారు. అయితే ప్రధాని ఇలా పిలుపునివ్వడం వెనక కూడా ఒక కారణం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ కు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దాని ఎఫెక్ట్ ఈ రోజు నుంచి క్లియర్ గా కనిపిస్తోంది.

