By - Sathwik |17 May 2026 10:00 AM IST
సరెండర్ చేశామన్న కేంద్రమంత్రి బండి సంజయ్- అరెస్ట్ చేశామంటున్న పోలీసులు
పోక్సో కేసులో బండి భగీరథ్ వ్యవహారం శనివారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారా? లేక స్వచ్ఛందంగా లొంగిపోయారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు పోలీసులు తమ చర్యలను అధికారికంగా వివరించగా, మరోవైపు కుటుంబ సభ్యుల వాదనలు భిన్నంగా ఉండటంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ కేసు మొదటి నుంచి సున్నితంగా మారడంతో పోలీసులు కూడా దీనిని అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్నారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కేసులో బండి భగీరథ్‌ను శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారులోని నార్సింగి ప్రాంతంలో ఉన్న పోలీసు అకాడమీ సమీపంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అనంతరం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసుకు సంబంధించిన అంశాలపై అధికారులు విచారణ నిర్వహించారు. ఈ కేసులో భగీరథ్ అరెస్ట్ ఆలస్యమవుతోందంటూ వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.
వేగంగా మారిన పరిణామాలు
కేసు నమోదైన తర్వాత నుంచి నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని భావించిన పోలీసులు శనివారం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. భగీరథ్‌తో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, అతని స్నేహితులు, బంధువుల కదలికలపై నిఘా పెట్టినట్లు తెలిసింది. అలాగే బండి సంజయ్ నివాసంలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఆలస్యమవుతుండటం, రాజకీయంగా ఒత్తిడి పెరగడం వల్ల కుటుంబంపై కూడా మానసిక ఒత్తిడి ఏర్పడినట్లు ప్రచారం సాగింది. ఈ కేసు విచారణలో భాగంగా బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు నమోదు చేశారు. సుమారు నలభై నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగినట్లు సమాచారం. కేసులోని కీలక అంశాలపై అధికారులకు ఈ వాంగ్మూలాలు ఉపయోగపడనున్నాయి. భగీరథ్ అరెస్టు అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. తన కుమారుడికి ముందస్తు బెయిల్ వస్తుందని ఆశించి ఇంతవరకు వేచి చూసినట్లు ఆయన వెల్లడించారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులకు అప్పగించాలనే ఆలోచన ఉన్నప్పటికీ, న్యాయవాదుల సలహా మేరకు బెయిల్ కోసం ప్రయత్నించామని పేర్కొన్నారు. అయితే కేసు మరింత ఆలస్యం చేయడం సరైంది కాదని భావించి, న్యాయవాదుల ద్వారా విచారణకు హాజరయ్యేలా చేసినట్లు ఆయన తెలిపారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని కూడా పేర్కొన్నారు.
అయితే ఇక్కడే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భగీరథ్‌ను తమవైపు నుంచి పోలీసులకు అప్పగించామని బండి సంజయ్ చెప్పగా, సైబరాబాద్ పోలీసు కమిషనర్ మాత్రం నార్సింగిలో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో అసలు అతను స్వయంగా లొంగిపోయాడా? లేక పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అన్న అంశంపై చర్చ మొదలైంది. శనివారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో భగీరథ్ తెల్లని హుడీ ధరించి, ముఖానికి మాస్క్ వేసుకుని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అతనితో పాటు పలువురు న్యాయవాదులు కూడా ఉన్నారు. ఆయన వచ్చిన కొద్ది నిమిషాలకే విచారణాధికారి, కూకట్‌పల్లి డీసీపీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విచారణ ప్రారంభించారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి మేడ్చల్ జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. పోలీసుల నివేదికలు, కేసు వివరాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అతణ్ని చర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో ఉదయం నుంచి సాగిన ఉత్కంఠకు తెరపడింది. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర అంశం కూడా బయటకు వచ్చింది. భగీరథ్ స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోతాడనే సమాచారం ముందుగానే పోలీసు వర్గాలకు అందినట్లు తెలిసింది. అందుకే ఉదయం నుంచే పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అదనపు సిబ్బందిని మోహరించారు. పంచనామా ప్రక్రియ కోసం రెవెన్యూ సిబ్బందిని కూడా ముందుగానే సిద్ధంగా ఉంచారు. అలాగే వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ వైద్యులను కూడా సమయానికి రప్పించినట్లు సమాచారం. అయితే చివరకు పోలీసులే నార్సింగిలో అదుపులోకి తీసుకున్నామని ప్రకటించడంతో మొత్తం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అరెస్టా? లొంగుబాటా? అన్న చర్చ మధ్య భగీరథ్‌పై నమోదైన కేసు ఇప్పుడు న్యాయపరమైన దశలోకి ప్రవేశించింది. తదుపరి విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు ఈ కేసు దిశను నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది.
పోక్సో కేసులో బండి భగీరథ్ వ్యవహారం శనివారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారా? లేక స్వచ్ఛందంగా లొంగిపోయారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు పోలీసులు తమ చర్యలను అధికారికంగా వివరించగా, మరోవైపు కుటుంబ సభ్యుల వాదనలు భిన్నంగా ఉండటంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ కేసు మొదటి నుంచి సున్నితంగా మారడంతో పోలీసులు కూడా దీనిని అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్నారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కేసులో బండి భగీరథ్‌ను శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారులోని నార్సింగి ప్రాంతంలో ఉన్న పోలీసు అకాడమీ సమీపంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అనంతరం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసుకు సంబంధించిన అంశాలపై అధికారులు విచారణ నిర్వహించారు. ఈ కేసులో భగీరథ్ అరెస్ట్ ఆలస్యమవుతోందంటూ వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.
వేగంగా మారిన పరిణామాలు
వేగంగా మారిన పరిణామాలు
వేగంగా మారిన పరిణామాలు

