Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
POCSO CASE: బండి భగీరథ్‌కు మరో బిగ్ షాక్

POCSO CASE: బండి భగీరథ్‌కు మరో బిగ్ షాక్

TV5 News 1 week ago

By - Sathwik |18 May 2026 11:30 AM IST

మరో సెక్షన్ చేర్చిన పోలీసులు

వివాదాస్పదంగా మారిన పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్‌కు మరో కీలక పరిణామం ఎదురైంది.

ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన ఈ వ్యవహారంలో దర్యాప్తు అధికారులు మరింత తీవ్రమైన ఆరోపణలను చేర్చడం కేసును కొత్త మలుపు తిప్పింది. ఇప్పటివరకు లైంగిక వేధింపుల ఆరోపణలతో కొనసాగుతున్న కేసులో, ఇప్పుడు బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు పేర్కొంటూ అదనపు సెక్షన్లను నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ తాజా పరిణామాలతో కేసు తీవ్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. మైనర్ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా బండి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో సేకరించిన వివరాల ఆధారంగా పోలీసులు BNS 64(2)(m) సెక్షన్‌ను కూడా చేర్చినట్లు సమాచారం. ఈ సెక్షన్ ప్రకారం ఆరోపణలు కోర్టులో రుజువైతే నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భగీరథ్‌పై BNS 64(2)(m), BNS 74, BNS 75తో పాటు POCSO చట్టంలోని 5(1) రీడ్ విత్ 6 సెక్షన్ల కింద కేసులు కొనసాగుతున్నాయి.

ఈ కేసు మొదట మే 8న బాధితురాలి ఫిర్యాదుతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. కేసు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అధికారులు విచారణను వేగవంతం చేశారు. కేసు నమోదైన కొన్ని రోజుల తర్వాత బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. తన కుమారుడు చట్టంపై గౌరవంతో స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట హాజరయ్యాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. అయితే మరోవైపు పోలీసులు మాత్రం తామే అతడిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. మే 16న భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద ఉన్న ఐఫోన్ 17 మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. దర్యాప్తులో భాగంగా మొబైల్‌లో ఉన్న చాటింగ్‌లు, సందేశాలు, ఫోటోలు, వీడియోలతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా బాధితురాలితో సంబంధం ఉన్న సీసీటీవీ దృశ్యాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ నివేదిక వెలువడిన తర్వాత కేసులో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ కేసు నేపథ్యంలో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపైనా పోలీసులు దృష్టి సారించారు. కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు భారీ మొత్తంలో డబ్బు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా కంటెంట్ ప్రచారం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మద్దతుగా పోస్టులు చేయడం, పరోక్షంగా బాధితురాలి వివరాలను వెల్లడించేలా వ్యవహరించడం కూడా చట్టపరంగా నేరమేనని అధికారులు పేర్కొంటున్నారు. ఈ అంశాలపై కూడా పోలీసులు ప్రత్యేకంగా కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

వివాదాస్పదంగా మారిన పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్‌కు మరో కీలక పరిణామం ఎదురైంది. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన ఈ వ్యవహారంలో దర్యాప్తు అధికారులు మరింత తీవ్రమైన ఆరోపణలను చేర్చడం కేసును కొత్త మలుపు తిప్పింది. ఇప్పటివరకు లైంగిక వేధింపుల ఆరోపణలతో కొనసాగుతున్న కేసులో, ఇప్పుడు బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు పేర్కొంటూ అదనపు సెక్షన్లను నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ తాజా పరిణామాలతో కేసు తీవ్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. మైనర్ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా బండి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో సేకరించిన వివరాల ఆధారంగా పోలీసులు BNS 64(2)(m) సెక్షన్‌ను కూడా చేర్చినట్లు సమాచారం. ఈ సెక్షన్ ప్రకారం ఆరోపణలు కోర్టులో రుజువైతే నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భగీరథ్‌పై BNS 64(2)(m), BNS 74, BNS 75తో పాటు POCSO చట్టంలోని 5(1) రీడ్ విత్ 6 సెక్షన్ల కింద కేసులు కొనసాగుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TV5 Telugu